story -30) బస్టాండ్ లో కుక్క... కథ
=≠===============
-----------------
కాసేపు అతను చూపిస్తున్న మూవీస్ చూస్తూ చూస్తూ నిద్ర లోకి జారుకున్నాను... రాత్రి పది ఆ ప్రాంతం లో బస్సు ఆపాడు... భోజనం చేసే వాళ్ళు ఇక్కడ భోజనం చేయచ్చు 20 మినిట్స్ ఆగుతుంది బస్ అని చెప్పి దిగాడు బస్సు డ్రైవర్...
కాస్త నిద్ర మత్తులోనే ఉన్న కూడా బస్సు దిగాను కాస్త పరిసరాలు చూద్దాము అని... అదొక అలవాటు బస్ ఆగిన చోట అల్లా దిగి చుట్టూ చూడటం...
సరే హోటల్ లో ఫుడ్ ఎలా ఉందా అని చూస్తే భయంకరంగా ఉంది... ఆ హోటల్ పరిసరాలు, ఆ భోజనం అవి ఎం బాలేవు...
సరే అని బయట పడి ఒక 2 బిస్కేట్ పాకెట్స్ తీసుకున్నా... ఓపెన్ చేసి అక్కడ ఆగి ఉన్న మిగతా బస్సులు ఎక్కడికి వెళ్తున్నాయా అని పరిశీలిస్తు బిస్కెట్స్ తింటున్న ( ఇది ఇంకో పనిలేని పని )
ఇంతలో నా ముందుకు ఒక నల్లటి వీధి కుక్క వచ్చి నా వేపే చూస్తోంది.. కాసేపు వెళ్తుందేమో అని చూసా... కానీ ఉహు అలాగే తీక్షణంగా నన్నే చూస్తోంది...
ఓహో ఇది నా బిస్కెట్స్ లాక్కుంటుందేమో అని అటు ఇంకో వేపుకు తిరిగా....మళ్ళీ కాస్ట ముందుకు వచ్చి నన్నే చూస్తోంది
"ఒసేయ్ పాడు కుక్క.. ఇక్కడ ఇంతమంది ఉంటే నన్నే చూస్తావేంటి... " అనుకున్నాను మనసులో..మాములుగా నాకు కుక్కలకి ఫుడ్ పెట్టేంత జంతు ప్రేమ కాదు
"సరే ఇంకా కాసేపు ఉంటే కరిసే లాగా ఉంది ఎందుకు వచ్చింది " అనుకుని.. ఒక బిస్కెట్ దాని ముందు పడేసా...ఎంత ఆకలి మీద ఉందొ ఏమో గబ్బా గబా తినేసింది... అయిపోయాక మళ్ళీ నావేపు చూస్తోంది...
దీని బిహేవియర్ నాకు చాలా నచ్చింది... దానికి నిజంగా కావాలంటే ఆకలి మీద ఉంటే నా మీద అరవచ్చు కరవచ్చు.. కానీ చాలా వినమ్రతతో ఓర్పుతో నా వైపు మాత్రమే జస్త్ చూస్తోంది.. నేను దాని వైపు చూసినప్పుడు... తల అటు తిప్పుకుంటోంది...
సరే అనుకోని ఇంకో బిస్కెట్ వేసా మళ్ళీ తినేసింది...
అలా మొత్తం నా ప్యాకెట్ మొత్తం ఖాళీ చేసేసింది...
దాని మంచితనానినికి వినయనికి ముచ్చటసింది... నాలో నేనే నవ్వుకుని... బస్సు ఎక్కేసాను...
ఆరోజు నాకు ఒక గొప్ప పాఠం నేర్పించింది.... ఆవేశ పడకుండా వినయంగా ఓర్పుతో అడిగితె ఎవరి మనసు అయినా కరుగుతుంది... అని
అప్పత్నించి ఏదయినా కుక్క కనపడితే.. ఒక ప్యాకెట్ బిస్కెట్ కొని వేస్తూ ఉంటాను...
No comments:
Post a Comment