63 ) మనసు ఇచ్చా కానీ ... కథ ( ఆటగాడి ప్రేమ కథ ...)
--------------------------------------
జోరున వర్షం పడుతోంది . వర్షం తాలూకు సౌండ్ రూమ్ లోపలివరకు వస్తుంది. సునీల్ అని బాగా గడ్డం ఉన్న ఒక వ్యక్తి డార్కుగా ఉన్న రూమ్ లో బ్లూ లైట్ బ్యాక్ గ్రౌండ్ లో కూర్చుని డ్రింక్ చేస్తూ కూర్చుని తన గతాన్ని గుర్తు చేసుకుంటున్నాడు
"ప్రేమించాను అనుకున్నా కాని నాతో నేను ఆడే ఫుట్బాల్ తో నన్నే తంతుంది అనుకోలేదు
అసలు ఆ రోజుల్లో నేను ఫుట్బాల్ ఆడుతుంటే... జనాలు.... పిచ్చెక్కి. చూసేవాళ్ళు..."
***************
అది ఒక కాలేజ్ ఫుట్బాల్ స్టేడియం చుట్టూ కాలేజ్ స్టూడెంట్స్ అందరూ ఎంకరేజ్ చేస్తుంటే మధ్యలో రెండు కాలేజీ టీమ్స్ మధ్య ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతూ ఉంది
కెమెరా ఇపుడు ప్రేక్షకుల గేలరీ మీద నుంచి అందరి ప్లేయర్స్ మీదకు వెళ్లి అటు నుంచి ఒక్కొక ప్లేయర్ వైపు వెళ్లి లాస్ట్ కు ఒక ప్లేయర్ వెనుక షాడోమీద కు వెళ్లి ఆగుతుంది ...అతడే సునీల్ ...ఇప్పుడు ఆ ప్లేయర్ కాళ్లు వెంటే కెమెరా మూవ్ అవుతోంది .....ఫుట్బాల్ తన్నుకుంటూ తన్నుకుంటూ .. ఫాస్ట్ గా వచ్చిన అతను ఆ ఫుట్బాల్నీ ఫ్రెండ్ కి పాస్ చేస్తూ ఒక "ఎస్" ఆకారంలో ఫాస్ట్ ఫాస్ట్ రన్ చేస్తూ గోల్ చేసాడు
ప్రతి 5 నిమిషాలకి వరుసగా మళ్ళీ మళ్ళీ ....గోల్స్ చేస్తూ మ్యాచ్లో మొత్తముగా 10 గోల్స్ చేస్తాడు
ఇప్పుడు కెమెరా ఆ ఫుట్ బాల్ మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకులు లోకి వెళుతుంది ....హీరోయిన్ సునీత ని హైలెట్ చేస్తుంది సునీత ... సునీత గోల్ గోల్ అని అరుస్తూ ఎంజాయ్ చేస్తోంది చేస్తోంది... సునిల్ చేసే ఒక్కొక్క గోల్ కి తాను ఇంప్రెస్ అయింది
సునీల్ కి సునీత కాలేజీ లో ఎదురుపడ్తుంది ... ఇద్దరు మధ్య ఒక స్మైల్ తరువాత పరిచయంగా మారింది
ఆ తరువాత కొద్దీ రోజులకే వారిద్దరూ మంచి ఫ్రెండ్స్ గ మారిపోతారు ...ఇంకా చాల ఎక్కువే క్లోజ్ అవుతారు
ఇద్దరు ఫోన్ నంబర్స్ షేర్ చేసుకుంటారు .... మొదట్లో అప్పుడపుడు వచ్చే మెస్సగెస్ ఇపుడు ... ఎపుడెపుడా అని ఎదురుచూసే అంత గా క్లోజ్ అయిపోయారు
ఇలా ఒక నాలుగు నెలలు..తర్వాత సునీల్ సునీత తో పీకలలోతు ప్రేమలో పడతాడు ....ఇక పెళ్లి అంటూ చేసుకుంటే సునితాని పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు
అయితే సడన్ గా ఒక రోజు నుంచి సునీత సునీల్ ని కలవడం మానేసింది ........ పిచ్చి వాడిలాగా తిరుగుతూ ఉంటాడు సునీల్ ........ ఎంత వెతికినా సునీత ఎక్కడ ఉంది అనేది సునీల్ కి అర్థం కాలేదు
లాస్ట్ కి ఒకరోజు తన ఫ్రెండ్ ద్వారా తెలుస్తుంది ........సునీతకి , అశోక్ అనే వ్యక్తి తో ఎంగేజ్మెంట్ అయిందని తెలుసుకుంటాడు సునీల్
సునీల్ కి చెప్పలేనంత కోపం వస్తుంది అయితే సునీత మీద ఉన్న నమ్మకంతో ఆ కోపాన్ని అనుచుకొని అదేదో సునీతనే అడిగి తెలుసుకుందాం అనుకున్నాడు
ఆ రోజు దసరా పండుగ ఉండటంతో తప్పకుండా గుడి కి వస్తుంది అని గుడికి వెళ్లే దారిలో వెయిట్ చేస్తూ ఉంటాడు
గుడి నుంచి నుంచి వచ్చే దారిలో చీకట్లో ఒక రోడ్డు మధ్యలో సునీత ఇంటికి గుడికి మధ్యలో ఎవరూ లేని చోట సునీత తన ఫ్రెండ్ తో పాటు వస్తూ ఉంటుంది. దారిలో ఒక చోట సునీల్ బైక్ పార్క్ చేసి ఆగి ఉండటం చూస్తుంది సునీత . వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ లంగా వోణి లో అద్భుతంగా డ్రెస్సుప్ అయి ఉంటుంది సునీత .
సునితా ని అక్కడే ఆపి సునీల్ అడుగుతాడు
"నేను విన్నది నిజమేనా ....నీకు ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయింది అంట కదా ........నేను నమ్మలేదు అబద్ధం కదా........చెప్పు చెప్పు " అంటాడు
దానికి కాసేపు ఆలోచించి సునీత "కాదు నిజమే" అంటుంది
దానికి సునీల్ "మరి నా సంగతి ఏంటి ?" అంటాడు
"నీ సంగతి ఏమి ఉంటుంది ...నువ్వు నాకు చాల బెస్ట్ ఫ్రెండ్ వి కదా " అంటుంది సునీత
సునీల్ కి ఎక్కడ లేని ఉక్రోషం వస్తుంది . తట్టుకోలేక సునీతా నీ మెడ మీద రెండు చేతులు తో నొక్కి దాదాపు పీక పిసికేటంత అంత పని చేస్తాడు
"అయితే ఇన్ని రోజులు మనిద్దరం కలిసి తిరిగింది ఏం చేసింది అంతా జస్ట్ ఫ్రెండ్ షిప్ అంటావా...ముద్దు పెట్టుకోవడం.. నైట్ స్పెండ్ చేయడం ఇవన్నీ ఫ్రెండ్ షిప్..లా... అలా ప్రవర్తిస్తారా " అని అడుగుతాడు
సునీత విననట్టుగా "లేదు " అని చెప్పి ఇలా అంది
"సరే చెబుతా విను ........బీ ప్రాక్టికల్........ నీకు నువ్వు పెద్ద ఫుట్బాల్ ప్లేయర్ అని నేను నిన్ను ఇష్టపడ్డాను నిజమే కానీ ........ఆలోచిస్తే నీకు ఇప్పుడు జాబ్ లేదు పెద్ద ఫుట్బాల్ టీమ్ కి సెలెక్ట్ అయ్యావా అది ఇంకా ........లేదా పోనీ వెయిట్ చేద్దామనుకుంటే నాకు అంత టైం లేదు నేను ప్రాక్టికల్గా ఆలోచించే మనిషిని అని నీకు బాగా తెలుసు ........నాకు ఒక సంబంధం వచ్చింది అబ్బాయి USA లో లక్షలు లక్షలు సంపాయించే జాబ్ చేస్తున్నాడు నన్ను బాగా చూసుకుంటాడు నా లైఫ్ సెటిల్ అవ్వాలంటే జస్ట్ ఒక్క సెకండ్ .... నేను జస్ట్ ఎస్ ఆర్ నో చెప్తే సరిపోతుంది.... ఆ ఒక ఎస్ తో లైఫ్ సెటిల్ చేసుకుని ఛాన్స్ ఒకవైపు .... నీ లైఫ్ ఇంకా సెటిల్ కావటానికి ఎంత కాలం పడుతుందో తెలియకుండా వెయిట్ చేయడం ఇంకోవైపు ... ఆలోచించాను ........ఎస్ చెప్పడమే కరెక్ట్ అనిపించింది నాకు ఉన్నది ఒకటే ఒక్క లైఫ్ ........ఇంకో లైఫ్ ఉంటుందో లేదో కూడా తెలియదు ఒకే ఒకసారి ఈ ఆప్పొర్చునిటీ (అవకాశం) వదులుకోవడానికి నేను తెలివి తక్కువ దానిని కాదు ........ ఇంకా వెయిట్ చెయ్యడం అనవసరం అని చెప్పి నేను అబ్బాయికి ఎస్ చెప్పాను
సునీల్ లెట్ అస్ సపోజ్ నీకు ఒక జాబ్ వస్తుంది అనుకుందాం ఒక 3 or 4 ఇయర్స్ అయ్యాక ... మళ్ళి అప్పుడు ఒక ఫ్లాట్ కొనుక్కుని దానికి ఇన్స్టల్మెంట్ కట్టుకుంటూ పిల్లల్ని కని వాళ్ళని పెంచి .. ఇదంతా నాతో కాదు... నువ్వు నా టైపు కాదు సునీల్ అనవసరంగా ఎక్కువ అలోచించి ని టైం వేస్ట్ చేసుకోకు నీ ప్రాక్టీస్ కి లేట్ అవుతుంది వెళ్లి పడుకో త్వరగా " అంది
సునీల్ సునీత ని అక్కడ అక్కడే వదిలేసి "సరే నీ లైఫ్ నువ్వు చూసుకో నీ లైఫ్ లో నేను ఇంకెప్పుడు రాను" అని చెప్పేసి వెళ్ళిపోయాడు
సునీల్ కి ఇది పెద్ద షాక్... తెరుకోటానికి చాలా టైం ఏ పట్టింది...
-------------------
ఏప్పుడు బార్ లో నే గడుపుతున్నాడు... ఫ్రెండ్స్ చెప్పినా వినలేదు...
ఒక రోజు వాళ్ళ ప్రిన్సిపాల్ అదే బార్ లో కలిసాడు..
"ఏంటి సునీల్ ఇలా అయిపోయావ్ కాలెజ్ తర్వాత పెద్ద క్లబ్ కి ఆడతావ్ అనుకున్నా .."
ఆ మాటలకి సునీల్ చలించిపోయి తన కథ అంతా చెప్పుకొచ్చాడు ...
అతను చెప్పిన దానికి ప్రిన్సిపాల్ చెలయించిపోయాడు .
"చూడు సునీల్ నీ కోపం అంతా ఫుట్బాల్ మీద చూపించు... తంతే బాల్ వెళ్లి గోల్ లో పడాలి ..... ఆ సునీత కాదు ఇంకా ఎవరైనా సరే నిన్ను ఎందుకు మిస్ అయ్యానా అని బాధ పడేలా ఆడు .. నీ సెలెక్షన్స్ నేను చూస్కుంటాను .".. అని చెప్పాడు...
అప్పటి నుంచి సునీల్ మళ్ళీ ఫూట్ బాల్ సాధన కటొరంగా మొదలు పెట్టాడు...
పగలు రాత్రి ఏకం చేసి సాధన చేశాడు.
******** ********
అనుకోకుండా ఒక రోజు మార్నింగ్ సునీల్ గ్రౌండ్ లో ప్రాక్టీస్ చేస్తుకుంటుండగా ఒక కాల్ వస్తుంది . ఆ కాల్ విన్నాక ...
------------------------------------------------------
ఆ కాల్ విన్నాక సునీల్ ఒక్కసారిగా ఎగిరి గంతేశాడు ..
అక్కడి నుండి వెంటనే బైక్ తీసుకొని వెళ్ళి సునీత ఇంటి ముందు ఆగాడు ..
అక్కడ తన బైక్ హార్న్ మొగిస్తూనే ఉన్నాడు .
ఎవరబ్బ పొద్దున్నే మా ఇంటి ముంది గోల అనుకుంటూ సునీత బయటికి వచ్చింది
"సునీల్ మళ్ళీ ఏంటి నువ్విక్కడ " అంది సునీత
సునీల్ ఆ అమ్మాయికి ఒక ఎంవోలోప్ ఇచ్చాడు .
"ఏంటి మళ్ళీ ఇంకో లవ్ లెటర్ ఆ .. నేను చెప్పా కదా మనకి ఇంకా సెట్ కాదు అని "
"ముందు ఆ కవర్ ఓపెన్ చేసి చూడు "అన్నాడు సునీల్
ఆ కవర్ ఓపెన్ చేసి చూస్తే ఆశ్చర్యం .. సునీల్ కి ఒక యుకె ఫూట్ బాల్ క్లబ్ నుంచి ..
మూడు కోట్ల ఇయర్ లీ సేలరీ తో ఒక అవకాశం ఇస్తున్నట్టు గా అందులో రాసి ఉంది
సునీత సునీల్ వైపు కోపంగా చూసింది
సునీల్ అన్నాడు
"భయ పడకు ఇది చూపించి నిన్ను ఫోర్స్ చేయాలనుకోవట్లేదు ..
కేవలం థాంక్స్ చెప్పటానికి నేను వచ్చాను .. ఆ రోజు నువ్వు నన్ను రిజెక్ట్ చేయక పోయి ఉంటే
నేను నువ్వు చెప్పినట్టు ఆవెరేజ్ జాబ్ చేస్తూ ఉండేవాడినేమో .. ఇప్పుడు నేనెంతో నేను నిరూపించుకున్నాను
కాదు నిరూపించుకునేలాగా చేశావ్ .. థాంక్స్ సొ మచ్ "
అని చెప్పి అక్కడి నుంచి బైక్ స్టార్ట్ చేసి వెళ్ళి పోయాడు
నిర్ఘాంత పోయి చూడటం సునీత వంతు అయింది ..
-- సమాప్తం --
No comments:
Post a Comment