Friday, August 21, 2026

81 ) చదువుల - పిచ్చి

 

 81 )  చదువుల - పిచ్చి 

==========
✍️ హరీష్ బాబు
అవి మేము ఇంటర్మీడియట్ చదువుతున్న రోజులు.. మేము ఫస్ట్ ఫ్లోర్ లో ఉండేవాళ్ళం
మా ఇంటి పక్కనే ఇంకో ఇల్లు ఉండేది. అది కేవలం గ్రౌండ్ ఫ్లోర్ ఉండేది. ఆ ఇంట్లో ఉండే పెద్దవాళ్లు పిల్లలు చుట్టాలు చుట్టాలు పిల్లలు అందరూ సాయంత్రం నాలుగు ఇంటి తర్వాత ఎక్కువ శాతం టెర్రస్ మీదే గడిపేవారు. చాప తెచ్చుకొని పడుకోవటం తలలు దువ్వుకోవటం, అన్నం తినిపించుకోవటం, దగ్గరనుంచి పెద్ద వాళ్ళు కుర్చీలు వేసుకొని కబుర్లు చెప్పుకోవడం, రాత్రి నక్షత్రాలను చంద్రుడిని చూస్తూ పడుకోవటం వరకు
వాళ్లతో పెద్దగా మాట్లాడే చనువు నాకు లేదు గాని తీరిక దొరికినప్పుడు వాళ్ళని గమనిస్తూ ఉండేవాడిని. ఫస్ట్ ఫ్లోర్లో ఉండటం వల్ల, మనం వద్దన్నా అనుకున్నా సరే ఇంట్లోంచి బయటికి తిరుగుతున్న ప్రతిసారి వాళ్ళు చేసే ప్రతి పని గమనిస్తూ ఉండేవాడిని అలా వాళ్ళ ఇంటికి వచ్చిన చుట్టాల్లో పిల్లలు ఇద్దరు కవల పిల్లలు రవి గిరి అని ఉండేవాళ్ళు. వాళ్లు కూడా నాతో పాటే టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఇంటర్మీడియట్ చదువుతున్నారు
మాతో పాటు ఇంటర్మీడియట్ అయిపోయింది గాని వాళ్లకి ఎంసెట్ లో అంత మంచి ర్యాంకులు రాలేదు. మా సంగతి పక్కన పెడితే వాళ్ళ ఇంట్లో ఆ రోజు నుంచి విపరీతమైన ప్రెషర్ మొదలైంది మీరిద్దరే మా ఇంటికి పెద్దదిక్కు.
మీరు చదివి పెద్ద ఉద్యోగాలు తెచ్చుకోవాలి ఇంజనీర్లు అవ్వాలి. ఒక ఏడాది మళ్ళీ పోతే పోయింది మళ్ళీ చదివి ఎంసెట్లో మంచి ర్యాంక్ తెచ్చుకుంటే ఫ్రీ సీట్ వస్తది... ఇలాంటి రకరకాల స్టేట్మెంట్స్ వాళ్లకు పేరెంట్స్ ద్వారా వాళ్ళకి చెప్పటం మాకు వినిపిస్తూ ఉండేది..
ఆ చదివే వాళ్ళకి అలా చదవటం ఇష్టం ఉందో లేకుండా అసలు వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటో ఏమి తెలుసుకోకుండా ... పేరెంట్స్ వాళ్ళని లాంగ్ టైం కోచింగ్ కి జాయిన్ చేశారు ఎంసెట్ ర్యాంకు కోసం..
అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉండేవారు ఎలా ఉన్నాయి చదువులు అంటే బానే ఉంది మంచి మార్క్స్ వస్తున్నాయి అంతక ముందు ముందు కంటే బాగుంది అని చెప్తూ ఉండేవారు వాళ్ల పేరెంట్స్ కళ్ళల్లో కూడా కాస్త ఆనందం కనిపిస్తూ ఉండేది
కాలం గడిచింది ఏడాది అయిపోయింది మళ్లీ ఎంసెట్ రాశారు 2 నెలల తర్వాత రిజల్ట్స్ వచ్చాయి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత కొద్ది నెలలపాటు ఆ పిల్లలిద్దరూ కనిపించలేదు
కొన్ని నెలల తర్వాత ఆ ఇంటి టెర్రస్ పైన మళ్ళీ కనిపించారు ఇద్దరు.. చాలా రోజులైంది కదా అని పలకరించాను
ఏమ్మా బాగున్నారా ? అని..
వాళ్ళిద్దరూ ఎటేటో దిక్కులు చూస్తున్నారు మొదట నేను పొరబడ్డాను ఆటిట్యూడ్ వచ్చిందేమో పలకట్లేదు ఏమో అని
కాసేపు అయ్యాక వాళ్ళ నాన్నగారు వచ్చారు పైకి వచ్చారు...
నేను వాళ్ళని పలకరించే ప్రయత్నం చేస్తున్నాను అని చూసి బాబు వాళ్ళను పలకరించొద్దు అని అన్నారు
ఏమైంది అని అడిగాను
ఎంసెట్లో ర్యాంకు రాకపోవడం వలన నిరాశ చెంది విపరీతమైన ప్రెషర్ మూలంగా మా అంచనాలను అందుకోలేక
వాళ్ళు మతిస్థిమితం కోల్పోయారు
అని చెప్పారు ఒకరు కాదు ఇద్దరు కూడా మతిస్థిమితం కోల్పోయారట.
ఎవరితో మాట్లాడుతున్నారో ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియకుండా మనుషుల్లో గుర్తుపట్టకుండా తయారయ్యారు అని చెప్పారు
నేను షాక్ కి గురి అయ్యాను
అప్పుడు అనుకున్నాను
నేను ఎంత అదృష్టవంతుడినా అని మా పేరెంట్స్ ఇంత ప్రెషర్ నా మీద పెట్టలేదు కదా...
పిల్లలకు ఏమి ఇష్టమో తెలుసుకోకుండా వాళ్ళ ఎంతవరకు బండి లాగగలరు అనేది తెలుసుకోకుండా విపరీతమైన ప్రెషర్ పెడితే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో అర్థమైంది
ఆ తర్వాత కొద్ది రోజులు కోలుకున్నారని చెప్పారు కానీ మన పార్టీ లాగా ఉన్న తేజస్సు మళ్ళీ వాళ్ళ మొహంలో ఎప్పుడూ కనపడలేదు
--- సమాప్తం ---
 
telugu stories for reading
telugu kathalu
తెలుగు కథలు
kathalu in telugu
telugu stories to read
telugu stories
stories in telugu
kathalu telugu
telugu stories read online
story in telugu
telugu storys
తెలుగు స్టోరీస్.
కథల పోటీ 2026
telugu kadhalu
తెలుగు సాహిత్య పత్రిక
తెలుగు ప్రేరణాత్మక కథ

No comments:

Post a Comment

94 ) రోలింగ్ టైటిల్స్.. కథ :

  రోలింగ్ టైటిల్స్.. కథ :  ~~~~~~~~~~~~~~~~~~~ గగన్ ఒక మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్. గొంతులో వైవిధ్యం, పాత్రకు తగ్గట్టుగా ప్రాణం పోయగల ప్రతిభ అతన...