నమ్మకం... కథ..
================
2mar22
ఒకసారి నేను పూణే వెళ్లి జాబ్ చేయాల్సివచ్చింది ల్.
ముందు నేను వెళ్లి జాబ్ జాయిన్ అయ్యాను. కంపెనీ వాళ్లే 10 డేస్ ఫ్రీ అకౌమోడీషన్ (వసతి ) ఇచ్చారు.. ఆ పది రోజుల్లో మనం హాస్టల్ కానీ ఫ్లాట్ కానీ వెతుక్కోవాలి.
సరే జాబ్ లో కలిసిన అక్కడ కొలీగ్స్ ఏమైనా హెల్ప్ చేస్తారేమో అని కొద్దీ రోజులు చూసా... ఆహా.. ఎవరి ఫ్యామిలీ తో వాళ్ళు బిజీ... మరీ ఇల్లు ఎలా వెతకాలి...
పొద్దున ఆఫీస్ కీ వెళ్తే సాయంత్రం వస్తాం మరీ చీకట్లో ఎక్కడ ఎంత దూరం అని నడిచి వెళ్లి చూస్తాం. అప్పటికి ఒక రోజు ఒక ఆటో వాడ్ని హైర్ చేసి...ఒక రోజు ఇళ్ళు చూసా... కానీ మనం ఆగిన చోట అల్లా ఆటోవాడు వెయిటింగ్ చేయలేడు కదా సో అది కూడా 6కుదరలేదు ... ఒక బైక్ ఉంటే మన పని సులువు అవుతుంది అనుకున్నాను
ఆ వీకెండ్ హైదరాబాద్ ఇంటికి వచ్చి బైక్ ని వాల్వో బస్సు కింద పార్సెల్ చేసే లాగా అరెంజ్ చేసాను.. ఆ బస్సు లో బైక్ పెట్టేటప్పుడు ఫైర్ ఆక్సిడెంట్ అవ్వకుండా బైక్ లోంచి పెట్రోల్ మొత్తం తీసేయాలి.
మొత్తానికి బైక్ ఉన్న బస్సు ని రాత్రి లగేజ్ తో బస్సు ఎక్కాను. పొద్దున్న నా లగ్గేజ్ తో పాటు బైక్ కూడా దింపేసి బస్సు వాడు వెళ్పోయాడు.
అక్కడ నుంచి చూడాలి నా తిప్పలు. బస్సులో ఇంటికి వెల్దామంటే బైయి ఎక్కడ పెట్టాలిపోనీ బైక్ తెస్కెల్దామంటే పెట్రోల్ లేదు. ఆలోచిస్తూ కాసేపు గడిచింది ..సరే ఎలాగో అలా ఈ బైక్ లో పెట్రోల్ పోస్కొని దానిమీదే రూమ్ కీ వెళ్దాం అని డిసైడ్ అయ్యాను
ఈ పూణే మనకు కొత్త పెట్రోల్ ఎలా తేవాలి నేను వెళ్తే బైక్ ఇక్కడ ఉంటుందో పోతుందో అని ఆలోచన . సరే అని లాస్ట్ కీ ఒక ఆటో ఆపాను... అందులో ఒక ముసలాయన డ్రైవింగ్ చేస్తున్నాడు... హిందీ లో అడిగా " నాకు పెటోలు ఒక లీటర్ లేవాలి తెచ్చిస్తావా " అని ఆయన కాసేపు అలోచించి
"సరే 100 ఇవ్వండి తెచ్చిస్తా " అన్నాడు
ఇచ్చాను... వెళ్ళాడు
ఇతడు రిటర్న్ వస్తాడా మనసులో భయం ఆందోళన .. ఏంటో వంద రిస్క్ చేశా అనిపించింది..
వెళ్ళినాయనా 10 మిస్ అయన రాలేదు
20 mins రాలేదు
30 mins అయినా రాలేదు
నాకు కాస్త వర్రీ మొదలయింది వెళ్లిన అతని ఫోన్ నెంబర్ తీస్కో వాల్సింది అని అపుడు గుర్తొచ్చింది..
అపుడు అతను కాస్త దూరం నించి వస్తూ కనిపించాడు...
ఏంటి మీకు ఇంత లేట్ అయింది అంటే..
"సాబ్...దగ్గర్లో పెట్రోల్ బంక్ ఓపెన్ కాలేదు సాబ్ .. అందుకే కాస్త దూరం వెళ్లి బాటిల్ లో పాయించాను సార్ ఇదిగో బాటిల్... ఇదిగో చిల్లర... ఇంకా 20 rs తిరిగి ఇచ్చాడు..."
కాస్త లో ఎంత అనుమానించాను... ఇతను కనీసం సర్వీస్ ఛార్జ్ కూడా తీసుకోలేదేంటి...
అనుకున్నాను...
"సరే ఆ 20 rs నా దగ్గరే ఉంచుకో "అన్నాను
" లేదు వద్దులే సాబ్... హెల్ప్ చేసినందుకు పైసలు తీసుకోను...మా దగ్గర ఆస్తి తక్కువే కానీ మనసు పెద్దది సాబ్... వస్తాను థాంక్ యూ "అన్నాడు
ఎంత గొప్ప మాట చెప్పాడు...
మా దగ్గర డబ్బు ఉంటుంది కానీ ఇచ్చే మనసు ఉండదు...
ఒకరికీ ఏదయినా చేయాలంటే బదులు ఆశిస్తాము..
ఇతను ఎంత మంచి వాడు కాదు గొప్పవాడు...
అనుకున్నాను పెట్రోల్ బాటిల్ నుంచి బైక్ లో పోస్తూ..
నేను కనీసం ఒక్క నాదైన ఇతనిలాగా ఉండగలనా అనిపించింది
--- సమాప్తం ---
No comments:
Post a Comment