హౌస్ షిఫ్టింగ్ ... కథ
=≠===============
అది సీతా కాలం... బెంగుళూరు లో అతి సీతల కాలపు ఒక సాయంత్రం ..
నేను మా వైఫ్ తో కులాసాగా వాకింగ్ చేస్తున్నాం..,. ఎపుడూ రోడ్ పైన వాకింగ్ చేసే మేము ఆ రోజు ఆ కాలనీ రోడ్స్ తిరుగుతున్నాం...
ఆ లేన్ చాలా ప్రశాంతంగా ఉంది.. తక్కువ జనాలు పెద్ద రోడ్లు.. క్లీన్ అండ్ గ్రీన్ గా చెత్త లేకుండా... పక్కనే ఒక టెంపుల్... ఆహా ఈ లేన్ ఎంత బాగుంది
అని మనసులో అనుకోని ఆ లైన్ లో నడుస్తూ ఉన్న నాకు....తల ఎత్తగా ఒక మూడు అంతస్తుల బిల్డింగ్ పైన టులెట్ బోర్డు కనపడింది...
మారే ఉద్దేశం లేక పోయినప్పటికీ చూద్దాం అని ఫోన్ చేశా..తర్డ్ ఫ్లోర్ ఖాళీ అయింది అని రెంట్ 8 వేలు 3 మంత్స్ అడ్వాన్స్ అని చెప్పారు... పైకి వెళ్లి చూసా.. 2 bhk టైల్స్ ఫ్లోర్రింగ్ విత్ కపబోర్డ్స్ ఉన్నాయ్...హబ్బా ఎంత బాగుంది...అర్జెంటు గా దిగి పోవాలని అనిపించింది.. వెంటనే ఓనర్ ని రిక్వెస్ట్ చేసి ఒక నెల అడ్వాన్స్ ఇచ్చేట్టు ఒప్పించా ఓనర్ ని.... అడ్వాన్స్ పంపాను ...
మేము ఇపుడు ఉండే ఇంటి ఓనర్ కీ చెప్పేశా.... ఖాళీ చేస్తున్నాం అని....
యాచువాలీ ఇప్పుడు ఉండే ఇంట్లో ఎందుకో గత నాలుగు నెలలు గా మానసిక ప్రశాంతత లేదు... ఇంటి పక్క వాళ్ళ తో గొడవ.. చాలా ఇరుకు ఇల్లు....
1 bhk... గెస్ట్స్ వచ్చిన ఇబ్బంది.... చుట్టూ కూడా కన్నడ బాషా వాళ్లే.. పైపెచ్చు.. బెంగుళూరు లో వర్షాలకి మా ఇంటి కీ తిరిగే సందు దగ్గర వర్షం పడ్డప్పుడు... బండి స్కిడ్ కూడా అయ్యేది... జారేది .. అర్ధరాత్రి అప్పుడు ..
వీటన్నిటికీ తోడు ఈ మధ్య డ్రైనేజీ అని రోడ్ మొత్తం తవ్వేశారు... బండి ఎక్కడో పెట్టి ఇంటికి రావాలి... తెల్లారే సరికి బండి ఉంటుందో పోతుందో తెలీని పరిస్థితి..
వీటన్నిటి నుంచి ఎలాగా బయట పడటం అని ఆలోచిస్తుండగా... ఈ విషయం జరిగింది...
చూస్తుండగానే నెలాఖరు వచ్చింది.. ఎందుకో నాకు మా కిందా, పైన పోర్షన్ ల వాళ్ళకి వెళ్తున్నాం అని చెప్పాలని అనిపించలేదు...వాళ్ళు పెట్టిన టార్చర్ కీ
అందుకే ఒక ప్లాన్ వేసా..తెల్లారి...6 am ముందే వెళ్లి పోవాలని
ఆ ముందు రోజుసాయంత్రం.. ఒక ట్రక్ మాట్లాడాను... ఒక నలుగురు పని వాళ్ళతో సహా..నాలుగు వేలు అడిగారు... సరే..పొద్దున్న
4 am.... నాలుగు ఇంటికి రావాలి అని చెప్పా.. వాళ్ళు అదేంటి అంత ప్రొద్దున... అని అంటే...ఆఫీస్ వెళ్ళాలి టైమ్ లేదు అని చెప్పా..
మొత్తం అన్ని సామాన్లు మ ఆవిడ లాగవంగా సర్దిసింది....ఒక్క పాడుకొనే పరుపులు తప్ప...రాత్రి తాగటానికి గ్లాస్ కూడా లేదు.... అంత ఫుల్లీ పాక్డ్..
డ్రైనేజీ పనులవల్ల మా ఇంటికి మూడు వైపులా లూస్ మట్టి ఉంది.. వర్షానికి కాలు పెడితె అరికాలు లోపలికి దిగుతుంది ... సో నేను అలోచించి ముందే ట్రక్ వాళ్ళకి మా ఇంటికి ఉన్న ఒక సందు వెనకాల పెట్టు అని చెప్పను...
ఆ ఖాళీ చేసే ముందు రోజు రాత్రి 12 కీ అనుకోకుండా జోరున వర్షం మొదలయింది...
" ఓరి దేవుడా..నేను వేసిన ప్లాన్ అంతా ప్లాప్ అవుతుందా" అనిపించింది.. రోడ్లు మొత్తం మట్టి.. మోకాళ్ళ లోతుగా బురద... ఎం చేయాలో వాళ్ళు వస్తే.. అసలు వస్తారా ఆ వర్షలో... రాకపోతే పరిస్థితి ఏంటి....ఒక థ్రిల్లర్ సినిమా చూస్తున్న ఫీలింగ్
( కాదు చేస్తున్న ఫీలింగ్ )
అలా ఆలోచిస్తూ.. పడుకున్నా..
పొద్దున్న నాలుగు అయింది అని అలారమ్ మోగింది
ఫోన్ కూడా మోగింది...
"సార్... వచ్చేసాం "అన్నాడు ట్రక్ డ్రైవర్ .. సరే అని ఎలా రావాలో చెప్పా
చుట్టూ చీకటి...బయట చూస్తే ఇంకా వర్షం సన్నటి జల్లు పడుతూనే ఉంది
"పర్లేదే వీళ్ళు టైం కీ వచ్చారే..ఇంత వర్షం లోను... లోడ్ చేగాలుగుతారో లేదో.."అనుకునన్నా....
అంత కాలు దిగి పోయేంత బురద లోను.... వాళ్ళు పైకి వచ్చారు...
ఒక్కొక్క సామాను తీసుకెళ్లి ట్రక్ లో సర్దుతున్నారు.... సినిమా లో లాగే.. స్ట్రీట్ లైట్ వెలుతురు లో..
వాళ్ళు వచ్చి వెళ్తున్న కూడా ఎదురింటి వాళ్ళు కానీ... మా ఇంటి మూడు ఫ్లోర్ల లో జనాలు కానీ లేవక పోవటం విశేషం...
అలా పొద్దున్న 6 am వరకు తీసుకెళ్లారు.. ఎల్సీడీ టీవీ ఎం చేసారా అని చూస్తే డ్రైవర్ దగ్గర పెట్టాం అని చెప్పారు...చూస్తే ఒక పదేళ్ల బుడ్డోడి చేతిలో భద్రంగా ఉంది
మెల్లగా తెల్లవారుతోంది... ఇంటి ముందు ఆయన నిద్ర లేచాడు... ఏమిటి మీరు ఖాళీ చేస్తున్నారా అని అడిగాడు.. అవును అని చెప్పను... "సారీ చెప్పే టైం లేదు" అని అన్నాను..
6 am కీ ఫినిష్ చేసి మా బైక్ ని ఫాలో అవ్వమని చెప్పి బైక్ మీద ఫ్యామిలి తో కొత్త ఇంటికి సేఫ్ గా వెళ్లి పోయాను...
కొత్త ఇంటి తలుపు తెరిచి కుర్చీ లో రిలాక్స్ అయ్యాక ఊపిరి పీల్చుకున్నాను....
" యస్... మొత్తానికి సాధించాను...ఇంత వర్షం లో కూడా ఒక్కరు కూడా లేవక ముందే.. వచ్చేసాను" అని...మనసులో అనుకున్నా
ఈ మొత్తం సీన్ లో హీరోస్ అంటే ఆ నలుగురు పనివాళ్ళే... ఒక మిషన్ లాగా వర్షాన్ని బురదని లెక్క చేయక పని పూర్తి చేసారు... " వాళ్ళు అడిగిన దానికన్నా 500 ఎక్కువ ఇచ్చాను
కొద్దీ రోజుల తరువాత.. ఎవరో చెప్పారు మా పాత ఇంట్లో వాళ్ళుఆ రోజు....మేము వచ్చేసాక...మెట్లు చూస్కుంటే అంత బురద అది ఉందిట మెట్ల నిండా... మేం చెప్పకుండా ఖాళీ చేసినందుకు అవాక్కు అయ్యారట... 

అది నా లైఫ్ లో ఒక థ్రిల్లర్ కథ...