తీపి కోరిక ..... కథ
--------------------------
పొద్దున్నే మార్నింగ్ వాక్ వెళ్లే ప్రసాదరావు కాళ్ళు రోజూ ఆ దుకాణం ముందుకు రాగానే ఆగి పోతాయి....
అరవై ఎళ్ళు దాటిన ప్రసాద్ రావు గవర్నమెంట్ జాబ్ లో రిటైర్ అయ్యారు. చాలా కాలంగా మధుమేహం తో బాధ పడ్తున్నాడు.
అవును అండి...బాధ అంటే మాములు బాధ కాదు... ఎందుకంటే ప్రసాదు గారికి మిఠాయి అంటే అంత ఇష్టం మరి...
ఉన్న కొడుకు కూతురి పెళ్లిళ్లు చేసేసాడు...ఇద్దరు వేరే ఊళ్లలో ఉంటున్నారు.. ఎప్పుడైనా ఏ పండగకో పెళ్లిళ్లకో వచ్చి పోతు ఉంటారు....
తల్లి తండ్రులని కలుసుకోవటం కూడా అప్పుడే
రోజూ లాగే ఆ రోజుకూడా వాకింగ్ చేస్తున్న ప్రసాదు గారి కాళ్ళు ఆ
"బాలాజీ మిఠాయి బండార్ " అనే షాప్ ముందుకు వచ్చేసరికి బ్రేక్ పడ్డాయి...
"ఇవాళ ఎలాగైనా ఒక్క పాలకోవా అయినా నోట్లో వేసుకోవాల్సిందే..." అనుకున్నాడు...
వెంటనే వాళ్ళ ఆవిడ తన అందరితో అనే మాటలు గుర్తొచ్చాయి..
"ఏవిటో అండీ ... ఆయనకి ఎంత ఈడు వచ్చినా ఆ వెధవ స్వీట్ల మీద మక్కువ మాత్రం చావట్లేదు... ఈ మధ్య ఆ మధుమేహం కదా కాస్త తగ్గించారు కానీ కోరిక అలాగే ఉంది... ఏ చుట్టాలింటికి వెళ్లాలన్నా కష్టమే .. వాళ్ళు పెట్టే స్వీట్స్ ఎంక్కడ తినేస్తారో అని..."
వాళ్ళావిడ మాటలన్నీ గుర్తు చేస్కుంటు పార్క్ లో నడుస్తూ ఉన్నాడు ... అప్పుడే ఎదురుగా ... కాలనీ లో ఉండే... పూరషోత్తం గారు స్వీట్ ప్యాకెట్ తో కనిపించారు...
"ప్రసాద్ గారు... మా ఇద్దరికీ us వీసా వచ్చింది అండి.. స్వీట్ తీస్కోండి.... ఓహ్ సారీ అండీ మీరు తినకూడదు ఏమో కదా..."
"పర్లేదు లెండి.. చిన్న దూద్ పెడా ముక్కే కదా ఒకటి తీస్కుంటా లే.... "
అంటూ ఒక చిన్న ఉండ తీస్కుని నోట్లో వేసుకున్నాడు...
అలా నడుస్తూ ఉంటే ఆ దూద్ పేడ తాలుకు జ్యూస్ మెల్లగా గొంతు లోకి జారుతూ ఉంటే ఆహా ఇదే కదా స్వర్గం అనుకుంటూ... ఇంటి వరకు ఆస్వాదిస్తూ వెళ్ళాడు..
ఇంట్లోకి వెళ్ళాక టీపాయ్ పైన ఉన్న కవర్ ఏమిటా అని చూస్తుంటే...వాళ్ళావిడ కృష్ణవేణి అంది
"అది మీ షుగర్ రిపోర్ట్ ఇందాకే తెచ్చిచాడు కొరియర్ బాయ్...చెక్ చేశాను...పర్లేదు బోర్డర్ ఉన్నట్టుంది...ఇంకా మీరు కాస్త కంట్రోల్ ఉండాలి.. ఇదిగో మిమ్మల్నే...చెప్తుంటే వినకుండా వెళ్లి పోతారు...."
అని చెప్తుండగానే లోపలికి స్నానానికి అని వెల్లారు.....ప్రసాదు గారు
స్నానం చేస్తున్నంత సేపు.. షుగర్ కంట్రోల్ లో ఉంది అన్న మాటే పదే పదే వినిపిస్తోంది....
స్నానం ముగించుకొని... ఇదిగో నిన్నే బయటికి వెళ్ళొస్తా అని చెప్పి బయలు దేరాడు ..
"ఇపుడెక్కడికి.. టిఫిన్ చేయకుండా..?." అని కృష్ణవేణి అంటున్నా కూడా వినిపించుకోకుండా కళ్లద్దాలు పెట్టుకుంటూ బయలు దేరారు...
*** **** ****
ఆ రోజు సాయంత్రం.... ప్రసాద్ రావు గారికి ఆయాసం గుండె దడ అంటే.. హాస్పిటల్ కి తీసుకొచ్చారు....పక్క వీధిలో వాళ్ళ సాయం తో..ప్రసాదరావు గారి బంధువులు.. చుట్టుపక్కవాళ్ళు అంతా హాస్పిటల్ కి చేరుకున్నారు..
ఇంతకీ సంగతేంటా అని ఆరా తీస్తే.. ఆ రోజు పొద్దునే స్వీట్ షాప్ కి వెళ్లి ఒక
పావు కిలో స్వీట్ ఒక్కరే తినేశారట...
అయన లేచాక ఏమైంది ఎందుకు అలా చేశారు అని వాళ్ళావిడ అడిగితే...అయన అన్నారు
"హ్మ్మ్ నాకు అరవై ఏళ్ళు వచ్చాయి.. పిల్లలు సెటిల్ అయ్యారు ఇక్కడికి కి వస్తారో రారో కూడా తెలీదు.. ఇలాంటి పరిస్థితుల్లో...నేను ఇంకా నా ఆరోగ్యం కాపాడుకోని నేను ఎం ఉద్దరించాలి ...తినాలని అనిపించే చిన్న చిన్న కోరికలని ఆపుకొని... ఇంకా పథ్యం పాటించాలా అని అనిపించింది.. ఇంకా ఎన్నేళ్లు నోరు కట్టేసుకోవటం... ఉన్నన్ని రోజులు సంతోషంగా ఉండి.. ఆ తరువాత... హాయిగా కన్ను మూస్తే అంతకంటే ఎం కావాలి ఈ జన్మకి.. "
అని చెప్తూ పోయారు ప్రసాదరావు గారు.. కంట నీరుని చీర కొంగుతో తుడుచుకుంటూ వింటోంది.. కృష్ణవేణి....
No comments:
Post a Comment