బిర్యానీ మాస్టర్... కథ
=≠===============
చాలా దూరం షిరిడి లో తన ఇద్దరు కూతుర్లు భార్యతో కారులో ప్రయాణం చేస్తున్నా రణదీప్ దగ్గర్లో ఏదైనా హోటల్ ఉంటుందేమో రోడ్డుకు అటు వైపు చాలాసేపటి నుంచి చూస్తూ డ్రైవ్ చేస్తున్నాడు.
బిర్యానీ తీసికొని స్పూన్ తో నోట్లో వేసుకోగానే మంచి టేస్ట్ అనిపించింది.... కానీ ఈ టేస్ట్ ఇంతకు ముందు ఎక్కడో తిన్నట్టు గుర్తు.... ఎక్కడబ్బా ఆలోచిస్తున్నాడు.... రణదీప్. సరే ఎక్కడైతే ఏమిలే అనీ బిర్యానీ కంప్లీట్ చేశాడు. అందరికి బిర్యానీ బాగా నచ్చింది... బిల్లు కట్టడానికి అని కౌంటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ కనిపించాడు ఒక వ్యక్తి.
ఇతని నేను ఎప్పుడో చూసినట్టుగా అనిపిస్తుంది అనుకుంటూ ఉండగా అతనే
"సార్ నమస్తే బాగున్నారా" అని పలకరించాడు.. అప్పుడు గుర్తు పట్టాడు ఇతని పేరు ముబారక్ కదూ....నువ్వు ఏంటి ఇక్కడ షిరిడిలో అంటే అతని చెప్పుకొచ్చాడు
*******
20 ఏళ్ళ క్రితం మాట రణదీప్ ఒకరోజు ఒక హోటల్లో టీ తాగి బిల్లు కడుతుండగా అక్కడికి ఒక వ్యక్తి వచ్చాడు.... "సార్ ఏదైనా పని ఇవ్వండి సార్.. సార్" అని హోటల్ యజమాని నీ అడుగుతున్నాడు
"పని లేదు ఏం లేదు " అన్నాడు హోటల్ ఓనర్
అయినా సరే "సార్ ప్లీజ్ సార్ పని ఇవ్వండి ప్లీజ్ పని ఇవ్వండి సార్ " అని బ్రతిమాలాడుతున్నాడు.
రణదీప్ బయటికి వచ్చాక ఆ వ్యక్తి ప్రాబ్లమ్ ఏంటి కనుక్కున్నాడు అప్పుడు అతను తన కథ చెప్పుకుంటూ వచ్చాడు
"నాపేరు ముబారక్ సార్ నేను బాగా బిర్యాని చేస్తాను సార్ నాకు నలుగురు పిల్లలు అనుకోకుండా నేను పని చేసిన హోటల్ మూసేశారు...నేను నా కుటుంబంతో రోడ్డుమీద పడ్డాము ఏం చేయాలో అర్థం కావట్లేదు" అన్నాడు
దానికి రణదీప్ " సరే నేను ఒక చిన్న హోటల్ లాంటిది స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను కానీ అందులో కేవలం బిర్యాని మాత్రమే అందుబాటులో పెడదామని అనుకుంటున్నాను..నువ్వు మంచిగా టేస్టీ గా బిర్యాని చేస్తాను అంటే తప్పకుండా నీకే ఆ హోటల్ అప్పగిస్తాను " అని చెప్పాడు
"అయితే ఒక చిన్న చిన్న షరతు పెట్టాడు ఏంటంటే ఒక వారం రోజుల పాటు తన బిర్యానీ రుచి చూసి అద్భుతం అనిపించాక మాత్రమే తను ఆ బిర్యాని సెంటర్ ఓపెన్ చేస్తాను" అని చెప్పాడు
అలా ప్రతిరోజు రణదీప్ వచ్చి ఆ హోటల్లో బిర్యానీ టేస్ట్ చేసేవాడు.... ఇలా కాదు ఉప్పు తగ్గించు,కారం పెంచు,మసాలా తగ్గించు, వాటర్ కొంచెం,పెంచు తగ్గించు, ఆయిల్ తగ్గించు ఇలాంటి రకరకాల సలహాలు ఇస్తూ ఉండేవాడు....ఒక వారం రోజుల్లో చూసిన ముబారక్ విసుగెత్తి పోయి రణదీప్ చేసి వెళ్లిపోయాడు
ఆరోజు వెళ్ళిపోయిన ముబారక్ మళ్ళీ ఇక్కడ ...ఇవాళ కనిపించాడు రణదీప్ కి...
మీ దగ్గర నుంచి వెళ్లిపోయిన తరువాత చాలా చాలా చోట్ల తిరిగాను చివరికి ఒక చెట్టు కింద నేను ఒక బండి పెట్టుకుని బిర్యానీ స్టాల్ ఏర్పాటు చేశాను.
మీరు చెప్పిన సలహాలు ఎలా చెప్పారో అలాగే బిర్యానీ తయారు చేశాను...అది బాగా క్లిక్ అయింది దాంతో నా బిర్యాని కి విపరీతమైన క్రేజ్ వచ్చింది.. అలా వచ్చిన డబ్బుతో...తర్వాత ఒక ఈ హోటల్ పెట్టుకొని బాగానే డబ్బు సంపాదించాను...మీరు గనుక ఆ రోజు నాకు ఆ సలహాలు ఇచ్చి ఉండకపోతే నేను ఎప్పటికీ అలా ఏదో ఒక చోట పనిచేస్తూ ఉండేవాడిని ఏమో అన్నాడు...
"చాలా మంచిది నిన్ను కలుసుకున్నందుకు ఇదిగో మా బిల్ "అన్నాడు రణదీప్
"మీ దగ్గర నేను బిర్యానీ నేర్చుకొని మీ దగ్గర డబ్బులు తీసుకుంటానా సర్...ఇంకో నాలుగు పార్సెల్ తీసుకోండి సర్...మీరు ఇంటికి వెళ్ళే వరకూ ఇది ఉపయోగపడుతుంది "అని కార్ వరకు వచ్చి దిగబెట్టి వెళ్ళాడు ముబారక్
అది కథ...
No comments:
Post a Comment