స్టోరీ 23 :..అజ్ఞాత కాలర్ అంజలి ... కథ
=≠===============
గోపి ఈమద్యే డిగ్రీ పాసయ్యా డు...ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాడు...
ఎవరా అని ఎత్తితే... "గోపీతో మాట్లాడొచ్చా..."
అని ఒక కమ్మని అమ్మాయి గొంతు పలకరించింది
"నేనే చెప్పండి.." అన్నాడు గోపి
"బాగున్నారా అండి.."
"గుర్తుపట్టలేదు... మీ పేరు.. "
" నా పేరు అంజలీ... నేను మీకు తెలీదు... మీరు నాకు తెలుసు.. "
"ఎలా..?"
"సస్పెన్సు.. చెప్పండి.. ఎం చేస్తున్నారు.." అంది అంజలి..
"ఎంట్రన్స్ కీ ప్రిపేర్ అవుతున్నాను... మీరు ఎం చేస్తారు..." అడిగాడు గోపి
"నేనా లాయర్ కోర్స్ పూర్తి చేసాను... ఒక సీనియర్ దగ్గర జూనియర్ గా చేస్తున్నాను.."
"అవునా... ఎక్కడ ఉంటారు.. మీ ఫాదర్ ఎం చేస్తుంటారు..."
"నా డీటెయిల్స్ తప్ప ఏదైనా మాట్లాడచ్చు కదా... మీ హాబీస్ ఏంటి... పాస్ టైం ఎం చేస్తూ ఉంటారు..."
గోపి కీ అంజలి వాయిస్ మత్తు ఎక్కించేలా అనిపించింది...అలా చాలా సేపు మాట్లాడాడు ఆ రోజు
ఆ తర్వాత ప్రతిరోజూ ఫోన్ చేసేది...అంజలీ
మాట్లాడే వాడు... గోపి..
కానీ ఎన్ని సార్లు అడిగిన కూడా తన పర్సనల్ డీటెయిల్స్ మాత్రం షేర్ చేసేది కాదు...
తన ఎగ్జామ్స్ కీ రెండు నెలలు అనగా మొదలైన పరిచయం ఇపుడు ఇంకా నెల రోజులు దగ్గర పడింది... గోపి స్టడీస్ నుంచి డీవియట్ అయ్యాడు...
ఇంకా గోపి కీ సహనం నశించింది...
ఆ రోజు అంజలి మళ్ళీ కాల్ చేసింది...
"హాయ్ గోపి.."
"హాయ్ అంజలి.. ఇంక మనం ఈ ఫ్రెండ్షిప్ కీ
ఫుల్ స్టాప్ పెడదామా.."
"వై... ఏమైంది సడన్ గా... "
" ఎం లేదు... ఏ ఎండింగ్ లేని ప్రయాణం ఎన్ని రోజులు చేస్తాం... నువ్వా నీ డీటెయిల్స్ చెప్పవు... నేను ఎవరితో మాట్లాడుతున్నానో నాకు తెలీకుండా.. ఎన్ని రోజులు ఆ రిలేషన్ ని కొనసాగించటం...
అండ్ మోర్ ఓవర్.... ఒక వేళ నేను ఇలాగే మాట్లాడుతూ.. నా ఫోకస్ కోల్పోయి నాకు ర్యాంక్ గాని జాబ్ గాని రాకపోతే అప్పుడైనా నువ్వు కంటిన్యూ అవుతావు అనే గ్యారంటీ లేదు... అపుడెపుడో అన్ని కోల్పోయి కట్ చేసుకునే కంటే.. ఇపుడే దూరం ఐతే అట్లీస్ట్.. నా ఎగ్జామ్స్ అయినా బాగా రాస్తాను... " ఇంకా గోపి ఎదో చెప్పబోతుంటే
"హే ఇట్ ఈస్ ఓకే మనం నీ ఎగ్జామ్స్ తర్వాతే మాట్లాడుకుందాం..." అంది అంజలీ
"అప్పటికైనా... నీ వివరాలు చెప్తావా.."
"ఏమో.. చెప్పలేను.."
"కనిపించని మనిషి తో మాట్లాడటం కంటే కనిపించే గోడతో మాట్లాడితే కనీసం.. ఆ ప్రతిధ్వని..అన్నా వినిపిస్తుంది... ఈ యెటూకాని రిలేషన్ నేను కంటిన్యూ చేయలేను..నన్ను క్షమించండి... ఇంకెప్పుడు ఫోన్ చేయకండి.." అని ఫోన్ పెట్టేసాడు..
No comments:
Post a Comment