Friday, August 21, 2026

67 ) విలువలు.. కథ

 67 ) విలువలు... . #chinnakatha

≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈
(1mar2022)
అపుడు నేను ఒక స్కూల్ లో ట్యూషన్ టీచర్ గా జాబ్ చేస్తున్నాను. పిల్లలకి మాథ్స్ తప్ప అన్ని సబ్జక్ట్స్ వివరించే వాడిని .. రాయించటం చదివించటం, అప్పచెప్పించుకోవటం, నా దిన చర్య
ఆ స్కూల్ మొత్తం నాలుగురు పార్టనర్స్ తో నడిచేది. ఒకానొక పార్టనర్ భార్య విజయ గారు అని ప్రిన్సిపాల్ గా చేసేవారు.వేరే పార్టనర్స్ అంతగా స్కూల్ కీ వచ్చేవారు కాదు.
అలా ఒకరోజు నేను పిల్లల కీ ఇంగ్లీష్ లెసన్ ఎక్సప్లయిన్ చేస్తుంటే అనుకోకుండా ఒక స్కూల్ పార్టనర్ స్కూల్ లోకి వచ్చి మేము క్లాస్సేస్ ఎలా చెప్తున్నామా అని కిటికీ నుంచి తొంగి చూస్తున్నారు.
అప్పుడు నేను బాగా ఇన్వాల్వ్ అయ్యి ఇంగ్లీష్ క్లాస్ చెప్తున్నాను.. ఆయనని చూడలేదు చుసినా పట్టించుకోలేదు. దానికి అతను హర్ట్ అయ్యాడో ఏమో.. గబా గబా క్లాస్ లోకి వచ్చి
" ఇలాగా క్లాస్ చెప్పేది? ... ఒక్కొక్కరిని లేపి 2 లైన్స్ చదవమని చెప్పు " అన్నాడు
నేను బదులు ఇవ్వలేదు.. అందరు అలాగే చదివి కూర్చున్నారు... అతను కాసేపయ్యాక వెళ్ళిపోయాడు.. ఆయన వెళ్లి పోయాక పిల్లలు చెప్పారు...
"ఆయన కూడా ఒక పార్టనర్ సార్ "అని...
' అవునా ఒకె.." అని
.నేను యాదవిదిగా క్లాస్ చెప్పి ఇంటికి వెళ్పోయా....పెద్దగా పట్టించుకోలేదు..
మరుసటి రోజు సాయంత్రం మళ్ళీ నా టైం కీ క్లాస్ కీ వెళ్లి క్లాస్ స్టార్ట్ చేసాను...
ఇంతలో క్లాస్ రూమ్ డోర్ దగ్గర కీ "ప్రిన్సిపాల్ విజయ" మేడం గారు వచ్చారు ..
"సార్ ఒకసారి బయటికి వస్తారా.. " అన్నారు
సాధారణంగా ఆవిడ పైకి రారు పనుంటే ఆయా చేత కబురు పంపిస్తారు... తనను కలవమని చెప్తారు ... కానీ ఆవిడే స్వయంగా ఎందుకు వచ్చారా అని ఆలోచిస్తూ వెళ్ళాను.....
"సారీ sir... నిన్న జరిగిన విషయం తెలిసింది.. మీరు మనసులో ఏమి పెట్టుకోవద్దు.. " అన్నారు...
"ఏ విషయం "అని నాలో నేను తల గోక్కుటున్నాను
ఇంతలో ఆవిడే పసిగట్టి
"అదే sir పార్టనర్ Mr. xxx వచ్చారంట కదా మీ క్లాస్ కీ.. ఆ ఇన్సిడెంట్...." అని ఆవిడ అంటుంటే ...
"అవును..". అన్నాను
"ఆయన మీతో రూడ్ గా బిహేవ్ చేశారట తెల్సింది... It is out of our control sir .. అయన తరఫున నేను మీకు క్షమాపణ చెప్తున్నాను " అన్నారు...
"అయ్యో ఇట్స్ ఒకే మేడం " అన్నాను తను వెళ్లిపోయారు...
తను వెళ్లి పోయాక నేను ఆలోచన లో పడ్డాను
"ఎంత గొప్ప సంస్కారం వీళ్లది... ఒక సాధారణ మైన ట్యూషన్ టీచర్ కోసం ఒక ప్రిన్సిపాల్ 3 ఫ్లోర్స్ ఎక్కీ మరీ వచ్చి సారీ చెప్తున్నారే...నేను కనీసం కంప్లైంట్ అయినా చేయలేదు... అయినా సరే వాళ్లే తెల్సుకొని వచ్చి అడగటం చాలా గొప్పగా అనిపించింది.... ...
మీ లాంటి వాళ్ళ వల్లే ఇంకా మంచి టీచర్స్ బ్రతికి ఉన్నారు.. మీ స్కూల్ తప్పకుండ కొన్ని ఏళ్ల పాటు ఉండటమే కాకుండా.. పిల్లలకి విద్య తో పాటు మంచి విలువలు కూడా నేర్పించే అతి కొద్దీ స్కూల్స్ లో మీది కూడా ఒకటి గా నిలుస్తుంది....అని అనుకున్నాను
అనుకున్నట్టే ఆ స్కూల్ ఇప్పటికి 20 ఏళ్ల తరువాత కూడా చెక్కు చెదారకుండా అలాగే ఉంది

No comments:

Post a Comment

94 ) రోలింగ్ టైటిల్స్.. కథ :

  రోలింగ్ టైటిల్స్.. కథ :  ~~~~~~~~~~~~~~~~~~~ గగన్ ఒక మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్. గొంతులో వైవిధ్యం, పాత్రకు తగ్గట్టుగా ప్రాణం పోయగల ప్రతిభ అతన...