story 29 ) ప్రయాణం లో భోజనం .. కథ
=≠===============
-------------------------
ఒకసారి బెంగుళూరు నుంచి హైదరాబాద్ రావటానికి బస్సు రిజర్వేషన్ దొరకలేదు... సరే అని మజీస్టిక్ లో (బస్సు స్టాండ్ ) వెళ్లి డైరెక్ట్ గా వెళ్లి ఒక ప్రైవేట్ బస్సు కీ టికెట్ తీసుకున్నా... బస్సు ఎక్కడ అంటే పిల్లోడు తీస్కొల్తాడు అని చెప్పాడు... ఆ చిన్న ఛాంపియన్ వచ్చి నా బ్యాగ్ పట్టుకున్నాడు... వదులు రా అంటే ఆహా కాదు నేను మోసుకొస్తా అని నడుస్తూ ఉన్నాడు... దాదాపు బస్టాండ్ చుట్టూ ఒక రౌండ్ వేయించాడు....
ఇంకా ఎంత దూరం రా అంటే అదిగో
అని ఒక పాత డొక్కు బస్ చూపించాడు... సరే ఎదో ఒకటి లే అని నా సీట్ ఎక్కడ.. చూడబోతే నా సీట్ ఏ లేదు... ఏంటిది అంటే ఒక చిన్న స్టూల్ వేసి అడ్జస్ట్ అవ్వండి అన్నాడు...
"ఓరిని అని లేదు లేదుస్టూల్ మీద కూర్చొటం ఏంటి నేను ఎక్కాను..నా టికెట్ డబ్బులు నాకు ఇచ్చేయ్" అంటే
" ఎక్కడ టికెట్ తీసుకున్నావో అక్కడే తెచ్చుకో అన్నాడు ."..
"హమ్మా అంత దూరం వెళ్లి ఆ షాప్ వెతుక్కునే లోపు తెల్లారుతుంది..". అనుకున్నాను...సరే అని స్టూల్ మీదే సెటిల్ అయ్యా....
బస్సు లో టీవీ కూడా లేదు... పైపెచ్చు పాసెంజర్ ట్రైన్ లాగా వెళ్తు ఉంది...
పక్కన ఉన్న పాసెంజర్ తో మాటలు కలిపా
అతని పేరు కిరణ్ అనీ ... ఫ్రెషర్ గా ఈ మద్యే జాబ్ జాయిన్ అయ్యాడని ని చెప్పాడు ...
నన్ను "అన్నా...అన్న " అని సంభోదిస్తున్నాడు
కాసేపయ్యాక సిటీ బయట కీ బస్సు వెళ్ళాక భోజనానికి అని ఆపాడు బస్సు డ్రైవర్ ... ఎప్పటిలాగే పరమ రోత గా ఉండే హోటల్ దగ్గరే ఆపాడు....
సరే అని కిరణ్ నేను ఆ హోటల్ లో ఒక టేబుల్ చూసుకొని కూర్చున్నాం..
"ఎం తిందాం" అన్నాడు అతను
నేను "రిస్క్ వద్దు... కర్డ్ రైస్ ఆర్డర్ చేస్కో ... నాకున్న 2 yrs అనుభవం తో చెప్తున్నా ..ఒకవేళ అవి బాలేక ఏమైయినా పొట్ట ఇబ్బంది పెడితే బస్సు లో టాయిలెట్ కూడా ఉండదు ఆ తరువాత నే ఇష్టం ." అని చెప్పా
" లేదు అన్న నేను చికెన్ కర్రీ విత్ చపాతీ ఆర్డర్ చేస్కుంటా "అన్నాడు
ఆర్డర్ చేయటానికి 10 నిముషాలు రావటానికీ 10 నిముషాలు పట్టింది.. అప్పటికె నా కర్డ్ రైస్ తినటం సగం అయిపోయింది .,.
అప్పటికి అతని చికెన్ కర్రీ వచ్చింది... బాగా ఆత్రంగా.. చపాతి చికెన్ కర్రీ తో తింటున్నాడు... 2 or 3 పీసెస్ తినే సరికి అతనికి డౌట్ వచ్చింది... చికెన్ గానీ కర్రీ గానీ ఫ్రెష్ కాదు అని జస్ట్ ఎప్పటిదో హీట్ చేసి ఇచ్చాడు అని ... టేస్ట్ అండ్ స్మెల్ బాలేదు అని..
ఇపుడు ఎం చేయాలి... ఇంకో ఆర్డర్ చేస్తే అవి వచ్చేసరికి బస్సు వెళపోతుంది..
. ఇదేమో తినలేడు....ఎం చేయాలి...
బాగా ఆలోచించాడు... ఇంకా లాభం లేదు అని..
"అన్న నువ్ చెప్పిందే కరెక్ట్.... ఇదేం బాగాలేదు...
నీ రైస్ షేర్ చేస్తావా "అన్నాడు.
"మరీ చెప్పినప్పుడు వినచ్చు కదా ఇదిగో తీస్కో అని సగం ప్లేట్ లో వేసి ఇచ్చా...."
ఇద్దరం తినేసి బస్సు ఎక్కేసాం మళ్ళీ...
ఇది గుర్తొచ్చి నపుడల్లా నవ్వొస్తుంది హ హ హ..
No comments:
Post a Comment