Showing posts with label 72 ) కోఫీ బాగుంది ... కథ. Show all posts
Showing posts with label 72 ) కోఫీ బాగుంది ... కథ. Show all posts

Friday, August 21, 2026

72 ) కోఫీ బాగుంది ... కథ

72 ) కోఫీ బాగుంది ... కథ
================
✍️ హరీష్
అవి నేను బెంగుళూరు లో ఉండే రోజులు...
స్వతహాగా నాకు పెద్దగా ఎవరింటికి వెళ్ళటం అలవాటు లేదు... అనుకోకుండా మా వీధిలో ఎవరో తెలుగువారు కొత్తగా పరిచయం అయ్యారు...
వాళ్ళు ఆ దగ్గిరలో ఒక ప్లాట్ కొనుక్కుని ఇల్లు కట్టుకుంటున్నారని తెలిసింది. డీటెయిల్స్ కనుకుందామని ఒకరోజు మా ఫ్యామిలీ తో సహా వాళ్ళ ఇంటికి వెళ్ళాము...
ఆ ఇంటి అయన ప్రకాష్... వాళ్ళ ఆవిడా బాగా రిసీవ్ చేసుకున్నారు...వెళ్లినా దగ్గరినుంచి వాళ్ళావిడ.. కొత్త ఇంటి గురించి విపరీతమైన ఎక్సయిట్మెంట్ తో చెప్తోంది..
కాసేపయ్యాక ప్రకాష్ కోఫీ ఇవ్వమంటే ఆవిడ లోపలికెళ్లి కోఫీ కలుపుకొని వచ్చి అందరికి సర్వ్ చేసారు...
కోఫీ బాగుంది...
అదే మాట నేను బయటికి అన్నాను
"కోఫీ బాగుంది అండి " అని వాళ్ళావిడతో...
ఇంతలో ప్రకాష్ కెవ్వున అరిచాడు
" చంపేశారు అండి... మీరు వెళ్ళాక నాకు ఒక గంట క్లాస్ ఉంటుంది లెండి " అన్నాడు..
"సరే మేము వెళ్ళొస్తామండీ.." అని బయలుదేరాము
అసలు విషయం ఏమిటి అంటే ఆయన లైఫ్ లో ఎపుడు ఆవిడ కాఫీ ని మెచ్చుకోలేదు ట...
"ఓహ్ మై గాడ్!!! వెళ్ళినోడిని వెళ్లినట్టు ఉండకుండా... వాళ్ళ ఫ్యామిలీ లో మంట పెట్టి వచ్చా నాన్న మాట "
అనుకుని నాలుక కరుచుకున్నాను నేను 🤣🤣
అది కథ.

94 ) రోలింగ్ టైటిల్స్.. కథ :

  రోలింగ్ టైటిల్స్.. కథ :  ~~~~~~~~~~~~~~~~~~~ గగన్ ఒక మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్. గొంతులో వైవిధ్యం, పాత్రకు తగ్గట్టుగా ప్రాణం పోయగల ప్రతిభ అతన...