Showing posts with label 64 ) హోమ్ టూర్... కథ. Show all posts
Showing posts with label 64 ) హోమ్ టూర్... కథ. Show all posts

Friday, August 21, 2026

64 ) హోమ్ టూర్... కథ

 హోమ్ టూర్... కథ

🌷🌷🌷🌹🌹🌹🌷🌷🌷🌺🌺🌺
------
చదివింది బీటెక్ అయినా గవర్నమెంట్ జాబ్ వచ్చినందుకు చాలా సంతోషించాడు సతీష్
గవర్నమెంట్ జాబ్ కానీ నెలలో పదిహేను రోజులు టూర్స్ వెళ్లాల్సి వచ్చేది
అలా ఒకసారి బెంగళూరు వెళ్లి పదిహేను రోజుల తర్వాత అలసిపోయి ఇంటికి వచ్చాడు
కాలింగ్ బెల్ రింగ్ అవటం తో డోర్ తీసి దిష్టిబొమ్మలా నుంచుంది భార్య సీత
'ఏంటి సీతామహాలక్ష్మి..... లోపలికి రానివ్వవా ఏంటి అడ్డంగా నుంచుని ఉన్నావు? " అంటూ చిరాగ్గా భార్యని తప్పుకోమని లోపలికి నడిచాడు సతీష్
అలిసిపోయి డైరెక్టుగా బాత్రూంలోకి వెళ్లి ఫ్రెష్ అయ్యి హాల్ లోకి వచ్చాడు
ఇంటిని చూసి ఇది మా ఇల్లా కాదా అన్నట్టు చూస్తూ ఉండి పోయాడు...లోపలికి వచ్చినప్పుడు గమనించలేదు ఇల్లంతా బోసిగా ఉంది ఏదో ఇంట్లో సామానంతా అమ్మి ఇల్లు ఖాళీ చేస్తున్నట్టుగా
ఏంటి ఇంట్లో సామానంతా ఏమైంది అడిగాడు సతీష్
ఇన్కమ్ టాక్స్ వాళ్ళు వచ్చి రైడ్ చేసి మొత్తం పట్టుకెళ్లారండి
ఏంటే నువ్ చెప్పేది...ఇన్కమ్ టాక్స్ వాళ్ళు ఎందుకు వచ్చారు
అది...అది.. అని..నసుగు తున్న భార్య ను
"త్వరగా చెప్పవే హార్ట్ ఎటాక్ తెప్పించకు" అన్నాడు సతీష్
"ఏం లేదండి మీరు వెళ్ళాక నాకు టైం పాస్ కాక కొత్తగా స్టార్ట్ చేసిన యూట్యూబ్ ఛానల్ లో....
'హోమ్ టూర్'.. అని ఒక వీడియో పెట్టి మన ఇంట్లో ఉన్న ఇంటీరియర్స్, ఎక్స్టీరియర్స్ అన్ని కలిపి ఒక వీడియో చేసి అప్లోడ్ చేశాను అది చాలా వైరల్ అయింది....కానీ రెండు రోజుల్లోనే ఐటీ వాళ్ళు రైడ్ చేసారు ....వాళ్ళు ఉన్న వస్తువులన్నీ వాల్యుయేషన్ చేసి....
మీ భర్త శాలరీ తో కంపేర్ చేస్తే...ఇవి చాలా ఎక్కువ వాటికీ బిల్స్ చూపించి మళ్ళీ తీసుకెళ్లండి అని పట్టుకెళ్ళి పోయారండి" అని చెప్పింది
దానికి కంగుతిన్న సతీష్
" నీ బొంద హోమ్ టూర్ చేయడానికి మన దగ్గర ఉన్నవి ఏమైనా వైట్ మనీ తో కొన్ని వస్తువులను అనుకున్నావా...ఇవన్నీ అన్ని బ్లాక్ మనీ.తోనే కొన్నది .... డబ్బులు ఎక్కడ పెట్టాలో అర్థం కాక... ఈ కాస్ట్లి(ఖరీదైన )ఐటమ్స్ కొని పెట్టాను.. నీ మైండ్ కి అది కూడా తెలియదు అనమాట..
నా కర్మ ...మొత్తానికి 4 రోజుల్లో నా సంపద మొత్తం మట్టిలో కలిపేశావ్ కదే "
అంటూ తల బాదు కున్నాడు సతీష్
"అదేంటండి మీరు ఎపుడు అడిగినా ...నా సంపాదన నా సంపాదన అనేవారు కదా..."
అంటూ బుగ్గమీద వేలు పెట్టుకొని అమాయకంగా అడుగుతున్న భార్య వైపు బాధ గా చూసాడు సతీషు....

94 ) రోలింగ్ టైటిల్స్.. కథ :

  రోలింగ్ టైటిల్స్.. కథ :  ~~~~~~~~~~~~~~~~~~~ గగన్ ఒక మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్. గొంతులో వైవిధ్యం, పాత్రకు తగ్గట్టుగా ప్రాణం పోయగల ప్రతిభ అతన...