Wednesday, May 7, 2025

న్యూ ఇయర్ పార్టీ..కథ

 న్యూ ఇయర్ పార్టీ..కథ

≠===============
✍️ హరీష్
..
డిసెంబర్ 31st రోజు ఆఫీస్ కీ సర్వర్ డౌన్ అని 1 వీక్ సెలవలు ఇచ్చారు... ఇంట్లో ఉండి ఎం చేయాలి అని వైజాగ్ లో ఉన్న చుట్టాలని కలుదాం అని డిసెంబర్ 31 నైట్, హైదరాబాద్ to వైజాగ్ బస్సు ఎక్కాను..
" హ్మ్....ఏంటో అందరు 31స్ట్ నైట్ పార్టీ చేసుకుంటుంటే నేను ఏమో బస్సు లో కుర్చుని.. డ్రైవర్ ప్లే చేసే సినిమాలు చూస్తున్నాను" అనుకుంటూ.. సీట్ వెనక్కి అనుకుని...నిద్ర లోకి జారుకున్నాను...బహుశా బస్సు లో అందరు నా లాగే అనుకుంటున్నారేమో...
రాత్రి పదిన్నార కావస్తుంది... బస్సు హోటల్ దగ్గర ఆగింది... అందరు భోజనాలు చేసి మళ్ళీ ఎక్కారు.. మళ్ళీ అవే బోర్ కొట్టే మూవీస్ ప్లే అవుతున్నాయి.. మళ్ళీ కాస్త మత్తు గా ఉండి నిద్ర లోకి జారుకున్నాను..
అర్ధరాత్రి అయింది... బస్సు ఆగింది.. ఏంటో రిపేర్ అనుకుంట.. డ్రైవర్ లు ఇద్దరు ఇంకా పది మంది పాసెంజర్లు బస్సు దిగి ఎదో మాట్లాడుతూ ఉన్నారు.. ఇది కామన్ ఏ కదా....అనుకుని నేను కిటికీ లోంచి బయటకి చీకటిని చూస్తూ ఉన్న.... కాస్త టౌన్ లాగా నే ఉంది.... చుట్టూ షాపులు అవి ఉన్నాయ్.... ఇంకా జనాలు తిరుగుతూ ఉన్నారు అక్కడ అక్కడ ...
కాసేపటికి డ్రైవర్ లోపలికి వచ్చాడు... పాసెంజర్స్ అందరు దిగాలి సర్ అన్నాడు .. బస్సు కదలట్లేదు... తోయాలి అన్నాడు... లేడీస్ తో సహా దిగమన్నాడు ఏంటో పాపం...
బస్ తోయటానికి అందరు బస్సు వెనకాలకి వెళ్తుంటే కాదు ముందుకి రమ్మని సైగ చేసాడు....
ముందుకు వెళ్లి చూసాం అందరం.... ఒక బల్ల లాంటి దానిమీద కేక్ వెలిగించి... దాని పైన కోవొత్తి పెట్టి...
"హ్యాపీ న్యూ ఇయర్... "అన్నారు డ్రైవర్ లు ఇద్దరు... ఒక చిన్నపాటి సెలెబ్రేషన్స్ జరిగింది అక్కడ.... అందరికి కిలో స్వీట్ పంచారు...ముఖ పరిచయం కూడా లేని వాళ్లకు అందరం విష్ చేసుకున్నాం....
ఆహా ఎంత బాగా ఆరంజ్ చేశారు... అసలు వీళ్ళు ఎపుడు కేక్ కొన్నారు ఎపుడు స్వీట్స్ తెచ్చారు... భలే గా చేశారే సైలెంట్ గా....ఇంట్లో ఉంటే ఇదంతా మిస్ అయ్యే వాడిని కదా అనుకున్నాను
నా లైఫ్ లో చాలా న్యూ ఇయర్స్ వచ్చాయి కానీ అదే బెస్ట్ న్యూ ఇయర్ పార్టీ...

తీపి కోరిక ..... కథ

 తీపి కోరిక ..... కథ

--------------------------
✍️హరీష్
పొద్దున్నే మార్నింగ్ వాక్ వెళ్లే ప్రసాదరావు కాళ్ళు రోజూ ఆ దుకాణం ముందుకు రాగానే ఆగి పోతాయి....
**** ***** ****
అరవై ఎళ్ళు దాటిన ప్రసాద్ రావు గవర్నమెంట్ జాబ్ లో రిటైర్ అయ్యారు. చాలా కాలంగా మధుమేహం తో బాధ పడ్తున్నాడు.
అవును అండి...బాధ అంటే మాములు బాధ కాదు... ఎందుకంటే ప్రసాదు గారికి మిఠాయి అంటే అంత ఇష్టం మరి...
ఉన్న కొడుకు కూతురి పెళ్లిళ్లు చేసేసాడు...ఇద్దరు వేరే ఊళ్లలో ఉంటున్నారు.. ఎప్పుడైనా ఏ పండగకో పెళ్లిళ్లకో వచ్చి పోతు ఉంటారు....
తల్లి తండ్రులని కలుసుకోవటం కూడా అప్పుడే
రోజూ లాగే ఆ రోజుకూడా వాకింగ్ చేస్తున్న ప్రసాదు గారి కాళ్ళు ఆ
"బాలాజీ మిఠాయి బండార్ " అనే షాప్ ముందుకు వచ్చేసరికి బ్రేక్ పడ్డాయి...
"ఇవాళ ఎలాగైనా ఒక్క పాలకోవా అయినా నోట్లో వేసుకోవాల్సిందే..." అనుకున్నాడు...
వెంటనే వాళ్ళ ఆవిడ తన అందరితో అనే మాటలు గుర్తొచ్చాయి..
"ఏవిటో అండీ ... ఆయనకి ఎంత ఈడు వచ్చినా ఆ వెధవ స్వీట్ల మీద మక్కువ మాత్రం చావట్లేదు... ఈ మధ్య ఆ మధుమేహం కదా కాస్త తగ్గించారు కానీ కోరిక అలాగే ఉంది... ఏ చుట్టాలింటికి వెళ్లాలన్నా కష్టమే .. వాళ్ళు పెట్టే స్వీట్స్ ఎంక్కడ తినేస్తారో అని..."
వాళ్ళావిడ మాటలన్నీ గుర్తు చేస్కుంటు పార్క్ లో నడుస్తూ ఉన్నాడు ... అప్పుడే ఎదురుగా ... కాలనీ లో ఉండే... పూరషోత్తం గారు స్వీట్ ప్యాకెట్ తో కనిపించారు...
"ప్రసాద్ గారు... మా ఇద్దరికీ us వీసా వచ్చింది అండి.. స్వీట్ తీస్కోండి.... ఓహ్ సారీ అండీ మీరు తినకూడదు ఏమో కదా..."
"పర్లేదు లెండి.. చిన్న దూద్ పెడా ముక్కే కదా ఒకటి తీస్కుంటా లే.... "
అంటూ ఒక చిన్న ఉండ తీస్కుని నోట్లో వేసుకున్నాడు...
అలా నడుస్తూ ఉంటే ఆ దూద్ పేడ తాలుకు జ్యూస్ మెల్లగా గొంతు లోకి జారుతూ ఉంటే ఆహా ఇదే కదా స్వర్గం అనుకుంటూ... ఇంటి వరకు ఆస్వాదిస్తూ వెళ్ళాడు..
ఇంట్లోకి వెళ్ళాక టీపాయ్ పైన ఉన్న కవర్ ఏమిటా అని చూస్తుంటే...వాళ్ళావిడ కృష్ణవేణి అంది
"అది మీ షుగర్ రిపోర్ట్ ఇందాకే తెచ్చిచాడు కొరియర్ బాయ్...చెక్ చేశాను...పర్లేదు బోర్డర్ ఉన్నట్టుంది...ఇంకా మీరు కాస్త కంట్రోల్ ఉండాలి.. ఇదిగో మిమ్మల్నే...చెప్తుంటే వినకుండా వెళ్లి పోతారు...."
అని చెప్తుండగానే లోపలికి స్నానానికి అని వెల్లారు.....ప్రసాదు గారు
స్నానం చేస్తున్నంత సేపు.. షుగర్ కంట్రోల్ లో ఉంది అన్న మాటే పదే పదే వినిపిస్తోంది....
స్నానం ముగించుకొని... ఇదిగో నిన్నే బయటికి వెళ్ళొస్తా అని చెప్పి బయలు దేరాడు ..
"ఇపుడెక్కడికి.. టిఫిన్ చేయకుండా..?." అని కృష్ణవేణి అంటున్నా కూడా వినిపించుకోకుండా కళ్లద్దాలు పెట్టుకుంటూ బయలు దేరారు...
*** **** ****
ఆ రోజు సాయంత్రం.... ప్రసాద్ రావు గారికి ఆయాసం గుండె దడ అంటే.. హాస్పిటల్ కి తీసుకొచ్చారు....పక్క వీధిలో వాళ్ళ సాయం తో..ప్రసాదరావు గారి బంధువులు.. చుట్టుపక్కవాళ్ళు అంతా హాస్పిటల్ కి చేరుకున్నారు..
ఇంతకీ సంగతేంటా అని ఆరా తీస్తే.. ఆ రోజు పొద్దునే స్వీట్ షాప్ కి వెళ్లి ఒక
పావు కిలో స్వీట్ ఒక్కరే తినేశారట...
అయన లేచాక ఏమైంది ఎందుకు అలా చేశారు అని వాళ్ళావిడ అడిగితే...అయన అన్నారు
"హ్మ్మ్ నాకు అరవై ఏళ్ళు వచ్చాయి.. పిల్లలు సెటిల్ అయ్యారు ఇక్కడికి కి వస్తారో రారో కూడా తెలీదు.. ఇలాంటి పరిస్థితుల్లో...నేను ఇంకా నా ఆరోగ్యం కాపాడుకోని నేను ఎం ఉద్దరించాలి ...తినాలని అనిపించే చిన్న చిన్న కోరికలని ఆపుకొని... ఇంకా పథ్యం పాటించాలా అని అనిపించింది.. ఇంకా ఎన్నేళ్లు నోరు కట్టేసుకోవటం... ఉన్నన్ని రోజులు సంతోషంగా ఉండి.. ఆ తరువాత... హాయిగా కన్ను మూస్తే అంతకంటే ఎం కావాలి ఈ జన్మకి.. "
అని చెప్తూ పోయారు ప్రసాదరావు గారు.. కంట నీరుని చీర కొంగుతో తుడుచుకుంటూ వింటోంది.. కృష్ణవేణి....

ఆనందం ..... కథ

 ఆనందం ..... కథ

--------------------------
✍️హరీష్
"హలో డ్రైవర్!! కారు కాస్త ఫాస్ట్ గా నడుపు " అంటూ ఆర్డర్ వేసాడు మురళి..
20 ఏళ్ళ తరువాత అమెరికా నుండి ఇండియా వస్తున్నాడు.. గంట క్రితమే హైదరాబాద్ లో ఫ్లైట్ దిగి క్యాబ్ లో ఊరికి బయలుదేరాడు..
ఒక్కడే రావటం వల్ల పెద్దగా లగేజ్ లేదు కానీ పది రోజులకు సరిపడే బట్టలు సామాను తెచ్చాడు... మళ్ళీ ఇవన్నీ తీస్కొని బస్సుకేమి వెళ్తాములే అని అనుకుని క్యాబ్ మాట్లాడాడు.....హైదరాబాద్ నుంచి ఒక ఐదు గంటల జర్నీ చేస్తే ఊరికి చేరుకుంటాడు
"కాస్త ఏసీ పెంచవయ్య " మళ్ళీ ఆర్డర్ వేసాడు మురళి
.. సమ్మర్ కదా మహా ఇబ్బంది పడి పోతున్నాడు మురళి.....అసలు ఇండియా లోనే పుట్టనట్టు ఫీలింగ్... ఈ ఎన్ఆర్ఐ లు అందరికి అదే ఫీలింగ్ కదా
హైవే మీద...కారు మెల్లగా వెళ్తోంది
ఈలోపు గోపాలనికి ఫోన్ చేసి తను ఫ్లైట్ దిగి .. క్యాబ్ లో వస్తున్న సంగతి చెప్పాడు..
ఈ పది రోజులు మురళి బస తన చిన్ననాటి స్నేహితుడు గోపాలం ఇంట్లోనే
తాతల నాటి ఆస్థి వ్యవహారాలు చక్కబెట్టుకుని మళ్ళీ అమెరికా వెళ్లటం కోసం వచ్చాడు ఇండియా కి ...
ఇరవై ఏళ్ల క్రితం భార్య బిడ్డలతో అమెరికా వెళ్లి స్థిరపడిన మురళి ఇదే రావటం ఇండియా కి ... కానీ గోపాలం మాత్రం.. తన పొలాలు అవి చూసుకుంటూ.. ఐటీ జాబ్ వచ్చినా చేయకుండా ఊరికి దగ్గరే టీచర్ గా ఉద్యోగం చేస్తూ పిల్లలతో ఉండి పోయాడు
### ### ###
మురళి ఇంటికి చేరుకునే సరికి మధ్యాహ్నం రెండు అయింది.... మురళిని చూస్తూనే గోపాలం భార్య గీత స్టవ్ మీద అన్నం దించి భోజనం వడ్డించింది...
స్నేహితులు ఇద్దరు భోజనం చేస్తున్నారు...
గీత చేసిన వంట అద్భుతంగా ఉన్నా.. మురళి ఎమీ ఎక్ష్ప్రెస్ చేయకుండా నే భోజనం పూర్తి చేసాడు ... గోపాలం మాత్రం ఇంకో లోకం లో విహారిస్తూ తింటున్నాడు... అతన్ని చుస్తే భోజనం బ్రహ్మాండంగా ఉంది అని చెప్తునట్టు తెలుస్తోంది ...అతన్ని చూసి ఇతను ఏమి మారలేదు గా అనుకున్నాడు...మురళి
భోజనం అయ్యాక.. ఇద్దరు మిత్రులు.. హాల్లో సోఫాలో కూర్చొని ఫ్యాన్ కింద చల్లని గాలి తగులుతూ ఉంటే కబుర్లు లో పడ్డారు...గీత డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని వింటోంది ..
"ఏంట్రా మురళి మీ అమెరికా సంగతులు... బాగా సంపాయించి నట్టు ఉన్నావ్..." కదిలించాడు గోపాలం..
" ఆ ఏమి సంపాదన ఎదో రెండు ఇల్లు కొన్నా... ముగ్గురికి తలా ఒక ఆడి కారు ఉన్నాయ్... మా ఆవిడకి ఎంత బంగారం కొన్న ఇంకో కిలో ఐతే బాగుండు..హ హ..అనుకుంకుంటుంది..... " ఒకింత గర్వంతో.. తన గొప్ప చెప్పుకొనే క్రమం లో చెప్పుకుంటూ పోతున్నాడు.....
గోపాలం ఓర కంట చూస్తున్నాడు.... గీత మాత్రం కళ్ళు పెద్దవి చేసి వింటోంది..
ఆ వాకప్రవాహానికి అడ్డు కట్ట వేయటానికి... మళ్ళీ గోపాలం అన్నాడు..
"ఆ మధ్య... నువ్వు ఏదో హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యావ్ విన్నాను ... ఏంటి విషయం..."
"ఓహ్ అదా...మా సాఫ్ట్వేర్ జీవితాలు గురించి తెలుసు కదా.. సంపాదన ఉంటుంది కానీ... క్షణం తీరిక ఉండదు... అలా ఒకసారి ఆగకుండా వారం పాటు 24 గంటలు పని చేసి క్లయింట్ కి ప్రాజెక్ట్ డెలివరీ ఇవ్వాల్సి వచ్చింది... ...ఆ తర్వాత ... విపరీతమైన స్ట్రెస్... తలపోటు... కళ్ళు తిరగటం... ఆకలి లేకపోవటం...తిన్నది అరగక పోవటం... లాంటి చాలా హెల్త్ కంప్లైంట్స్ వచ్చాయి ఒక వారం రెస్ట్ తరువాత... సర్దుకుంది లే..." మళ్ళీ గొప్పగా చెప్పుకొచ్చాడు మురళి..
"హ్మ్మ్...మొత్తానికి సుఖానికి... ఆనందానికి మధ్య బ్రతుకుతున్నావు అన్నమాట.." అన్నాడు గోపాలం
"అర్ధం కాలేదు మళ్ళీ చెప్పు..."
" ఏమీ లేదు లే... ఐతే రేపే నా నీ ప్రయాణం మీ ఊరికి "
"అవును "
"సరే రేపు నేను నీతో వస్తాను... మనం దారిలో మా సావిత్రి వదిన గుర్తుందా... వాళ్ళ ఇంట్లో భోజనం చేసి వెళ్దాం ..." చెప్పాడు గోపాలం
"ఓహ్ సావిత్రి వదినా ఎందుకు గుర్తు లేదు... పల్లి ఉండలు రోజు చేసి పెట్టేది... తప్పకుండా వెళ్దాం "
### ### ###
మర్నాడు ఉదయం ఏడింటికే...ఇద్దరు బస్టాండుకు బయలు దేరారు..ఇద్దరు నడుస్తూ ఉన్నారు... మధ్యలో... గోపాలం సడెన్ గా ఆగి.. ఒక చెట్టు వైపు చూస్తున్నాడు...
అతన్ని చూసి మురళి కి చిరాకనిపించింది... "పద గోపాలం...బస్సు టైమ్ అవుతుంటే అలా ఉండి పోయావ్ అన్నాడు..."
" అదేంటి నీకేమి వినపడలేదా.... కోకిల అంత శ్రావ్యంగా పడుతుంటే.. విను ఒక్క నిమిషం... "
"అబ్బా తర్వాత తీరిగ్గా వినచ్చు లే... పద " అన్నాడు మురళి
" సరే నీ ఇష్టం పద " అంటూ నడిచాడు గోపాలం
### ### ###
మధ్యాహ్ననికి ఇద్దరూ బస్సు దిగి సావిత్రి ఇంటికి వెళ్లారు. వీళ్ళు వెళ్లేసరికి సావిత్రి వదిన కమ్మటి భోజనం తో పాటు పాయసం, పులిహోర, పరవన్నం, నేతి రవ్వ కేసరి చేసి పెట్టింది...
ఇద్దరినీ కలుసుకున్నందుకు చాలా పొంగిపోయి.. తనకోసం ఇంత కాలం తర్వాత ఇంత దూరం వచ్చినందుకు సంతోషించింది...కుశల ప్రశ్నలు అయ్యాక..భోజనానికి రమ్మంది
ఇద్దరు మిత్రులు భోజనానికి ఉపాక్రమించారు...
"ఏంటి వదినా మేము ఏమైనా కొత్త వాళ్లమా చెప్పు .. ఇన్ని వంటలు చేసావు..." అని గోపాలం అంటే
"అయ్యో ఎప్పుడో కానీ.. ఇలాంటి సందర్భం రాదు.. నాకోసం వచ్చే వాళ్లెవరు ఉన్నారు... పిల్లలు కూడా వచ్చిపోవటం తగ్గించారురా..మీరు వచ్చారు సంతోషం... మీ పేరు చెప్పి నేను కాస్త రుచి చూస్తా లే... కానివ్వండిరా "
.
గోపాలం ప్రతి వంటని ఆస్వాదిస్తూ... మెల్లగా కళ్ళు మూసుకుని... ఎడం చేత్తో... వేళ్ళు తిప్పుతూ...
" ఆహా.. వదినా నీ చేతికి తిరుగు లేదు... ఈ రోజుకి అదే రుచి.. ఆదరగొట్టేసావు అంతే " అని తింటూ ఉన్నాడు...
మురళి మాత్రం గబా గబా ఎదో పని ఉన్నట్టుగా అయింది అన్నట్టు ముగించాడు..
భోజనాలు అయ్యాక ఇద్దరు సావిత్రి వదిన దగ్గర సెలవు తీసుకొని పని మీద బయలు దేరారు...
రెండు మూడు రోజుల్లో మురళి ఆస్తుల లావాదేవీలన్ని ముగించుకొని అమెరికా తిరుగు ప్రయాణనికి... రెడీ అవుతున్నాడు...
కాబ్ కోసం వరండా లో కూర్చున్న మురళి కి గోపాలం భార్య టీ తెచ్చి ఇచ్చింది
" ఇంకా ఏంట్రా గోపాలం ఇక్కడ అందరికి దూరంగా ఉండక పొతే హైదరాబాద్ అయినా వచ్చి ఉండచ్చు కదా ... అమెరికా రమ్మంటేనేమో ఇంటరెస్ట్ లేదన్నావ్.. ఇక్కడ ఎలా ఉంటున్నావ్ రా " అన్నాడు మురళి టీ సిప్ చేస్తూ
గోపాలం తాగుతున్న టీ కప్ పక్కన పెట్టి అన్నాడు
" ఇక్కడ సౌక్యాలు లేక పోయినా ఆనందాలు చాలా ఉంటాయి రా" అన్నాడు
" అదిగో మళ్ళీ అదే మాట మొన్న కూడా అన్నావ్...ఏంటి అని అడిగితే మాట దాటావేశావ్.. చెప్పు నీ మాటలోని అంతరార్థం "
"అంటే డబ్బు సుఖలని ఐతే కొనగలదు కానీ ఆనందాలు మాత్రం చిన్న చిన్న విషయాల లోనే ఉంటాయి.. వాటికీ ఏ ఖర్చు ఉండదు... కావాల్సినదల్లా ఆస్వాదించే మనసు... జీవితం లో సుఖాలు లేకుండా బ్రతకచ్చు కానీ ఆనందాలు లేకుండా బ్రతకితే స్ట్రస్ కి గురవాతం...
"అంటే డబ్బుతో ఏ ఆనందం ఉండదంటావా..? ఒకవేళ నువ్వు తక్కువ సంపాస్తున్నావ్ కాబట్టి... నిన్ను నువ్వు అలా సమర్దించుకునే ప్రయత్నం కాదు కదా "
" ...అవును ఒప్పుకుంటాను..ఇక్కడ నాకు జీతం తక్కువే కానీ నా రోజు లో ప్రతిక్షణాన్ని ఆస్వాదించే అంత తీరిక ఉంటుంది.. నువ్ చూసే ఉంటావ్ ఒక కోకిల పాట పడినా శ్రోతని అవుతా, బస్సు లో కండక్టర్ కి ఫ్రెండ్ నీ అవుతా , ఒక మంచి స్వీట్ తింటున్నపుడు పంచెంద్రియలతో ఆ రుచిని మస్తీష్కనికి పరిచయం చేస్తాను.... కొంత కాలం పోయాక మనకి ఉండే జ్ఞాపకాలు అవే కదా..."
చెప్పటం ఆపి మళ్ళీ కొనసాగించాడు
" కానీ కొంత మంది ఉంటారు... జీవితం మొత్తం పరిగెడుతూనే ఉంటారు...
ముందు సంపాయిస్తారు..
కొన్నేళ్లు పోయాక సంపాయిస్తారు...
ఇంకొన్నేళ్లు పోయాక ఇంకా సంపాయిస్తారు....
ఇలా ఎండ్ పాయింట్ లేకుండా సంపాయించే సంపాదన దేనికోసమో ఎవరి కోసమో వాళ్ళకే తెలీదు... వాళ్ళు సంపాయించాక మళ్ళీ వాళ్ళ పిల్లలు సంపాయిస్తారు..
అలాకొంత కాలానికి మట్టి లో కలిసిపోతారు..... తన జీవితం లో ఒక స్పూన్ పాయసాన్ని కూడా అభినందించలేని జీవితం దేనికి...చెప్పు
....
ఏమైనా సంపాదన కి ఒక మితం ఉండాలి..సంపాదన తర్వాత..ఇంకా చూడవలసిన విషయాలు చేయవలసిన పనులు చాలా ఉంటాయి... అలా చేస్తున్నాను కాబట్టే నాకు ఇప్పటికి ఎలాంటి హెల్త్ కంప్లైంట్స్ లేవు..... "
ఇది విన్న మురళి ఆలోచన లో పడ్డాడు.. చూస్తూనే క్యాబ్ వచ్చి ఆగింది.. బై చెప్పి.. అమెరికా బయలుదేరాడు...
కోసమెరుపు.... కొంత కాలానికి మురళి ఇండియా షిఫ్ట్ అయ్యాడు
... గోపాలం ఇంటి పక్కనే ఇల్లు కట్టుకొని... వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు....
జీవితం లో స్పీడ్ తగ్గించి... కాస్త లైఫ్ నీ కూడా ఎంజాయ్ చేయటం మొదలు పెట్టాడు ......

ఆకలి పాఠాలు.. కథ

 ==================

ఆకలి పాఠాలు.. కథ
==================
అవి నేను పీజీ పూర్తి చేసి జాబ్ ప్రయత్నాలలో ఉన్న రోజులు... ఎన్నో వ్యయ ప్రయాసాల తరువాత ఒక్క జాబ్ వచ్చింది.. ముందు హైదరాబాద్ పోస్ట్ అన్న కంపెనీ వాళ్ళు సడన్ గా ఆఫర్ ఇచ్చేటప్పుడు పూణే లో పోస్టింగ్ ఇచ్చారు.
మరి ఏమి చేస్తాం.. జాబ్ దొరకటమే కష్టంగా ఉన్న రోజుల్లో అండమాన్ అయినా పర్లేదు అని ఫిక్స్ అయిపోయిన రోజులు .. తోటి క్లాసుమేట్స్ ఏ పెర్చెంటేజ్ లేకపోయినా రిఫరెన్స్ తో మంచి జాబ్స్ కొట్టేస్తునన్న రోజులు...నువ్వు ఇంకా ఎన్ని రోజులు ఖాళీ గా ఉంటావ్ ఏమి... అని ఇంట్లో వాళ్ళు పూట పుటా దెప్పుతున్న రోజులు... సరే అని ఇష్టం లేకపోయినా తలడించి ఆఫర్ తీస్కొని ఇంటికి వచ్చా...
మరి పూణే వెళ్ళి ఎక్కడ ఉండటం ఏంటి చేయటం...అని ఆలోచిస్తుంటే మా బ్రదర్ వాళ్ళ కొలిగ్ వాళ్ళ బ్రదర్ ఉన్నాడట పూణేలో.... అతని రూమ్ లో జాయిన్ అవ్వు మెల్లగా సెటిల్ అయ్యాక రూమ్ మారచ్చు అన్నాడు.. సరే అని సండే మార్నింగ్ రీచ్ అయ్యేటట్టు ప్లాన్ చేసుకొని బస్సు ఎక్కాను....
తెల్లవారింది...బస్సు దిగి ఆటో పట్టుకొన్నా...జాన్ అనే అతని రూముకి వెళ్ళా... లోపలికి వెల్దునా.... దేవుడా...అది రూమ్ కాదు ...రైల్వేస్టేషన్.... పది మంది ఉంటున్నారు...ఆకలి రాజ్యం సినిమాని నాకు నిజంగానే చూపించారు
ఇంకా తప్పేదేముంది జాబ్ జాయినింగ్ ఆ మరుసటి రోజే కదా.... అక్కడే ఉన్నాను., ఇంకా ఆ రూమ్ లో చుస్తే అన్ని "రూల్స్ "యే ...
ఏమైనా తినాలంటే అందరికి పెట్టాలి... పోనీ వండుకుందామంటే వాళ్లే వండాలంట... వాళ్ళు తినేటప్పుడే మనం తినాలాట... ఒక రోజు మొత్తం నరకం చూసా.. పోనీ బయట తిందాం అంటే పూణే అప్పుడు కి ఇంకా అంతా డెవలప్ కాలేదు ఒక్క వాడప్పావ్ తప్ప...ఇడ్లి దోస..ఏమి దొరకదు.. వాడప్పావ్ ఏమో మనకి దిగదు
ఎలాగో పొద్దున్న ఆఫీస్ జాయిన్ అయ్యా మొత్తానికి... అక్కడే కాంటీన్ లో టిఫిన్, భోజనం చేసేశా... ఇంకా డిన్నర్ కూడా అక్కడే చేద్దాం అనుకున్నా... కానీ అక్కడ డిన్నర్ ఉండదట..
మరేం చేయటం... రూమ్ లో మళ్ళీ ఆ వెయిటింగ్ చూసే ఓపిక నాకు లేదు... సరే ఏమైనా సరే బయటే తిని వెళ్దాం అనుకోని...సరే ఇంత పెద్ద నగరం లో తింటానికి ఏదో ఒకటి దొరక్క పోతుందా అని అనుకుంటూ..రోడ్ పక్కగా నడవటం మొదలుపెట్టాను...
అప్పటికి పూణే పెద్దగా డెవలప్ కాలేదు... ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంటే ఇంకో కిలోమీటరు వరకు ఖాళీ రోడ్ ఏ ఉంటుంది... పైగా దుమ్ము ఎక్కువ... అలా ఆ చీకటిలో, ఆ దుమ్ములో, ఒక రెండు మూడు కిలోమీటర్లు నడిచాక... కూడా ఏ హోటల్ కానీ టిఫిన్ సెంటర్ కానీ కనిపించడం లేదు... ఏమి చేయటం ఆ అని ఆలోచిస్తుంటే... ఆ పక్కన ఒక్క చిన్న గుడిసె కనిపించింది... వాళ్ళని అడిగితె ఏమైనా చెప్తారేమో హోటల్ ఎంత దూరం అని...(అప్పటికి ఇంకా స్మార్ట్ ఫోన్స్, మాప్స్ లేవు లెండి )
"హలో కోయి హాయ్ భాయ్ "
(ఎవరైనా ఉన్నారా ) అని నాకు వచ్చిన హిందీ లో పిలిచా...
వాళ్ళు లోపలికి రమ్మనట్టు సైగ చేసారు
లోపల చిన్న లైట్ ఉంది.... ఒకావిడ చపాతీ కలుస్తోంది... ఇంకో అతను ఆవిడా భర్త అనుకుంట.. పక్కనే కూర్చున్నాడు...నన్ను కూర్చోమన్నారు...
నేను మొహమాట పడుతుంటే... ఏమి పర్లేదు అని రమ్మని సైగ చేశారు... ఏంటో చెప్పామన్నారు..
"ఇక్కడ దగ్గరలో ఏదయినా హోటల్ ఉందా " అని అడిగా...
"నువ్వు రెండు మూడు కి. మీ. నడిచి ఉంటావ్ అలిసి పోయింటావ్ నీళ్లు తాగు" అని ఇచ్చారు.,
తాగాను.... అలసి ఉన్నా కదా
"ఇక్కడ హోటల్స్ ఏవి ఉండవు బాబు .. వాడప్పావ్ ఉంటుంది అది ఇక్కడ దొరకదు " అని చెప్పారు
మళ్ళీ వాళ్లే చెప్పారు.. "చూస్తే చాలా దూరం నుంచి నడిచి వచ్చినట్టున్నావ్.. ఒక పని చెయ్యి.. నువ్వు మా తోనే తినేసేయి.. ఇంకో నాలుగు చపాతీ చేస్తాను.. " అందీ వాళ్ళావిడ...
నేను ఆ క్షణం లో ఏమి ఆలోచించానో తెలీదు కానీ
"సరే " అలాగే అన్నాను..
చపాతీ చేసి కూర వేసి ప్లేట్ లో ఇచ్చారు ఇద్దరు...
నేను తిన్నాను.. మధురం గా ఉంది...నేను తిన్న బెస్ట్ మీల్స్ అదే ఏమో అనిపించింది...
వాళ్ళు చూస్తే పెద్ద జాతి వాళ్ళలాగా లేరు.. మంచి ఇల్లు కాదు .. కూలి చేసుకుండే వాళ్ళ లాగా ఉన్నారు.. కానీ ఆ క్షణం నాకు అవన్నీ గుర్తు రాలేదు..నా ఆకలే మాత్రమే గుర్తొచ్చింది
.... ఆకలి కి జాతి , మతం, ఉచ్చమ్ నీచం తెలీదు.. ఆకలి కి ఒకటే తెలుసు ఆకలి తీరటానికి కాస్త ఆహారం....అంతే
చేతులు కడుక్కుని...వెళ్లేముందు.. నా జేబులోనుంచి ఒక 100 రూపాయలు ఇవ్వబోయా ను .. అప్పుడు వాళ్ళ మాట విన్నాక నేను ఎంత సంస్కార హీనున్ని అనిపించింది
"మా ఇంటికి తినే సమయంలో ఎవరు వచ్చినా అతను మాకు అతిధి లాంటివాడు.. భగవంతుడు మా విలువల్ని అప్పుడప్పుడు పరీక్షించటానికే నీలాంటివాళ్ళని పంపుతుంటాడు... కానీ మేము ఎప్పుడు ఓడిపోలేదు... అతిధిదేవోభవ అన్నారు కదా "...అన్నారు
ఆకలి మనకి మన పుస్తకాల్లో లేని ఎన్నో పాఠాలు మనకు నేర్పిస్తుంది...
ఇంకా చెప్పాలంటే మన పిల్లల్ని ఆకలితో నెలకి ఒక్కసారైనా... దేశ సంచారం చేసి రమ్మని చెప్పాలి.. అప్పుడే మనుషుల గురించి విలువల గురించి వాళ్లే మనకు చెబుతారు...
// సమాప్తం //

బ్రతకానేర్చినతనం... కథ

 బ్రతకానేర్చినతనం... కథ

==================
✍️హరీష్ (9902015746)
"మేడం శీను పక్క వాళ్ళ పేపర్ లో కాపీ కొడ్తున్నాడు మేడం...." కంప్లైంట్ చేసాడు అర్ణవ్..
కానీ ఇయర్లీ అన్నుయల్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్న వాళ్ళ మేడం పట్టించుకోలేదు...ఎప్పుడూ చేప్పే కంప్లైన్స్ ఎ లే అనుకోని
"అర్ణవ్ స్టాప్ కంప్లైనింగ్...రైట్ యువర్ ఎగ్జామ్ " అంది... అర్ణవ్ కి నచ్చలేదు కానీ ఎం చేయలేక తన ఎగ్జామ్స్ రాసేసి వచ్చాడు...
వారం తరువాత రిజల్ట్స్ వచ్చాయి... చూస్తే.. పక్క పేపర్ లో కాపీ కొట్టి రాసిన శీనుకి తన కంటే ఎక్కువ మార్కులు వచ్చాయి...మేడం వాడిని శభాష్ అని కూడా అంటోంది....
అర్ణవ్ కి పట్టలేనంత కోపం వచ్చింది...
ఆ రోజు ఒక గొప్ప సత్యం తెలుసుకున్నాడు..
"లైఫ్ లో ఎలా సంపాయించావ్ అన్నది కాదు ముఖ్యం
...... ఎంత సంపాయించావ్ అనేది ఎ ముఖ్యం... తప్పు చేసి పట్టు పడితే ఆ ఒక్క రోజే శిక్ష... పట్టుపడక పొతే..... నీతి గా సంపాయించే వాడికి ఎంత గౌరవం దక్కుతుందో....నీకు అంతే గౌరవం దక్కుతుంది..." అనుకున్నాడు...
***************
అర్ణవ్, రీహన్ ఇద్దరు అన్నదములు... ఒకే స్కూల్ లో చదువుతున్నారు...ఇద్దరికీ ఒక క్లాస్ తేడా ..... ఇద్దరు బాగానే చదువుతారు... ఫస్ట్ ర్యాంక్ కాదు కానీ బాగా చాలా నోలెడ్జి ఉంది...
***************
ఆ రోజు వాళ్ళ స్కూల్ లో స్పోర్ట్స్ డే...
ఏదో ఒక స్పోర్ట్స్ లో ఒక ప్రైజ్ కొట్టాలని ఇద్దరు.. పట్టుదల గా ఉన్నారు....
కానీ పాపం కారోమ్స్, చెస్,కబడ్డీ అన్నింట్లో ఫైనల్స్ కి వెళ్లలేక పోతున్నారు....
నెక్స్ట్ రన్నింగ్ రేస్.... రన్నింగ్ రేస్ కి చాలా మంది ఉన్నందువల్ల...
టీచర్స్ టెన్త్ క్లాస్ పిల్లలకి రన్నింగ్ రేస్ భాద్యత ఇచ్చారు...వాళ్ళు ఏమో ఒక్కొక్క క్లాస్ ని 5 గ్రూప్స్ గా డివైడ్ చేసి... ఫైనల్స్ క్వాలిఫై చేస్తున్నారు... కానీ ఒక్కొక్క గ్రూప్ లో ఎవరెవరు ఉంటారు ఉండరు అనేది వాళ్ళు చూసుకోవట్లేదు... ఇదే విషయం పసిగట్టాడు అర్ణవ్.... ఒక గ్రూప్ లో క్వాలిఫై కాక పొతే ఇంకో గ్రూప్ లో నేమ్ ఇచ్చాడు... అలా ఏదో ఒక గ్రూప్ లో ఫైనల్ కు క్వాలిఫై అయ్యాడు...
అదే విషయం... వాళ్ళ సోదరుడు రీహన్ కి కూడా చెప్పాడు...
"రారా ఎవ్వరికి తెలీదు నువ్వు కూడా...ఏదో ఒక గ్రూప్ లో పేరు ఇచ్చేయ్ అన్నాడు కానీ రీహన్ అందుకు ఒప్పుకోలేదు...
***************
స్పోర్ట్స్ ఫైనల్స్ రోజు వచ్చింది.... అర్ణవ్ వాళ్ళ క్లాస్ కి రన్నింగ్ రేస్ స్టార్ట్ అయింది....
తన శక్తి మొత్తమ్ ఉపయోగించి... పరిగెత్తాడు అర్ణవ్.. అదృష్టమో ఏమో.... తానే ఫస్ట్ వచ్చాడు....
అలా తను కూడా స్పోర్ట్స్ డే కి మెడల్ తీస్కుని.. వాళ్ళ అమ్మకు నాన్నకి చూపించాడు...
. వాళ్ళ సోదరుడు రీహన్ మాత్రం.. గుర్రు గా చూస్తున్నాడు....నీకు ప్రైజ్ ఎలా వచ్చిందో నాకు తెల్సు రా అన్నట్టు

విరామం... కథ

 --- విరామం... కథ ----

*************
మధ్యాహ్నం 1 pm అయింది.. టీవీ సీరియల్ ముగించుకొని రుక్మిణి ఇంకా భోజనం చేద్దాం అని కిచెన్ వేపు వెళతోంది ఇంతలో
"ట్రింగ్ ట్రింగ్ " మంటూ 🤔 కాలింగ్ బెల్ మొగటం తో ఈ టైం లో ఎవరబ్బా అనుకుంటూ లేచింది..
చూస్తే శ్రీవారు.. హృదయ్ గారు
"ఏంటండీ మధ్యాహ్నమే ఆఫీస్ నుంచి వచ్చేసారు పని ఎక్కువ లేదా?" అడిగింది రుక్మిణి...
" ఎం లేదు లే కానీ త్వరగా.. భోజనం పెట్టు.. సినిమా కి వెళ్దాం.. అన్నాడు హుషారు గా " అన్నాడు హృదయ్.. లాప్టాప్ బ్యాగ్ చేతికి ఇస్తూ
" ఏంటండీ విశేషం.. ప్రమోషన్ ఏమైనా వచ్చిందా ఏంటి? "
"అబ్బా ఎక్కువ ప్రశ్నలు వేయక త్వరగా తెములు " అన్నాడు విసుగ్గా...
"ఏదైనా ఈయన గారి ఫేవరెట్ హీరో సినిమా కూడా ఏమి లేదే " అనుకుంటూ... బయలుదేరింది రుక్మిణి
పిల్లలు వస్తే కీస్ ఇవ్వమని చెప్పి పక్క ఇంట్లో కీస్ ఇచ్చి బయలుదేరారు
***** ***** ****
ఇద్దరు సినిమా హల్లో కూర్చున్నారు...
ఎప్పుడు లేంది... ఈలలు వేస్తూ చూస్తున్నారు అయన...
సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని పెళ్లి చేసుకున్న రుక్మిణి... పది ఏళ్ళు గా చూస్తోంది... ఎప్పుడు లాప్టాప్ వైపు దిష్టి బొమ్మ లాగా ఎక్స్ప్రెషన్ లేకుండా కూర్చోటమే.... కానీ ఉలుకు పలుకు,మాట మంతి.,...తక్కువే హృదయ్ కి...ఇవాళ ఇంత ఆనందానికి కారణం ఏంటో అంతు పట్టట్లేదు మేడం కి...
మావయ్య వాళ్లేమన్నా ఊరుణించి వస్తున్నారా.. లేకపోతే చుట్టాలు ఎవరైనా పెళ్ళికి పిలిచారా...
లేకపోతే ఆ మాయదారి మేన మరదలు ఏమైనా మళ్ళీ ఫోన్ చేసి కావ్వించిందా...
లేక ఏ పాత గర్ల్ ఫ్రెండ్ అయినా ఫేస్బుక్ లో రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసిందా...
ఏంటో రకరకాల ఆలోచనలు రుక్మిణి ని అవహించాయి...
"హ హ హ... " స్క్రీన్ వైపు చూస్తూ మళ్ళీ గట్టిగా నవ్వాడు హృదయ్...
"ఏమిటి ఈయన వాలకం... నాకు మాత్రం ఒక క్వశ్చన్ పేపర్ వదిలేసి ఆయన మాత్రం హాయిగా నవ్వుకుంటున్నాడు...." అనుకుంది...
రుక్మిణికి బొత్తిగా సినిమా బుర్రలోకి ఎక్కట్లేదు...
సినిమా అయిపోయింది .....
సినిమా అయ్యాక.. ట్యాంక్ బండ్ అంతా నడిచారు... ఇద్దరు... హృదయ్ ఏవేవో చెప్తున్నాడు కానీ రుక్మిణి కి మాత్రం ఎం ఎక్కట్లేదు... పోనీ అడుగుదామా అంటే కసురు కుంటాడని మానుకుంది.... టైం ఆరు అయింది ఇంకా ఇంటికి వెళ్దామా అంటే లేదు పారడైస్ బిర్యానీ తిని వెళ్దాం అన్నాడు..
మరి పిల్లలు అంటే " సరే పార్సెల్ తీసుకెళ్దాం " అని పెద్ద ఫ్యామిలి ప్యాక్ తీసుకున్నాడు.,
******* *******
ఇంటికి వెళ్లేసరికి పిల్లలిద్దరు టీవీ చూస్తున్నారు... బిర్యానీ వాసన పిల్లలు వెంటనే ప్లేట్స్ తెచ్చుకుని వడ్డించుకున్నారు...
భోజనం అయ్యాక... బెదురూమ్ లో ఫోన్ లో ఏవో వీడియోలు చూసుకుంటున్నాడు... హృదయ్
ఇప్పటికైనా చెప్తారా మీ ఆనందానికి కారణం...
ఇప్పుడోద్దులే... రేపు పిల్లలు స్కూల్ కి వెళ్ళాక చెప్తా అని పడుకున్నాడు..
******* *******
తెల్లారి పడింటికి లేచి కాఫీ తెచ్చుకుని సోఫా లో పేపర్ చదువుతున్నాడు హృదయ్
"ఏంటి ఇంత లేట్ గా లేచారు... ఆఫీస్ కి సెలవ్ పెట్టారా " అడిగింది రుక్మిణి
"ఆ ఇక ఒకటే సెలవు "
"అర్ధం కాలేదు "
"ఆఫీస్ లో ప్రాజెక్ట్స్ లేవట రిజైన్ చేయమన్నారు... చేసాను..."
"ఏంటి రిజైన్ చేసారా... 🥵😡. " అని అరిచినట్టుగా అడిగింది రుక్మిణి..
మళ్ళీ తానే అనింది
" మరి అంత తాపీగా ఎలా ఉన్నారు అండీ రాత్రి నుంచి..."
"మరి ఎం చేయమంటావ్...
ఇన్ ఫాక్ట్ నేనే ఈ రోజు కోసం ఎదురు చూస్తున్నా.. పది ఏళ్ల నుంచి ఒకటే ఆఫీస్..
ఒకటే పని... ఒకే బాస్ చూసి చూసి బోర్ కొట్టేసింది... కాసేపు ఎక్కువ పడుకోవాలన్నా బాస్ పర్మిషన్... కాస్త లేట్ గా రావాలన్నా పర్మిషన్.... లీవ్ పెట్టాలన్నా పర్మిషన్.. పోనీ ఏమైనా జీతం పెంచుతాడా అంటే అది లేదు... ఎవరో పీక నొక్కుతున్నట్టు గా కలలు వచ్చేవి... ఇపుడు టోటల్ రిలాక్స్ అవుతాను... అలా వన్ మంత్ నాకు కావాల్సినంత నిద్ర పోతాను ఫస్ట్.. తర్వాతి సంగతి తర్వాత..."
"మరి జాబ్ లేకపోతే.."
"మరి మనిషే పొతే పర్లేదా...?"
" .. "
" విరామం లేకుండా బండి నడిపితే ఆక్సిడెంట్ ఎలా అవుతాయో... అలాగే విశ్రాంతి లేకుండా జాబ్ చేసినా ఉత్సాహం ఉండదు.....
నాకున్న అనుభవానికి ఖచ్చితంగా ఇంకో జాబ్ వస్తుంది లే కానీ.. నన్ను మళ్ళీ లంచ్ కి లేపు... "
అనేసి మళ్ళీ వెళ్ళి రూమ్ డోర్ వెస్కొని పడుకున్నాడు హృదయ్
---- సమాప్తం -----
✍️ హరీష్

42 ) ఆశ కథ

 ఆశ - (chinna katha ) “గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ ” అంటూ శర్మ గారు క్లాస్ మొదలు పెట్టారు. అతను చెప్తున్నది తొమ్మిదవ తరగతి మ్యాథమెటిక్స్ క్లా...