story 28 ) అడ్డంకులు.... కథ
=≠===============
ఉద్యోగ ప్రయత్నం కోసం వెళ్ళిన రాకేష్ రాత్రి 8 కీ ఇంటికి వచ్చాడు... వస్తూనే తన రెస్యూమ్ ఫైల్ ని టీపాయి మీద విసురు గా పడేసి.. వాష్ రూమ్ లోకి వెళ్ళాడు.... మళ్ళీ వచ్చి అన్నం ప్లేట్ తో సోఫా లో జారబడి కూర్చుని... టీవీ చూస్తూ.. అన్నం తింటున్నాడు... కళ్ళు అయితే టీవీ పైనే ఉన్నాయ్ కానీ ఆలోచనలు ఎటో ఉన్నాయ్
కాసేపాగి మెల్లిగా కదిలించాడు..
"ఎరా.. రాకేష్ ఏమైంది ఇంటర్వ్యూ... ఏమైనా చెప్పారా... మాములేనా.."
"ఎం లేదు యాజ్ యూజువల్ !! " మొఖం ఇంకా టీవీ వైపే చూస్తూ.. నిర్లక్ష్యం గా చెప్పాడు రాకేష్...
"హ్మ్మ్.,...మరీ ఇంకా ఎన్నాళ్ళు రా ఇలా అప్పుడే ఏడాదిన్నారా అయిపోయింది... ఏమైనా ఆలోచించావా మరీ..." సంజయ్ కదిలించాడు మళ్ళీ .
"ఎం లేదు " ఇంకా టీవీ చూస్తునే చెప్తున్నాడు...
సంజయ్ బిగ్గరగా అరిచాడు .
. "ముందు ఆ టీవీ ఆపు... ఏంటి ఆ నిర్లక్ష్యం.."
టీవీ ఆపాడు రాకేష్
" ఏంటి ఇప్పుడు.... నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్న కదా... ఉద్యోగం కావాలంటే...
ఎక్స్పీరియన్స్ లెటర్ అన్నా ఉండాలి...
లేదా రికామెండేషన్ అయినా ఉండాలి....
లేదంటే మంచి రిఫరెన్స్ ఇచ్చే ఫ్రెండ్స్ అయినా ఉండాలి ..
.లేదా అదృష్టం అయినా ఉండాలి వీటిలో ఏవి నాకు లేవు...కాబట్టి టైం పడ్తుంది నాన్న జాబ్ రావటానికి.... నన్ను ఊరికే డిస్టర్బ్ చేయకండి "
"హ్మ్మ్ ఐతే ఇవన్నీ నీ అడ్డంకులు అంటావ్ " అడిగాడు సంజయ్
"అనటం కాదు నిజమే.." అన్నాడు రాకేష్
"సరే నీ పక్కన ఒక చీమ వెళతోంది చూసావా "
"ఎక్కడ... ఆ చూసాను... ఐతే "
"దానికి ఒక వేలు అడ్డం పెట్టు....చెప్తా "
" పెట్టాను.. "
" ఇప్పుడు ఒక రాయి అడ్డం పెట్టు "
"పెట్టాను.. అయితే..."
సంజయ్ చెప్పుకొచ్చాడు..
"నీకు ఏమైనా అర్ధం అయ్యిందా ...అంత చిన్న చీమ కూడా ... నువ్ వేలు పెడితే ఆగిందా లేదు..
దోవ వెతుక్కొని పక్కనించి వెళ్ళింది..
రాయి పెడితే పైనించి వెళ్ళింది కానీ
అయ్యో.. ఈ అడ్డంకి ఉందే అని దాని ప్రయాణం మాత్రం ఆపలేదు.. ఎందుకు అంటే అది ఆ అడ్డంకి ఉందని కూడా ఆలోచించ లేదు కాబట్టి .. కేవలం తన గమ్యం గురించి మాత్రమే ఆలోచిస్తోంది... కాబట్టే వెళ్ళ గలుగుతోంది...
ఎలాగైతే నది లో నీరు పారుతూ ఉంటుంది కాబట్టే... స్వచంగా ఉంటుంది... ఒకే చోట ఆగిపోతే మురికి కాలువ అంటారు....
నువ్ కూడా అడ్డంకి గురుంచి ఆలోచన చేయక ...
నీ లక్ష్యం వీపు ప్రయాణం చేయి...
కనీసం నీ మాటలో కూడా అడ్డంకుల గురించి మాట్లాడకు..."
"ఎక్కడో చదివాను రా ఎవరయితే లక్ష్యం గురించే తపిస్తారో వారికీ..అడ్డంకులే తమ త్రోవ నుండి తప్పుకొని దారి ఇస్తాయట...
సరే కానీ ఇలా నా సోది ఎప్పుడు ఉండేదే లే....
ఎదో మనసు ఊరుకోలేక చెప్తూ ఉంటాను...
నువ్ త్వరగా తిని పడుకో రా .." ముగించాడు సంజయ్...
తండ్రి మాటలు తలకి ఎక్కాయో ఏమో తెలీదు కానీ.. రాకేష్ ఆ రోజు తరువాత తన అడ్డంకుల గురించి తక్కువగా మాట్లాడే వాడు...
ఇంకా.. ఎలా జరిగిందో కానీ..
ఆ తరువాత రెండు వారాలకే రాకేష్ కీ జాబ్ కూడా వచ్చింది..
No comments:
Post a Comment