Saturday, August 15, 2026

55) ఆటోవాలా.. కథ

55) ఆటోవాలా.. కథ 

=============

✍️హరీష్ బాబు 


 ఇంటి నుంచి కిలోమీటర్ దూరం ఏ కదా మళ్ళీ దీనికి కూడా కార్ ఎందుకు తీరా పోయిన తర్వాత అక్కడ కార్ పార్కింగ్ ఇబ్బంది అవుతుంది ఆటోలో వెళ్దామని ఇంటి నుంచి బయలుదేరాను


 రోడ్డు పక్కన నుంచుంటే ఎంతసేపటికి కూడా ఒక ఆటో రాదు ఒకవేళ వచ్చిన ఆ ఆటో వాడు ఖాళీగా ఉన్న ఆపకుండా వెళ్ళిపోతున్నారు.


   వీళ్ళ దుంప తెగ ఒకపక్క ఎక్కే వాళ్ళను లేరు అంటారు చెయ్యి ఎక్కుతాను రా బాబు అన్న కూడా ఫోన్లు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు అని మనసులో తిట్టుకున్నాను 


 చివరికి కాసేపటికి ఒక 50 ఏళ్లు పైబడిన ఒక ఆటో డ్రైవర్ ఆపాడు సగం దూరం వస్తాను అని చెప్పాడు సరే పద అన్నాను దారి మధ్యలో ఇద్దరు ముగ్గురిని ప్యాసింజర్స్ దింపేసిన తర్వాత అతన్ని అడిగాను 


 ఏంటండీ ఆల్రెడీ 7 pm అయిపోయింది 

12 pm దాకా నడుపుతారా ఇలా అన్నాను 


 12 pm దాకా నా పాడ.. 9 pm.. మహా అయితే అంతే అన్నాడు అతను 


 అదేంటి అలసిపోయారా అని అడిగాను 


 "ఈ ఫ్రీ బస్సులు వచ్చాక లేడీస్ ఎవరూ మా ఆటోలు ఎక్కటం లేదు... పోనీ ఆఫీస్ కి వెళ్లే వాళ్ళు వచ్చేవాళ్ళు అన్నా ఎక్కుతారా అంటే ఈ హైర్ బైక్ లు వచ్చాక.... జనాలు ఇంటి దగ్గర నుంచి ఆఫీసుకు బయలుదేరేటప్పుడు... ఆ యాప్ ఓపెన్ చేసి ఎవరో ఒకరిని ఎక్కించుకొని.. ఆఫీస్ వరకు వెళ్లి పెట్రోల్ డబ్బులు సేవ్ చేసుకుంటున్నారు...ఈ ఎంప్లాయిస్ ఇంకా సాటర్  డే సండే  వస్తే కొంతమంది అయితే రోజు మొత్తం తిరిగేసి డబల్ శాలరీ సంపాదించేస్తున్నారు" .. అని దీనంగా వాపోయాడు 

" అయ్యో పాపం ఈ ఆటో వాళ్ళ పరిస్థితి దుర్భరంగా తయారైంది కదా " అనుకున్నాను 


 అతనికి డబ్బు ఇచ్చేసి ఇంకో ఆటో కోసం ఎదురుచూపు మొదలుపెట్టాను ఇంతలో వచ్చాయి సెవెన్ సీటర్ షేర్ ఆటోలు ఆటోలు 


" సార్ ఎక్కండి సార్ ఎక్కండి "అంటున్నాడు


పోనీ వెళ్తాడా అంటే వెళ్ళడు వెయిటింగ్.. 

    నేను వెళ్ళలేదు ఒక కిలోమీటర్ కూడా లేదు అతని ఆటోలో ఎక్కి కూర్చొని ఒక పావు గంట వెయిట్ చేసి అతను మొత్తం ఆటో నింపుకున్నాక ముందు సీట్ నుంచి వెనక్కి వెనకనుంచి ముందుకి నన్ను తిప్పిన తర్వాత అప్పుడు ఆటో కదులుతుందట 

   ఇంకా ఇది ఇలా కాదని కాస్త ముందుకు వెళ్లి నుంచొని ఆగాను .. ఒక సెవెన్ సీటర్ ఆటో ఖాళీగానే ఉంది వచ్చి ముందు ఆగింది 

ఎక్కండి సార్ అన్నాడు 

 సరే కదా అని ఎక్కి 

"నువ్వైనా వెళ్తున్నావా ఏమన్నా వెయిటింగ్ ఉందా " అని అడిగాను 

 నా మాటలో ఏం బూతుందో... అర్థం కాలేదు 

"దిగేస్తే దిగేయండి సార్" అన్నాడు 

 అదేంటయ్యా నేను అడిగిన దాంట్లో తప్పేముంది 

  నువ్వు ఏమన్నా ఆగేది ఉంటే నేను కాస్త దిగి ఇంకో ఆటో ఎక్కుతాను.. నేను వెళ్లవలసింది ఆఫ్ కిలోమీటర్ కూడా లేదు.. అని చెప్పాను

  నేను అంత మర్యాదగా మాట్లాడినా ఎక్కితే ఎక్కండి దిగితే దిగండి సార్ అంటున్నాడు 

   అప్పుడు అనుకున్నాను వీళ్ళ గురించి బాధపడాల్సిన పనేలేదు ఇంత ఒళ్ళు పొగరుగా జవాబు ఇచ్చి ఇస్తున్నారు కాబట్టి వీళ్ళకి ఆల్టర్నేటివ్వే గా ఎవరో బాగా భాద పడే ఆ యాప్స్ కనిపెట్టారు అని 

   పాపం  కొంతమందికి ఉండే పొగరుబోతు ప్రవర్తన వల్ల మిగతా ఆటో డ్రైవర్లు కూడా నష్టపోతున్నారన్నమాట... అని అర్థమైంది ఇంక నోరు మూసుకొని నా ప్రయాణం ముగించుకొని ఇంటికి బయలుదేరాను 


... సమాప్తం..

No comments:

Post a Comment

94 ) రోలింగ్ టైటిల్స్.. కథ :

  రోలింగ్ టైటిల్స్.. కథ :  ~~~~~~~~~~~~~~~~~~~ గగన్ ఒక మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్. గొంతులో వైవిధ్యం, పాత్రకు తగ్గట్టుగా ప్రాణం పోయగల ప్రతిభ అతన...