Friday, August 21, 2026

66 ) పులకింత.... కథ -

 పులకింత....చిన్న కథ -

=================
28feb2022

నేను డిగ్రీ కంప్లీట్ చేసి ట్యూషన్ చెప్పుకొని డబ్బులు సంపాదించే రోజులు అవి
ఒక పెద్ద స్కూల్ ప్రొద్దున తొమ్మిది నుంచి సాయంత్రం మూడింటి వరకు స్కూల్ జరిగితే మళ్లీ నాలుగున్నర నుంచి 7:30 వరకు స్పెషల్ క్లాస్ అని బయట టీచర్స్ ని పిలిపించి క్లాస్ చెప్పించే వారు
అలా వచ్చిన గెస్ట్ టీచర్స్ లో నేను ఒకడిని. 7th క్లాస్ to 10th క్లాస్ వరకు ఉండేవి ఆ ఈవెనింగ్ క్లాస్సేస్.
పాపం పిల్లలు ఆ ఏజ్ లోనే రాత్రి 8 వరకు ఇంటికి వెళ్ళేవాళ్ళు కాదు..

ఐతే ఆ క్లాస్సేస్ వల్ల 4 తర్వాత ఇంటికి వెళ్లి గాలికి తిరగ కుండా చదువు అలవాటు అయ్యేలాగా మేము చేయగలిగాము

చేయగలిగాము అని ఎలా తెల్సింది అంటే ఒక రోజు రాత్రి తన ఇద్దరు ఆడపిల్లల్ని ఇంటికి తీసుకెళ్ళటానికి వచ్చిన వాళ్ళ అమ్మ
నా దగ్గరికి వచ్చి "థాంక్ యూ సర్ " అని చెప్పింది
"ఎందుకు అంది థాంక్ యు " అని అడిగా ...

"నేను పన్నెండు ఏళ్ళు గా చేయలేని పని మీరు చేసారు సర్
.. మీరు ఎం చెప్పారో ఎలా చెప్పారో తెలీదు కానీ...
తిట్టినా కూడా పుస్తకం ముట్టని మా పిల్లలు ఇప్పుడు ఇంత రాత్రి ఇంటికి వచ్చాక కూడా...
అన్నం తిని ..మళ్ళీ పుస్తకం పట్టుకుని చదువు కుని పడుకుంటున్నారు "

నేను చిన్నగా నవ్వి "ఎం లేదు లేమ్మా ఇద్దరు మంచి పిల్లలు..
కాస్త భయం పెడితే వల్లే వృద్ధిలోకి వస్తారు..
బాగా చదువుకోవాలి.. వెళ్లి రండి " అని పంపించాను

ఇలాంటి మాట వినటం గాని...నన్ను ఎవరైనా మెచ్చుకోవటం గాని...
అదే మొదటి సారేమో ఆ చీకట్లో నా కళ్లద్దాల వెనక చిన్న కన్నీటి చెమ్మ చేరుకుంది..

ఆ పేరెంట్ వెళ్ళిపోగానే నా అద్దాలు తీసి చిటికెన వేలుతో కంటి చివర తుడుచుకున్నాను ....

నేను టీచర్ గా చేసింది ఒక ఎడాదే అయినా కూడా
ఒక జీవిత కాలానికి సరిపడే జ్ఞాపకాలు ఆ స్కూల్ ఇచ్చింది...
ఆ స్కూల్ మూమెంట్స్ గుర్తు చేసుకుంటే ...
పెదాల అంచున ఒక చిన్న నవ్వు వస్తుంది..
కంటికి కనిపించినంత చిన్నది ..

No comments:

Post a Comment

94 ) రోలింగ్ టైటిల్స్.. కథ :

  రోలింగ్ టైటిల్స్.. కథ :  ~~~~~~~~~~~~~~~~~~~ గగన్ ఒక మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్. గొంతులో వైవిధ్యం, పాత్రకు తగ్గట్టుగా ప్రాణం పోయగల ప్రతిభ అతన...