Showing posts with label స్టోరీ 22 : ఓ కాఫీ బ్రేక్ కథ .. కథ. Show all posts
Showing posts with label స్టోరీ 22 : ఓ కాఫీ బ్రేక్ కథ .. కథ. Show all posts

Wednesday, December 10, 2025

స్టోరీ 22 : ఓ కాఫీ బ్రేక్ కథ .. కథ

ఓ కాఫీ బ్రేక్ కథ .. కథ

=≠===============
✍️ హరీష్

రోహిత్, బాలాజీ అదే కంపెనీ లో దాదాపు ఒకేసారి జాయిన్ అయ్యారు.. కానీ బాలాజీ కి పని మీద పట్టు తక్కువ సో.. రోహిత్ హెల్ప్ తీసుకుంటూ ఉండేవాడు.. 


ఒక రోజు.. పొద్దున్నే ఆఫీస్ కీ వచ్చిన రోహిత్... లాప్టాప్ బ్యాగ్ కేబిన్ దగ్గర పెట్టేసి .. టీ తాగుదాం అని కాంటీన్ లో కీ వెళ్ళాడు..తన టీమ్ అంతా ఒకే టేబుల్ దగ్గర చేరి బాతకాని కొడుతున్నారు... తను కూడా మాటలో మాట కలిపాడు..
" హే 'మనం' మూవీ ఎలా ఉందట.. " ఎవరో అడిగారు
" నేను చూసాను... పెద్దగా నచ్చలేదు.. " తన ఒపీనియన్ చెప్పాడు.. రోహిత్..
వెనకాలే బాలాజీ అనే అతను అన్నాడు
"తెలుగులో చూడలేదేమో.. " అని
అందరూ గోల్లున నవ్వారు.... 

రోహిత్ కీ ఈ బాలాజీ కామెంట్స్ నచ్చలేదు.. తనని కార్నర్ చేసి అవమానించినట్టు అనిపించింది...అక్కడి నుంచి వెంటనే తనకి కాల్ ఉంది అని లేచి వచ్చేసాడు...

*** *** *** ***
ఇది జరిగి కొంత కాలం అయింది...
ఒకరోజు బాలాజీ హడావిడి గా రోహిత్ దగ్గర కు వచ్చాడు... " రోహిత్ రోహిత్ త్వరగా రా... నాకు కాన్ఫరెన్స్ కాల్ నడుస్తోంది ఎం చెప్తున్నారో అర్ధం కావటం లేదు..." అన్నాడు
రోహిత్ వెళ్లి కాల్ విన్నాడు.. వాళ్ళు ఎం చెప్తున్నారో అర్థమైంది... సరే నాకు అర్ధం అయింది నేను చేసి ఇస్తాలే" అని అన్నాక 
 "ఆ ఫైల్ నాకు మెయిల్ చెయ్ బాలాజీ "అని చెప్పి 
అక్కడి నుంచి డెస్క్ దగ్గర కు వచ్చేసాడు....
బాలాజీ రోహిత్ కు ఫైల్ పంపాడు
రోహిత్...తన పని తను చేసుకుంటున్నాడు...
....
కాసేపు వెయిట్ చేసాక బాలాజీ రోహిత్ డెస్క్ దగ్గరకు వచ్చాడు... " ఏంటి రోహిత్ నా వర్క్ చేసావా? "
"చేయలేదు నా వర్క్ చేసాక చేస్తా "
"లేదు రోహిత్ నాకు అర్జెంటు.. ఇపుడే చేయి " గట్టిగా అన్నాడు బాలాజీ 
" ఏంటి అరుస్తున్నావ్...నేను ఇపుడు చేయను..కావాలంటే నువ్ చేసుకో వెళ్లి ....లేదా వెయిట్ చెయ్.. "
" ఇపుడు చేస్తావా చేయవా.... రోహిత్ .
ప్లీజ్ అనే పదం కూడా వాడటానికి ఇష్టపడలేదు బాలాజీ 
మన అవసరం ఉన్నపుడు కోపం పక్కన పెట్టాలి...
మనకు సహాయం చేసే వాడిని చులకన గా మాట్లాడకూడదు ....
లాంటి ప్రాథమిక సూత్రాలు పక్కన పెట్టాడు... పాపo...బాలాజీ
"ఈ భయం నా మీద జోకులేసి నవ్వినపుడు ఉండాల్సింది...
సరే నాకు పని ఉంది నువ్ ఇంకె ఎవరి తో అయిన హెల్ప్ తీస్కొని నీ పని చేయించుకో...
అయినా కూడా అది చాలా సింపుల్ ఎక్సెల్ వర్క్...
పెద్ద కష్టం కాదు.. కావాలంటే ఎలా చేయాలో చెప్తాను..కూర్చో.... సరే మరీ..."
"లేదు నువ్వే చెయ్యి... నాకు రాదు "
"ఐ యామ్ సారీ.. చేసుకుంటే చేస్కో లేదా వెళ్ళు .... డోంట్ డిస్టర్బ్ మీ.... నవ్ ప్లీజ్ గో.."
ఎర్ర బడ్డ మొహం తో... అవమాన భారం తో...అక్కడి నుంచి బాలాజీ వెళ్లి పోయాడు....
అవమానం అంటే ఏంటో అవతలి వాళ్లకు కూడా తెలియాలి కదా...
మళ్ళీ ఆరోజు రోహిత్ దగ్గరకు రాలేదు బాలాజీ...
ఆ తరువాత.... వారం రోజులు ఆఫీస్ కీ కూడా రాలేదు...
నెల రోజులు గడిచాక.. రోహిత్ కు తెలిసింది.. బాలాజీ ని జాబ్ లో నుంచి తీసేసారు అని.......

   విషయం తెలుసుకుని రోహిత్ బాధ పడ్డాడు.. కానీ తప్పదు కొన్ని విషయాలు అనుభవమే నేర్పాలి.. 

"జీతం ఇచ్చేవాడి మీద జోకులు వేయకూడదని.. 
సహాయం చేసినవారి పైన నవ్వితే నవ్వుల పాలు కావలసి వస్తుంది అని తెలుసుకోక పోతే కష్టం.. " అనుకున్నాడు..



-- సమాప్తం --- 


................
✍️హరీష్


.Regards,
Harish
9902015746

94 ) రోలింగ్ టైటిల్స్.. కథ :

  రోలింగ్ టైటిల్స్.. కథ :  ~~~~~~~~~~~~~~~~~~~ గగన్ ఒక మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్. గొంతులో వైవిధ్యం, పాత్రకు తగ్గట్టుగా ప్రాణం పోయగల ప్రతిభ అతన...