Wednesday, April 1, 2026

42 ) ఆశ కథ

 ఆశ - (chinna katha )


“గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ ” అంటూ శర్మ గారు క్లాస్ మొదలు పెట్టారు. అతను చెప్తున్నది తొమ్మిదవ తరగతి మ్యాథమెటిక్స్ క్లాస్.

“అందరు జామెట్రీ బాక్స్ తెచ్చారు కదా .. ఓపెన్ చేయండి .. ఇవాళ మనం ట్రైయాంగిల్స్ ఎలా చేస్తారో చూద్దాం” అంటూ బోర్డు మీద చెప్తూ వెళ్తున్నాడు.

బోర్డు మీద జామెట్రీ ట్రైయాంగిల్స్ , స్క్వేర్స్ ,రెక్టయాంగిల్స్ అంటూ చెప్పుకుంటూ వెళ్తున్నారు. స్టూడెంట్స్ అందరూ తమ జామెట్రీ బాక్స్ లోని ఆయుధాలు తీసి యుద్ధవీరుల్లాగా చాలా కష్టపడుతున్నారు. దాదాపు క్లాస్ లో అందరు స్టూడెంట్స్ కూడా సార్ తో పాటే ఆ బొమ్మలు గీసే ప్రయత్నం చేస్తున్నారు.

ఒక్కరు తప్ప. ఆ అమ్మాయి పేరే ఆశ.

ఆశకు ఉపాద్యాయుడు గీస్తున్న బొమ్మలన్నీ పిచ్చి గీతల్లాగా కనిపిస్తున్నాయి. కాసేపు ఎలా గీయాలా అని ప్రయత్నించాక ఇక లాభం లేదు అనుకుందో ఏమో పెన్సిల్ స్కేల్ పక్కన పడేసి ఆశ తన కుర్చీలో కూలబడి, శర్మ మాస్టారునే చూస్తూ ఉండిపోయింది. పాఠం వినకుండా తన నోట్‌బుక్‌లో బొమ్మలు గీస్తోంది.

ఆశ కు ఎప్పుడూ గణితం అన్నా సంఖ్యలన్నా ఆమె కళ్ల ముందు అర్థం లేని గీతలుగా కదులుతూ ఉండేవి. ఎంత ప్రయత్నించినా ఆ సంఖ్యలు తన మనసుకు ఎక్కేవి కాదు. అందువల్ల ఎగ్జామ్స్ లో కూడా ఎప్పుడు మాథెమాటిక్స్ (గణితం)లో ఎప్పుడు తక్కువ మార్కులు వచ్చేవి. అది ఆమెలో మరింత నిరాశను పెంచింది.

తన సమస్య ఏమిటి అని అడిగిన వారు లేరు, ఆశ కూడా కాస్త భయస్తురాలు కావటం చేత ఎవరిని సహాయం అడగలేక పోయింది. నెమ్మది నెమ్మది గా అందరి నుంచి దూరంగా లాస్ట్ బెంచ్ కి వెళ్ళిపోయింది. తన సమస్య ఇది అని అర్ధం కానీ క్లాసుమేట్స్ తనకి "లాస్ట్ బెంచర్" అని పేరు పెట్టి నవ్వుకుండేవారు. ఆ నవ్వులు తన వరకు వినపడేవి.

తనకి రిపోర్ట్ కార్డు ఇచ్చిన ప్రతి సారి ఆమె తల్లిదండ్రులు అరిచే వారు. ఇంక చెప్పి- చెప్పి లాభం లేదు ఆశకి ఇక చదువు రాదు అనుకుని ఆశ మీద తమ ఆశలు వదిలేసుకున్నారు, తన క్లాస్‌మేట్స్ కూడా తరచుగా ఆమె మర్క్స్ గురించి గుసగుసలాడుకోవటం తాను కూడా గమనించేది. కానీ చేసేది లేక తనలో తానే కుమిలిపోయేది. కానీ తను భాద పడినట్టు బయట పడితే ఇంకా భాద పెడతారు అనుకుని తన బాధని బయటపడకుండా జాగ్రత్త పడింది. ఆ జాగ్రత్తే ఆమెకి “పొగరు” అనే ఇంకో పేరుని కూడా తీసుకొచ్చింది .

ఉపాధ్యాయులు అందరు కూడా ఈ అమ్మాయి ఎటూ చివరి బెంచీ నే కదా ఏం చదువుతుంది లే అని నిర్ణయించేసుకొని ఆశను పట్టించుకోవటం మానేశారు.

అయితే, మిస్టర్ శర్మ గారు మాత్రం వారికీ భిన్నంగా ఉండేవాడు. అతను ఆశ లోని అల్లరి కళ్ళ వెనకాల ఉన్న భాదను , ఆమెను లోతుగా పరిశీలించి చూసేవారు. ఆమె నిర్లక్ష్యం పొరల కింద దాగి ఉన్న మేధస్సు లోని మెరుపును, సామర్థ్యం లోని నిప్పును చూశాడు. ఇతర ఉపాధ్యాయులు ఆశను "ఆశ లేనిది" అని ముద్ర వేశారు, కానీ మిస్టర్ శర్మ అలా అనకుండా వారించాడు.

ఒక మధ్యాహ్నం, అందరూ లంచ్ అయ్యాక పిల్లలు బయటకు వెళ్ళిపోయిన తర్వాత, మిస్టర్ శర్మ ఆశను తన డెస్క్ దగ్గరకు పిలిచాడు. ఆశ ఎప్పటిలాగే ఏమి ఉపన్యాసం వినాల్సి వస్తుందో అనుకుంటూ వెళ్ళింది.

మిస్టర్ శర్మ ఆమెతో , "ఆశ, చెప్పు, గణితంలో నీకు ఏ చాప్టర్ కష్టంగా అనిపిస్తుంది ?" అని అడిగారు.

ఆశ ఆశ్చర్యపోయింది. ఆమెను ఇంతకు ముందు ఎవరూ అలా అడగలేదు.

తటపటాయిస్తూనే , ఆమె “సార్ .. నాకు బేసిక్స్ అర్థం కావడం లేదు .. కానీ క్లాస్ లో అడగాలంటే ఎవరైనా నవ్వుతారేమో అని అడగడానికి సిగ్గుపడి పోతుంటాను సార్ ” అని తన భాద అంతా చెప్పింది. మిస్టర్ శర్మ ఓపికగా విన్నాడు, అప్పుడప్పుడు తల ఊపాడు.

"నువ్వు కొత్తగా ఏదైనా ప్రయత్నించడానికి సిద్ధంగా ఉన్నావా?" అని అతను అడిగాడు.

"సరే స్కూల్ తర్వాత కేవలం పదిహేను నిమిషాలు, నేను స్కూల్ లోనే ఉంటాను నన్ను కలవు … వారానికి మూడు సార్లు, నీకు ఉన్న ఏ సందేహాలు అయినా సరే అడుగు చెప్తాను , నేను ఎవ్వరికి చెప్పను ."

ఆశకు సందిగ్ధం లో పడింది, కానీ మిస్టర్ శర్మ కళ్ళలో ఏదో ఒక మెరుపు సహాయం చేయాలన్న నిజాయితీ కనిపించింది - సహాయం చేయాలనే నిజమైన తపన కనిపించింది - అది ఆమెకు ఇంతకు ముందు ఎవరి దగ్గర కనపడలేదు . తటపటాయిస్తూనే ఆమె అందుకు అంగీకరించింది.

మొదట కొన్ని సెషన్లు ఇబ్బందికరంగా అనిపించాయి . ఆశ ఇంకా ఏదయినా అడగటానికి తటపటాయించేది , కానీ మిస్టర్ శర్మ చాలా ఓపికగా పర్వాలేదు అని ప్రోత్సహించేవారు. ఆయన కేవలం ఆ చాప్టర్ ను వివరించడమే కాదు; అతను రోజువారీ ఉదాహరణలను ఉపయోగించి చెప్పేవారు , రేఖాచిత్రాలు ద్వారా వివరించే వారు ,అంతే కాకుండా సూత్రాలను (ఫార్ములాస్)ను గుర్తుంచుకోవడానికి ఆమెకు చిన్న చిన్న ట్రిక్స్ కూడా తయారు చేశాడు. ఆశ చెప్పిన ప్రతి సరైన సమాధానాన్ని, ఎంత సరళమైనదైనా సరే, ఎంత కష్టమైనదైన సరే అభినందించి ప్రోత్సహించేవారు.

నెమ్మదిగా నెమ్మదిగా ఆశలో ఏదో కొంత మార్పు వచ్చింది. తరువాత ఆమెలో గుర్తించలేనంతగా పెద్ద మార్పు స్పష్టంగా కనపడుతోంది. ఇప్పుడు కొద్దిగా పెద్ద ప్రశ్నలు కూడా అర్థం కావడం ప్రారంభించాయి. ప్రశ్నలు అడగాలనే భయం కూడా తగ్గింది. మొదట్లో హోమ్‌వర్క్ అని అడిగితే చేయలేదు అని నిర్లక్షయంగా చెప్పే ఆశ , ఇప్పుడు హోమ్‌వర్క్ కూడా చేస్తోంది ఎవరి బలవంతం మీదనో కాదు, తన పెరుగుతున్న అవగాహనతో. క్లాసు జరుగుతున్నపుడు ఆమె ఇపుడు పిచ్చి బొమ్మల గీయటం లేదు , వాటి స్థానంలో రఫ్ నోట్స్ లో రాస్తోంది.

ఆ రోజు హాఫ్ ఇయర్లి ఎక్సమ్ రిజల్ట్స్ పేపర్స్ ఇచ్చేరోజు. ఒక్కొక్కరి పేపర్స్ ఇస్తున్న మిస్టర్ శర్మ గారు ఆశ ప్రకటించినప్పుడు, "ఆశ, 85%" అని పిలవగానే తరగతి గదిలో నిశ్శబ్దం ఆవరించింది. అందరి కళ్ళు ఆశ వైపే ఉన్నాయ్. ఆశ తన పేపర్ తీసుకుంది. తనని తానే నమ్మలేక పోయింది. పేపర్ చూసుకుంటున్న ఆశ కళ్ళు తనకు తెలీకుండా కన్నీటి భాష్పాలు రాలుతున్నాయి.

ఆశ కళ్ళు విప్పారాయి. ఆమె ఇంత ఎక్కువ మార్కులు ఎప్పుడూ సాధించలేదు. ఆమె క్లాస్‌మేట్స్ షాక్‌లో ఉన్నారు. కొందరు నమ్మలేనట్లుగా ఆమె వైపు చూస్తుంటే , మరికొందరు కొత్తగా వచ్చిన గౌరవంతో చూశారు. మిస్టర్ శర్మ పెదవులపై చిన్న చిరునవ్వు, వారి భాగస్వామ్య కృషికి నిశ్శబ్ద అంగీకారం.

ఈ కథలోని నీతి:

మొదటిది, విద్యార్థులకు, అంకితభావం మరియు సరైన మార్గదర్శకత్వంతో ఎవరైనా తమ సవాళ్లను అధిగమించి విజయం సాధించగలరని ఇది చూపిస్తుంది. ఆశ యొక్క మార్పు తక్షణం కాదు; ఇది నిరంతర కృషి ఫలితం.

రెండవది, ఓపిక, నమ్మకం ఉండాలి . ప్రతి విద్యార్థికి సామర్థ్యం ఉందని, మరియు కొన్నిసార్లు వారికి కావలసిందల్లా వారిని నమ్మే ఒక వ్యక్తి మాత్రమేనని ఇది మనకు బోధిస్తుంది


writer : Harish Babu (9902015746)





No comments:

Post a Comment

42 ) ఆశ కథ

 ఆశ - (chinna katha ) “గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ ” అంటూ శర్మ గారు క్లాస్ మొదలు పెట్టారు. అతను చెప్తున్నది తొమ్మిదవ తరగతి మ్యాథమెటిక్స్ క్లా...