Tuesday, November 18, 2025

చిన్న పిల్లలలకి ఈ హింస అవసరమా ..

 చిన్న పిల్లలలకి ఈ హింస అవసరమా .. 


ఒక్కొక్క సారి అనిపిస్తుంది .. ఈ స్కూల్స్ అవి కూడా పిల్లలకి ఆప్షనల్ చేస్తే బాగుంటుంది అని .. అతని కి ఉండే హ్యాపీ గా ఆనందంగా ఆడుకుండే వయసులో పిల్లలలని చదువు పేరుతో హింసించటం ఎంత వరకు కరెక్ట్ అంటారు 

అంటే ఏమిటి మీ ఉద్దేశం పిల్లలకి చదువే వద్దంటారా అంటారేమో చదువు వద్దు అని నేను అనను  .. కేవలం చుదువు కోవాలి అని అనుకునేవాళ్ళకి చదువు ఇస్తే బెటర్ ఏమో .. 

ఎలాగైతే మనకి ఆకలి వేస్తె .. హోటల్ కి వెళ్లి టిఫిన్ తింటామో .. ఇల్లు కట్టాలి అనుకునే వాడే సిమెంట్ ఎలాగైతే తెప్పించుకుంటాడో ..  జబ్బు ఉన్న వాళ్ళు మాత్రమే మందులు కొనుక్కుంటారో .. అలాగే .. చదువు కావాలి అనుకునే పిల్లలే చదువుకుంటే బాగుంటుంది .. 

ఆకలి ఉన్న లేకపోయినా తిండి తింటే ఏమవుతుంది .. తిన్నది అరగదు  అలాగే .. చదువు అంటే ఏమిటి చదువుకుంటే ఏమి చేయచ్చు అనేవి తెలుసుకున్నాక అడ్మిషన్ తీసుకుంటే బెటర్ 

అప్పటిదాకా వారి వారి అభిరుచి ఏమిటో తెలుసుకునే లాగా ఆటల్లో నో లేక ఈదిన పని లోనో నేర్పిస్తే .. నేను ఏమి చేయగలను ఎంత చేయగలను .. ఇంకా చేయాలంటే ఏమి చేయాలి .. అనేది తెలుసుకుంటాడు విద్యార్థి .. 

ఒక వడ్రంగి ఇంట్లో పుట్టిన పిల్లడు పుట్టిన దగ్గరి నుంచి ఆ పని చూస్తూ ఆ పని చేస్తూ ఉంటాడు కాబట్టి .. ఆ పని సునాయాసంగా చేయగలుగు తాడు కానీ .. అందులో ఇంకా మెళకువలు తెలుసుకోవాలంటే మాత్రం .. అతను .. చదువుకోవాలి బుక్స్ లో ఇంకా ఎక్కువ విషయాలు తెలుస్తాయి .. గొప్ప గొప్ప వాళ్ళు చెప్పిన భాషలు తెల్సుకోవచ్చు .. అని అతను స్కూల్ జాయిన్ అవ్వవచ్చు .. 

అంతే కానీ నా దగ్గర డబ్బు ఉంది .. పిల్లోడికి నాలుగు ఏళ్ళు వచ్చి టిస్కెల్లి బలవంతాన అయినా స్కూల్ లో చేర్చేయాలి అనుకోవటం ఎంత వరకు కరెక్ట్ .. . 

ఇంకా చెప్పాలంటే .. మనం ఇన్స్పిరేటయిన్ గ తీసుకునే .. ఐనస్టీన్ , కరెంట్ బల్బ్ కనిపిట్టిన 

థామస్ ఎడిసన్ , న్యూటన్ , మైకేల్ ఫెరడే ..వెళ్లేవారు మొదట చదువుకోలేదు .. వాళ్ళ కి ఇష్టం అయినా సబ్జెక్టు మీద ఇష్టం తో బుక్స్ చదివి .. ఎక్సపెరిమెంట్స  చేసి .. ప్రపంచం గర్వించదగ్గ సైంటిస్ట్ అయ్యారు .. 

లేదు బిలినైర్స్ నే ఉదాహరణ కి తీసుకుంటే అంబానీ , KFC  సాండర్స్ , ఇలా ఎంతో మంది బిలియనైర్స్  అంతగా ఏమి చదుకోలేదు … అసలు చదువుకి పైకి రావటానికి సంబంధమే లేదు .. కేవలం నీ ఇంటరెస్ట్ ఏంటో తెలుసుకోవటమే జీవిత లక్ష్యం .. 

తన ఇంటరెస్ట్ ఏంటి .. తాను ఏ పని చేయటం ఇష్ట  పడతాడో తెలుసుకోలేని వాడు .. ఎన్ని పీజీ లు చదివినా … ఏమి చదవని వాడితో సమానం.. అంటే చదువు రాని  వాడు కూలి చేసుకునే బ్రతుకుతాడు .. చదువుకున్న వాడు కూలి చేసుకునే బ్రతుకుతాడు ( ఆఫీస్ లో ) … లొకేషన్ మారుతుంది అంతే … 


No comments:

Post a Comment

42 ) ఆశ కథ

 ఆశ - (chinna katha ) “గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ ” అంటూ శర్మ గారు క్లాస్ మొదలు పెట్టారు. అతను చెప్తున్నది తొమ్మిదవ తరగతి మ్యాథమెటిక్స్ క్లా...