పెళ్లి పిలుపు.. (కథ)
...................
ఈ మధ్య .. మా రిలేటివ్స్ లో ఒక అతను వాళ్ళ అబ్బాయి పెళ్లి అని పిలిస్తే మా ఫామిలీ తో వెళ్ళాను .
మ్యారేజ్ హాల్ ఎంట్రన్స్ డిజైన్ కి బాగానే ఖర్చు పెట్టారు అనిపిస్తోంది ..
పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ముస్తాబై ఉన్నారు పెళ్లి మండపం లో
పెళ్ళికొడుకు పెళ్లికూతురు కి జీల కర్ర బెల్లం పెట్టాడు
ఇక అటెండెన్స్ ప్రోగ్రాం స్టార్ట్ అయింది .....అదేనండి అక్షింతల ప్రోగ్రాం అక్షింతలు వేయటం ఏమో గాని ఆ కెమెరామెన్ సర్కస్ చూడలేకపోతున్నాం అండీ బాబు .. ,
డ్రోన్ కెమెరాలు, ట్రయిన్ కెమెరాలు ,కూర్చునే కెమెరాలు, నుంచునే కెమెరాలు....మొత్తం స్టేజి అంత ఆ కెమరామెన్ తో నింపేసి చుట్టూ వెయ్యి కుర్చీలు వేశారు ...ఎం చూడాలనో అర్ధం కాలేదు ...
ఆహ...చివరికి ఎలాగో ఆలా ...వధూవరులను కలిసాము
పెళ్ళికొడుకు వాళ్ల తండ్రి మా తండ్రి కామన్ రిలేటివ్స్ అవ్వడం వల్ల, నైబర్స్ కామన్ కావడం వల్ల ,కామన్ ఫ్రెండ్స్ అవ్వడం వల్ల పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ మమ్మల్ని కలిశారు, మేము అందరినీ కలిశాం..
పెళ్లి కి డెకరేషన్స్ కి ఖర్చు చేసిన ఆర్భాటం పెళ్లి భోజనానికి వెచ్చించినట్టు లేరు ... అతి నాసిరకంగా ఉన్నాయ్ ... ఎలాగో ఆలా ,,తర్వత భోజనం ముగిసింది.. పాన్ నోట్లో వేసుకున్నాను..
చెప్పాలంటే వచ్చిన ఆహ్వానితులు అంతా వారిని పేరు పేరున పలకరించి నందుకు ఖుషి అయ్యారు అనే చెప్పాలి ..
మరి ఆహ్వానించిన వారెవరు స్టేజి దిగి రాలేరు మరి .... లేటెస్ట్ ట్రెండ్ అదే కదా
పెళ్లి జరిగాక పెళ్లి కొడుకు తల్లి కిందకి వచ్చింది పలకరిస్తుందేమో అనుకున్నాను.. కానీ వేరే డబ్బున్న వాళ్ళ వైపు పరిగెట్టడం గమనించాను ... సరేలే అనుకున్నాను ...
పెళ్లి కొడుకు అక్కలు కానీ అమ్మ కానీ అయ్యా కానీ ...పలకరించలేదు ...
మనదేం పోయింది ఎవరి కర్మణా వల్లే పోతారు అనుకుని ...ఎటు వచ్చాం కదా అని ఎదో ఐస్ క్రీం లాగిస్తూ ... ఆ గానా బజానా ఎదో విన్నాం ...
ఆ తంతు అంతా ముగిసాక ...మొత్తానికి ఇంటికి చేరాం..
ఆ తర్వాత పది రోజులకు.... పెళ్ళికొడుకు తండ్రి దారిలో కలిశాడు...
కొసమెరుపు ఏంటంటే
"ఏంటండి మా అబ్బాయి పెళ్ళికి మీరు రాలేదు ?" అని అడిగాడు
అది అండీ కథ.. ఈమధ్య జనాలు పెళ్ళికి పిలుస్తున్నారు కానీ వచ్చిన వాళ్ళు ఎవరో .. రాని వాళ్ళు ఎవరో తెలీటం లేదు ... కూడా తెలియట్లేదు... స్టేజ్ కిందకు దిగితే కదా..
పెళ్లి లో ఆత్మీయంగా పలకరించటం అనేది మానేశారు అనుకుంట
#harishsworld
writer : హరీష్ (9902015746)
No comments:
Post a Comment