Wednesday, December 10, 2025

story 27 ) ఇండిపెండెన్స్ ... కథ

 story 27 ) ఇండిపెండెన్స్ ... కథ

=≠===============
✍️ హరీష్
ఆదివారం పొద్దున్న పేపర్ చదువు కుంటున్న నన్ను హోమ్ వర్క్ చేసుకుంటున్న బుజ్జిగాడు తట్టి అడిగాడు ..
"నాన్న స్వాతంత్ర దినోత్సవం అంటే ఎప్పుడు " అని
"ఆగస్టు 15th" అని చెప్పాను
"ఓహ్ ఇండిపెండెన్స్ డే నా!!" అన్నాడు
"కాదు రా "
"ఫ్రీడమ్ డే "
"అలాంటి డే ఎం లేదే " అన్నాడు వాడు
"అవును కానీ కరెక్ట్ వర్డ్ ఫ్రీడమ్ డే నే... మరీ ఇండిపెండెన్స్ డే అని ఎందుకు పెట్టారో నాకు తెలీదు "
" రెండు వర్డ్స్ ఒకటి కాదా "
"కాదు!! ఇంకా ఆ మాట కీ వస్తే ఇండిపెండెన్స్ డే అనేది సాధ్య పడే విషయం కాదు..."
" ఎలా! ఎందుకు "
" చెప్తా విను.... ఇప్పుడు మన ఇంటి పక్కన ఒక కిరాణా కొట్టు ఉందా.. మన కాలనీ మొత్తానికి కలిపి ఒక్కటే కొట్టు కదా ..సపోస్ ఒకానొక రోజు.... ఛీ..నాకు ఈ కాలనీ నచ్చలేదు నేను వేరే ఊరు వెళ్ళిపోతాను అనుకున్నాడు అనుకో ఏమవుతుంది.. "
"పక్క కాలనీ కీ వెళ్లి తెచ్చుకుంటాం..."
" అంటె నీకు కష్టం పెరుగుతోంది... ఏ పని ఐతే నీకు ఒక్క నిమిషం లో జరిగేదో... అదే పనికి ఇప్పుడు నీకు రావటానికి 10 నిముషాలు పోను 10 నిముషాలు పడుతోంది.. రైట్!! అంటే నువ్వు సుఖంగా ఉండాలా వద్దా అనేది నీ పక్కన ఉండే వారు డిసైడ్ చేస్తారన్న మాట....అలాగే పక్క నే ఉన్న బట్టల కొట్టు, చికెన్ షాప్, టిఫిన్ హోటల్ ఇవన్నీ...పండ్ల నుంచి గ్రానైట్ బండల వరకు... అందరి మీద మనం ఎదో ఒక విధంగా ఆధార పడి బ్రతుకుతున్నాం... అందరిపైన ఆధార పడి బ్రతుకుతాం....
థాట్ మీన్స్ ఉయ్ అర్ డిపెండెంట్ నాట్ ఇండిపెండెంట్... మనుషులే కాదు రాష్ట్రాలు కూడా సెంట్రల్ ఇచ్చే బడ్జెట్ మీద, సెంట్రల్ లో స్టేట్ ఇచ్చే టాక్స్ పైన ఇంకా ప్రపంచం లో జరిగే యుద్ధ పరిణామాల పైన ఆధార పడే వ్యవస్థ నడుస్తుంది... మరీ ఈ ఇండిపెండెన్స్ డే అనే పదం ఎందుకు పెట్టారో నాకు తెలీదు..."
అవును కదా అన్నట్టు తలడించాడు బుజ్జి గాడు...
మన పక్కన వాడిని సంతోషంగా ఉంచితే నే మనం సంతోషంగా ఉండగలుగుతాం
అది కథ...
................
✍️హరీష్
📞9902015746

No comments:

Post a Comment

42 ) ఆశ కథ

 ఆశ - (chinna katha ) “గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ ” అంటూ శర్మ గారు క్లాస్ మొదలు పెట్టారు. అతను చెప్తున్నది తొమ్మిదవ తరగతి మ్యాథమెటిక్స్ క్లా...