"ఇష్టం అయిన టవల్ .. " కథ
------------------------------------
పిల్లలకి యోగా పాఠాలు చెప్పే ప్రసాద్ మాస్టర్ కి రోజు స్నానం చేయాలంటే ఇబ్బందిగా తయారైంది ఎందుకంటే కారణం తన ఎంతో ఇష్టంగా కొనుక్కున్న టవల్ లేకపోవటం.నాలుగు స్కూల్లో రోజుకు ఒక తరగతి చొప్పున యోగా మాస్టర్ గా పనిచేస్తున్నాడు ప్రసాద్ అయితే యోగాకి వెళ్లే ప్రతి స్కూల్లోనూ స్ట్రెచ్ అయ్యే దుస్తులు వేసుకోమని చెప్పాడు కానీ అన్ని స్కూల్లో అందరూ విద్యార్థులు ఒకేలాగా ఉండరు కదా అలాగే.. ఒక స్కూల్లో పిల్లలకి స్ట్రెచ్ పాంట్స్ ట్రాక్స్ లేవు సో వాళ్లు తమ స్కూల్ డ్రెస్ లోనే యోగా చేసేవాళ్ళు
ఒకరోజు అనుకోకుండా బాగా హెల్తీగా ఉన్న ఒక పిల్లాడు కాళ్ళను అటు ఇటు స్ట్రెచ్ చేసినప్పుడు ప్యాంట్ మధ్యలో చినిగింది ఆ ఏముందిలే చిన్నపిల్లడే కదా అలాగే పంపిద్దాం అనుకుంటే ఆ పిల్లోడు.. టెన్త్ క్లాస్ పిల్లోడు మరి... కాస్త సిగ్గు ఎక్కువ కదా...
ఏం చేద్దాం అనుకొని తన దగ్గర ఉన్న టర్కీ టవల్ ఇచ్చాడు... ఇచ్చేటప్పుడు..
ఏం చేద్దాం అనుకొని తన దగ్గర ఉన్న టర్కీ టవల్ ఇచ్చాడు... ఇచ్చేటప్పుడు..
" బాబు ఈ టవల్ కట్టుకొని ఇంటికి వెళ్ళు.... అందరూ నవ్వుతారు అని ఫీల్ అవ్వకు రేపు నాకు తెచ్చి చేద్దువు గాని" అని చెప్పాడు
సరే అలాగే మాస్టారు అని కట్టుకొని వెళ్ళాడు ఆ పిల్లోడు.. ఆ తర్వాత చూద్దాం కదా ఎన్ని రోజులు అడిగినా
అయ్యో మర్చిపోయా అంటున్నాడు కానీ తన టవల్ని తిరిగి తెచ్చేయట్లేదు.
ఆ టవలుకి కూడా ఒక చరిత్ర ఉంది తను ఎప్పటినుంచో చిన్నప్పటినుంచి పల్లెటూరులో ఉన్నప్పటి నుంచి వాడితే చినిగిపోయిన టవల్ గాని లేకపోతే ఆ పల్చగా ఉండే టవల్స్ గాని వాడేవాడు ప్రసాదు.. . ఎవరైనా చుట్టాలు గాని ఫ్రెండ్స్ గాని.. మంచి టర్కీ టవల్ చూసి వాడుతున్నప్పుడు అసూయగాను అవమానంగా అనిపించేది. ఒకసారి షాపింగ్ మాల్ కి వెళ్ళినప్పుడు మంచి టర్కీ టవల్ కనిపించింది తన దగ్గర అంత డబ్బు తక్కువ ఉన్న తన కోరిక తీర్చుకోవాలి.. అని ఆ టవల్ని అపురూపంగా కొనుక్కున్నాడు.
కానీ అయ్యో పాపం ఈ విద్యార్థి చినిగిన ప్యాంటుతో మూలాంగా ఏముంది ఒక్క రోజుకే కదా అని ఇచ్చేశాడు తన మంచితనాని రుజువు చేస్తూ.
తీరా చూస్తే ఆ పిల్లోడేమో ప్రతిరోజు ఏదో ఒక సాకు చెప్తున్నాడు ఇదిలా కాదు అని చెప్పి ఒక రోజు ప్రసాద్ మాస్టర్ బడి అయిపోయిన తర్వాత ఆ విద్యార్థితో పాటు
"పద నాయనా" అంటూ అతని భుజం మీద చేయి వేస్తూ వాళ్ళ ఇంటి వైపు నడక సాగించాడు. ఇదంతా ఎందుకు తనే డైరెక్ట్ గా ఇంటికి వెళ్లి తీసుకుందామని
తీరా ఇంటికి వెళ్ళాక ఆ విద్యార్థి తల్లి మాస్టారు ని పలకరించి పిల్లవాడి బాగోగులు అడిగి తెలుసుకున్నాక ప్రసాద్ మాస్టరు తన వచ్చిన విషయం ఏంటో చెప్పటానికి తడబడుతూనే చివరికి పది రోజుల క్రితం మీ అబ్బాయికి ఒక టవల్ కట్టి పంపించాను గుర్తుందా అని అడిగాడు
అవును అన్నారు ఆవిడ
ఆ టవల్ కోసమే మళ్లీ వచ్చాను అని అడిగితే
"అంటే ఏమో కనపడట్లేదు ఉతికాను ఆరేసాను ఆ తర్వాత మళ్లీ కనపడట్లేదు కనిపించాక మళ్ళీ చెప్తాను" అన్నది ఆ తల్లి
ప్రసాద్ కి ఏం చేయాలో అర్థం కాలేదు ఇక చేసేదేమీ లేక అక్కడ నుంచి తిరిగి ఇంటికి వచ్చేసాడు
"అయ్యో పాపం అనుకుంటే కృతజ్ఞత లేకుండా పోయిందే మనుషుల్లో" అని తనలో తానే బాధపడ్డాడు
కొన్ని రోజుల తర్వాత ఇక ఆ టవలు మళ్లీ తిరిగి వచ్చేలాగా లేదు అనుకొని కాస్త కష్టమైనా మళ్లీ ఇంకో టవల్ కొనుక్కున్నాడు.
ఆ తర్వాత విద్యార్థులకు ఎలాంటి ఆపద వచ్చినా ఏ అసౌకర్యం కలిగిన తోటి విద్యార్థులను సహాయం చేయండి అని చెప్పాడే తప్ప తను ఏ సహాయానికి పూనుకోలేదు.. అలా మాస్టారు గారి మంచితనం చచ్చిపోయింది.--- సమాప్తం --
No comments:
Post a Comment