స్టోరీ 26 : గర్వం ....... కథ
మధ్యాహ్నం 2 pm అవుతుంది ...
ఇంటర్వ్యూ అయిపోయాక... ఇంటికి వచ్చే బస్ దిగి ఇంటి వైపు నడుచుకుంటూ... వస్తున్నాడు సుభాష్ .ఎండ మండిపోతుంది.. ఒక పక్క ఎండ ఇంకో పక్క ఇంటర్వ్యూ ఏమవుతుందో అనే టెన్షన్ తో సుభాష్ కి మహా చిరాగ్గా ఉంది...
ఉండేది సిటీ లో అయినా..బస్సు స్టాప్ నుంచి ఇంటికి మధ్య 10 నిముషాలు నడవాలి...మెల్లగా నడుస్తూ ఉన్నాడు...బాగా దాహం గా ఉంది.. నడుస్తున్నవాడు ఒకసారి కుడి వైపు చుస్తే నందనవనం లాంటి ఆ ఇల్లు కనిపించింది. అది ఎవరి ఇల్లో గుర్తొచ్చింది....అది తమకు దూరపు చుట్టం అయిన ఆనందరావు గారి ఇల్లు...20 ఏళ్ళు నుంచి గవర్నమెంట్ జాబ్ చేస్తూ బాగానే సంపాయించాడు.. పిల్లలని అమెరికా పంపించాన్నన్న దర్జా అహం కూడా బాగానే కనిపిస్తుండేది అయన మొహం లో.
ఆయనతో తనకి ముఖ పరిచయమే కానీ పెద్దగా ఎప్పుడు మాట్లాడలేదు... సరే దాహంగా ఉంది కదా వెళ్లి పలకరించినట్టూ ఉంటుంది ఒక గ్లాస్ నీళ్లు తాగినట్టు ఉంటుంది అనుకుని తలుపు తట్టాడు... సుభాష్...
కాసేపటికి ఆనందరావు బయటకి వచ్చి తలుపు తీశాడు ....
సుభాష్ మర్యాదగా అడిగాడు
"హాయ్ మావయ్య బాగున్నారా ..! " అని
సుభాష్ ని చూస్తూనే మొహం చిట్లిస్తూ...ఆనందరావు
"నేను నిద్ర పోయే టైం ఇది.. ఓకే నా " అంటూ మొహం మీదే తలుపు వేసాడు...
డబ్బు ఉంటే ఉండచ్చు కానీ మరి ఇంత అవమానకరంగా ప్రవర్తిస్తాడు అని అంకులుకొని సుభాష్,... తల దించుకొని... ఇంటివైపు నడుస్తున్నాడు . ......
మొహం మీదే తలుపు వేయటం చాలా అవమాన కరంగా అనిపించింది...
"ఎంత అహంకారం.. డబ్బు సంపాయించాననే కదా ఈ అహంభవం.. ఎంత సంపాయించి ఉంటాడు.. మహా ఐతే ఒక కోటి రెండు కోట్లు.. పది కోట్లు.. చూపిస్తా.. నేను చూపిస్తా... సుభాష్ అంటే ఏంటో... " అనుకుని ఇంటికి చేరాడు..
**** #### *****
సాయంత్రం మిద్దె మీదకి వెళ్ళాడు... సూర్యాస్తామయం వేపీ చూస్తూ... "సంపాయించాలి బాగా సంపాయించాలి... ఈ ఉద్యోగాలతో కాదు.. ఎం చేయాలి... ఏదయినా బిజినెస్ చేయాల్సిందే.. "
అనుకున్నాక మంచి బిజినెస్ ల కోసం కొందరు ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి అడిగాడు, ఇంటర్నెట్ లో వెతికాదు కానీ ఫలితం సూన్యం... ఏ బిజినెస్ కి కూడా కనెక్ట్ కాలేక పోతున్నాడు... చివరికి ఒక మంచి మొబైల్ ఆప్ డెవలప్ చేద్దాం అనుకున్నాడు...
రకరకాల అప్స్ చేసాడు ఫ్రెండ్స్ ఆప్, షాపింగ్ ఆప్ , ఎగ్జామ్స్ ఆప్, అలా అన్ని రకాల అప్స్ చేసాడు బట్ నో డౌన్లోడ్స్...ఎం చేయాలా అని విచారంగా పార్కులో బెంచి మీద కూర్చొని ఆలోచిస్తోండగా... ఒక పెద్దాయన వచ్చి పక్కన కూర్చున్నాడు...సుభాష్
మెల్లగా సుభాష్ ని కదిలించాడు... తన విచారానికి గల రీసన్ ఏమిటో తెల్సుకున్నాడు
"బాబు ఇప్పటిదాకా నువ్ చేసిన యాప్స్ అన్ని ఉన్నవే ఎక్కడ లేని దొరకని యాప్స్ ఉన్నాయ్ అంటే టాక్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లేదా మార్కెట్ లో ఉన్న లేటెస్ట్ టెక్నాలజీస్ పైన ఫోకస్ చెయ్.. తప్పకుండ సక్సెస్ అవుతావు " అని చెప్పి ఆ పెద్దాయన వెళ్ళిపోయాడు...
అలాగే ట్రై చేసిన సుభాష్ కొన్ని కొత్త యాప్స్ రిలీస్ చేసాడు... అనుకోకుండా అవి తక్కువ కాలం లోనే దేశం మొత్తం ఉపయోగ పడే యాప్స్ ఐయ్యి వైరల్ అయ్యాయి..
అతి తక్కువ కాలం లోనే కోట్లు సంపాయించాడు సుభాష్...ఆ దేవుడే ఆ రోజు పార్క్ లో నాకు ఆ పెద్దాయన రూపం లో సలహా ఇచ్చాడు అనుకున్నాడు.
************
ఆ రోజు ఆదివారం పొద్దున్న పడి గంటలు అయింది.. ఆనంద రావు తాపిగా పేపర్ చదువుతున్నాడు...
ఇంటి ముందు ఒక బెంజ్ కార్ వచ్చి ఆగింది.. నాలుగు ఐదు సార్లు హారన్ కొడ్తుంటే.. ఎవరా అని బయటికి చూసాడు...బెంజ్ కార్ లో ఎవరొచ్చారా అని చుస్తే
డ్రైవర్ అడిగాడు
"ఆనందరావు అంటే మీరేనా మా సార్ మిమ్మల్ని కలవాలి ఉన్నారేమో కనుక్కో మన్నాడు "
"నేనే.. రమ్మనండి " అన్నాడు ఆనందరావు పేపర్ పక్కన పెడుతూ...
కాసేపగాక సుభాష్ లోపలికి వచ్చాడు
సుభాష్ ని చూస్తూనే లేచి నుంచున్నాడు...
లేచి నుంచోవడం చూసి తనలో తానే నవ్వుకున్నాడు సుభాష్.. ఎక్కడో ఇగో satisfy అయింది...
"ఏమి సుభాష్ కార్ మనదేనా బాగుంది " అడిగాడు ఆనందరావు..
""బాగున్నా మావయ్య.. నిన్ననే కొన్నా ఇటువైపు వెళ్తూ మిమ్మల్ని కలుద్దామని వచ్చా.."
"మంచిది.... ఒక్కడివే వచ్చావేం అమ్మ నాన్నలని కూడా తీస్కొని రావాల్సింది.. "
"పర్లేదు లెండి ఈ సారి తీసుకు వస్తాను "
"అదేంటి ఇప్పుడే వచ్చావు అప్పుడే వెళ్ళిపోతావా... భోజనం చేసే వెళ్ళాలి.. జానకి భోజనం ఏర్పాట్లు చెయ్.." అంటుండగానే.... సుభాష్ బయటికి వచ్చాడు..
"నేను వచ్చిన పని అయిపోయింది లెండి.."
"అవును సుభాష్.. ఇంత తక్కువ సమయం లో ఇంత ఎలా సంపాయించావ్... రియల్ ఎస్టేట్ ఆ..."
"లేదండి ఇదంతా మీ ఆశీర్వాదమే.... హ హ హ...." అంటూ కార్ వైపు వెళ్పోయాడు సుభాష్...
"వెధవ బెంజ్ కార్ కె కానీ మనుషులకు ఏ వాల్యూ లేదన్నమాట " అనుకున్నాడు సుభాష్ మనసులో...
...అది కథ...
******************
హరీష్
9902015746
No comments:
Post a Comment