Tuesday, March 31, 2026

38 ) సంయుక్త కథ ** samyuktha katha

******************

*** సంయుక్త కథ ***

******************


రమేష్ విదేశాల్లోబాగాడబ్బుసంపాయించి చాల కాలం తరువాత ఇపుడే హైదరాబాద్ లో లాండ్ అయ్యాడు 


సిటీ లోకి వస్తూనే బస్ స్టాండ్ లో తన పాత ఫ్రెండ్ "సంయు (సంయుక్త)" కనపడగనే కార్ యూట్యూర్న్ తీసుకోమని చెప్పి అటువైపు నుంచి సంయుని దగ్గరగా చూసాడు 


పలకరించాలని అనుకున్నాడు ..కానీ ఆగిపోయాడు.. 

  తన మెడలో మంగళసూత్రం ఉంది కానీ మొహంలో ఇంతకుముందు చూసినంత మెరుపు లేదు కళావిహీనంగా ఉంది


" సంయు కి పెళ్లి అయినట్టుంది మరోసారి కలవచ్చు లే " అని అనుకోని కారు ఇంటికి పోనివ్వమని అన్నాడు 


తన సెక్రెక్టరీ ( హనుమంతు) ని సంయు ఇప్పుడు ఏం చేస్తుందో ఎక్కడ ఉంటుందో ఆ డీటెయిల్స్ అన్ని కనుక్కో మని చెప్పాడు రమేష్.


హనుమంతు బాగా ఎంక్వైరీ చేసి తన బాస్ రమేష్ కి సమ్యూ గురించి చెప్పాడు 

...

"సార్ ఇంక్వైరి సంయుక్త మేడం గురించి చేసాను.... మేడం ఇప్పుడు కొన్ని ఆర్థిక సమస్యల లో ఉంది ... సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తున్న తన భర్త కి ఈమద్యే జాబ్ పోయిందని... ఇంటికోసం కార్ కోసం చేసిన అప్పులు కట్టుకోలేక ఇబ్బంది పడుతున్నాడు ... , . అంతకముందు సంయుక్త వాళ్ల నాన్నగారు అంతో ఇంతో హెల్ప్ చేసేవారట.. కానీ అయన కూడా ఈ మధ్య కాలం చేశారట... మరి సమ్యూ తను ఏదైనా ఉద్యోగం చేస్తాను అంటే వద్దంటాడు వాళ్ళ అయన... "అని రమేష్ కి చెప్పాడు 


సంయుకి వాళ్ళ ఫ్యామిలీ కి ఏదయినా సహాయం చేయాలనీ మనసులో అనుకున్నాడు రమేష్


  బాగా ఆలోచించాక రమేష్ సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్ లో ఓనర్ అయినా తన ఫ్రెండ్ కి కాల్ చేసి అతనికి "సంయు " భర్త కి కాల్ చేసి ఇలా చెప్పమని చెప్పాడు 


" హలో సర్ .... మాకు వచ్చిన ఎంక్వవరీస్ అన్నిటిని ప్రతినెలా డ్రా తీస్తాము సార్.....ఈ నెల .... మీ నెంబర్ లక్ డ్రా పిక్ అయింది ... మీరు కనుక మా ఇన్స్టిట్యూట్లో ఈ కోర్స్ జాయిన్ అయ్యి కంప్లీట్ చేస్తే ... ప్లేసెమెంట్ కూడా అరేంజ్ చేస్తాము ... కాకపోతే ఒక ఓబీలిగాషన్...మీ ఫోటో నీ ప్లేస్మెంట్ లిస్టులో వాడుకుంటాం.. అలా మీకు ఓకే అంటే చెప్పండి క్లాస్ స్టార్ట్ చేస్తాము " అని కాల్ చేయమని చెప్తాడు రమేష్ 


ఆ ప్రపోజల్ కి సంయుక్త భర్త ఒప్పుకుని సాఫ్ట్వేర్ కోర్స్ చేసి ఉద్యోగం కూడా తెచ్చుకున్నాడు.. అలా సంయుక్త భర్తకి 

2 నెలలు లోనే మంచీ ఉద్యోగం వచ్చేలా చేశాడు


    ఆ తరువాత ఒక రోజు సంయుక్త వాళ్ళ కాలనీ వైపు వెళ్ళాడు. అనుకోకుండా సంయుక్త ని సూపర్ మార్కెట్ దగ్గర చూసి పక్కకి వెళ్లి దాక్కొని సంయుక్త మొహం వంక చూశాడు రమేష్ .... సంయు మొహం ఇపుడు కాస్త ఆనందంగా కనిపిస్తుంది .... సూపర్ మార్కెట్ లో సంయుక్త వాళ్ళ పక్క ఫ్లాట్ ఆంటీ తో మాట్లాడుతుండటం గమనించాడు .... 


"తిరుపతి వెళ్ళాలి ఆంటీ ...దేవుడి దయవల్ల ఆయనకి ఈమద్యే మంచి జాబ్ వచ్చింది .... నాకు కూడా ఏదైన జాబ్ ఉండుంటే ... ఇలా కష్ట కాలంలో దిగులు ఉండకుండా ఉండేది " అనటం విన్నాడు


అవునా సమ్యూ జాబ్ చేయాలని అనుకుంటుందా అని తెలుసుకున్నాడు రమేష్ కానీ సమ్యూ అంత టాలెంట్ పెట్టుకొని జాబ్ కాకుండా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసేలా చేస్తే ఎప్పుడూ హ్యాపీ గా ఉంటుంది కదా అనుకున్నాడు ... 


తనకు బాగా గుర్తు కాలేజీ లో ఉన్నపుడు రక రకాల వంటలు చేసి అందరికీ తినిపించేది సంయు ...

 "మీ అమ్మ చేసారా" అంటే 

"కాదు నేనే చేశాను" అని గర్వాంగా చెప్పేది ... ...తన వంటల మీద ఏదైనా కామెంట్ చెస్తే ..చాల సార్లు వాదం కూడా పెట్టుకునేది. 


రమేష్ కు ఒక ఆలోచన వచ్చింది అంత బాగా వంటలు చేసే సంయు వంటయింటి కి ఎందుకు పరిమితం కావాలి ...తన వంట రుచి పదిమంది చుస్తే అందరికీ తప్పకుండా నచ్చుతుంది ....అనుకున్నాడు ..


ఎలాగో అలా సంయు వాళ్ళ పక్క ఫ్లాట్ ఆంటీతో పరిచయం పెంచుకున్నాడు రమేష్ .


మాటల సందర్భం లో తాను సంయుక్త కోలేజి ఫ్రెండ్ ని అని తనకు సహాయం చేయాలనీ అనుకుంటున్నా అని చెప్పాడు .... ఆలా చేయటానికి మీ సహాయం కొంత కావాలి .....అని అంటే ...దానికి ఆ ఆంటీ ....


"తప్పకుండ బాబు ...ఒకరికి సహాయం చేయాలనే మంచి పనికి నేను ఎపుడు రెడీ .....నన్ను ఎం చేయమంటావో చెప్పు " అని అంది ...


 రమేష్ వివరించాడు ....

."మీరు ఒక రోజు సంయు ఇంట్లో కాస్త పచ్చడి కోసం వెళ్ళండి ఆంటీ.. భోజనం చేసాక మళ్ళి వెళ్లి .... పచ్చడి చాల బాగా చేసావ్ అమ్మ ..సంయుక్త ....నువ్వే పెట్టావా ఈ పచ్చడి . నీకు ఇంత బాగా పచ్చడి పెట్టడం వస్తుంది అనుకోలేదమ్మా. ..నీకు కుదిరితే .... మాకు కూడా ఒక కేజీ పెట్టగలవా అని అడగండి..ఆ తరువాత మీ అపార్ట్మెంట్ ఇంకా తెలిసిన వాళ్ళకి కూడా చేసిపెట్టేలా చేసి.. తనని బిజీ చేసేస్తే.. తన ఇష్టమైన చేస్తూనే నలుగురికి ఉపయోగం పడ్తుంది కదా ." అన్నాడు 


అలా ..ఆ తరువాత తరువాత వాళ్ళ అపార్ట్మెంట్ మొత్తం తన దగ్గ్గరే పచ్చళ్ళు , ఇంకా స్వీట్స్ చేయించుకునేలా ... చేశాడు ...


ఒక రోజు ఆ ఆంటీ ఇంత బాగా పెడ్తున్నావ్ నువే ఒక ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయచ్చుకదా నీకు టైంపాస్ అవుతుంది ....ఇంకో నలుగురు నీ వల్ల బ్రతుకుతారు అని సలహా ఇచ్చింది..


ఈ ఆలోచన ఏదో బాగుంది అని సంయు తన భర్త అనుమతి తీసుకొని ఒక స్వగృహ స్వీట్స్ అండ్ పచ్చడ్లు షాప్ స్టార్ట్ చేసింది ..... ఆనతి కాలం లోనే ఆ మంచి పేరు వచ్చింది ఆ స్వీట్జ్ హౌస్ కి .. అలా అయ్యేలా చేశాడు..రమేష్ 


ఒక రోజు గుడికి వెళ్తే అక్కడ అ అనుకోకుండా రమేష్ కి సమ్యూ ఎదురు వచ్చింది..

.. తనని గుర్తు పట్టి రాయిలాగా ఉండి పోయింది....


రమేష్ ని చూసి ఒక్కసారి తన ఫ్లాష్ బ్యాక్ మెమరీస్ లోకి వెళ్లి పోయింది 


అది విజయవాడ .... రమేష్ సమ్యూక్తా ఓకే కాలేజ్ లో చదివేవారు ..రమేష్ కి సంయు తో చాల చనువు స్నేహం కూడా ... ఎంత అంటే వాళ్ళ ఇంటికి కూడా తీసుకెళ్లేది ...


కానీ ఒక రోజు సంయు లేని టైములో వాళ్ళ ఇంటికి వెళితే... వాళ్ళ నాన్న తనని చూసి 


 "ఏం బాబు నువ్వు మా అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ వా ఏంటి ఎప్పుడూ తనతో ఏం పని నీకు స్టడీ ఐపోయింది కదా... ఇక ఏదైనా ఉద్యోగం వెతుక్కోవచ్చు కదా... ఇంకోసారి ఇటు వేపు కనిపించకు" అంటూ అవమానకరంగా మాట్లాడే సరికి ..సంయుక్త కి చెప్పకుండా.. తమ స్నేహానికి గుడ్ బై చేప్పి ఉద్యోగ ప్రయత్నాల్లో పడ్డాడు 


ఆ తరువాత కాస్త చిన్న జాబ్ లో సెటిల్ అయ్యాక సంయు గుర్తు వచ్చిమళ్ళీ కలిసే ప్రయత్నం చేశాడు 


కానీ అప్పటికే సంయు వాళ్ళు వెరే వూరు వెళ్లారు అని తెలుసుకొని బాధపడ్డాడు ఇక తను ఈ దేశంలో ఉండి ఏం చేయాలని ప్రమోషన్ తో పాటు విదేశాలకు వెళ్లారు ..


రమేష్ విదేశాల్లో ఉండగానే..సంయుక్త కి వివాహం అయిపొయింది..


..... 


గతం లో నుంచి వచ్చి మళ్ళీ కళ్ళముందు ఉన్న రమేష్ ను చూస్తోంది సంయుక్త 


అలా అపుడు దూరమైన రమేష్ మళ్ళీ ఇవాళ కనిపించాడు అని సంయు మనసు పులకరించింది 


"హాయ్ రమేష్ ఎలా ఉన్నావ్"

"నువ్వు ఎలా ఉన్నావు సంయు ?"


"నేను ఇపుడు చాలా బాగున్నాను .... నాలుగు నెలల ముందు నన్ను కలవాల్సి ఉంది నువ్వు ... నేను నేనులా లేను చాలా ప్రాబ్లమ్స్... సడన్ గా ఆ దేవుడికి నా మీద చాల జాలి కలిగినట్టు ఉంది వన్ ఇయర్ లో మొత్తం ప్రాబ్లమ్స్ ఎన్ని పరిష్కారం అయిపోయినాయి ..ఈ గుడిలో దేవుడు చాలా మహిమ కల వాడు... నేను ఈ గుడికి వచ్చి ఎం కోరుకుంటే అది జరుగుతోంది ... నువ్వు కూడా ఏమైనా కోరుకో తప్పకుండా జరుగుతుంది"


" అవునా ఇంతకీ ఇపుడు ఎం కోరుకున్నావ్ ఏంటి ....?"


" ఇప్పుడా ...ఇంకా ఏo కోరికలు ... ఏమి లేవు బాబు... జస్ట్ దేవుడికి థాంక్స్ చెప్పుకుని వెళ్దాం అని వచ్చా ... మేము ఇపుడు చాల సంతోషంగా ఉన్నాను.... అస్సలు ఇంతకీ ఏం ప్రాబ్లమ్స్ అని అడగవా ... " 


"అన్ని దారిలో చెపుదువులే కానీ ... ముందు కారులో కూర్చో... నేను నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా ... నువ్ కాదనద్దు ప్లీజ్ ... " 


" అందులో కాదనడానికి ఏముంది ... అయినా డ్రాప్ చేయటం ఏంటి ... ముందు నువ్ మా ఇంటికి పద ... నీతో చాల మాట్లాడాలి ఏమయిపోయావ్ ఇన్ని రోజులు ... నిన్ను మా హస్బెండ్ కి పరిచయం చేయాలి ... నువ్ మా ఇంట్లో భోజనం చేయాలి... మా బిజినెస్ నీకు చూపించాలి ఇంకా చాల ఉన్నాయ్ పద ... " అంది సంయు


ఇద్దరు గుడి మెట్లు దిగి రమేష్ కార్ ఎక్కారు .. ... కార్ మెల్లిగా వెళ్తోంది ...


"హ్మ్మ్ ... ఇపుడు చెప్పు సంయు ...ఎం జరిగింది ?" ( ఎటు నాకు తెలుసు కదా )


" ఎం జరిగిందంటే .... ... " ( అని జరిగిన విషయాలన్నీ ఒక్కొక్కటే చెప్పుకుంటూ వచ్చింది )


.." హే ఇక్కడ ఆపు కార్ ఇక్కడ ఆపు... కారు ....దిగు ఇలా రా" అని వాళ్ళ స్వీట్ షాప్ ముందు కార్ ఆపమని చెపింది సంయుక్త . 

.. తన బిసినెస్ అంతా హ్యాపీగా చూపించింది.


తరువాత ... సంయు ఇంటికి తీసుకుని వెళ్ళింది .రమేష్ ని తన హస్బెండ్ కి పరిచయం చేసింది 

వాళ్ల కాలేజీ నుంచి వాళ్లకున్న అనుబంధం గురించి చెప్పింది. 

సంయు గ్రాండ్ గా భోజనం చేసింది 

తను గుడి నుంచి ఇంటికి వెళ్లే లోపు అంత గ్రాండ్ గా అరేంజ్ చేయమని ఫోన్ లో ఎప్పుడు వాళ్ళ పని వాళ్ళతో చెప్పిందో అర్థం కాలేదు రమేష్ కి 

లంచ్ మెనూ అదిరిపోయింది


భోజనం చేస్తున్నంతసేపు రమేష్"సమ్యూ" కళ్ళలో ఒక మెరుపు చూశాడు ఈ మెరుపు కదా నిన్ను చూడాలని అనుకున్నది .


..ఒక హప్పినెస్ చూశాడు ... తాను కాలేజీ లో ఉన్నపుడు ఎంత చాలకిగా ఉండేదో అంతే చలాకీగా ఉంది .. ఇంకా ఇది చాలు నాకు ...నేను మళ్ళి USA తిరిగి వెళ్లిపోవచ్చు అనుకున్నాడు తన సెక్రటరీని ఫ్లైట్ టికెట్ బుక్ చేయమని చెప్పాడు


******* అది కథ *******


 "అవతలి వారికి ఆనందం అందిచటమే నిజమైన ప్రేమ..

మన అమ్మ నాన్న నీకు ఏదయినా కొనిచ్చి నీ మొహం లో ఆనందాన్ని చూసి

 వాళ్ళు ఎలా ఆనంద పడతారో.. 

నువ్వు ఇష్టపడ్డ వాళ్ళకి కుడా ఆనందాన్ని పంచుతున్నపుడు అంతే ఆనంద pondutavu 


అన్ని ప్రేమలు అంతే కేవలం బాహ్యమే కానక్కరలేదు 

మానసికంగా కూడా ప్రేమించవచ్చు.. "


***********************

Writer : Harish Babu (9902015746)


#harishsworld

Wednesday, December 10, 2025

story 36) హోమ్ టూర్... కథ

 హోమ్ టూర్... కథ

------
చదివింది బీటెక్ అయినా గవర్నమెంట్ జాబ్ వచ్చినందుకు చాలా సంతోషించాడు సతీష్
గవర్నమెంట్ జాబ్ కానీ నెలలో పదిహేను రోజులు టూర్స్ వెళ్లాల్సి వచ్చేది.

అలాగే ఒకసారి బెంగళూరు వెళ్లి పదిహేను రోజుల తర్వాత బాగా అలసిపోయి ఇంటికి వచ్చాడు
కాలింగ్ బెల్ రింగ్ అవటం తో డోర్ తీసి దిష్టిబొమ్మలా నుంచుంది భార్య సీత

'ఏంటి సీతామహాలక్ష్మి..... లోపలికి రానివ్వవా ఏంటి అడ్డంగా నుంచుని ఉన్నావు? " అంటూ చిరాగ్గా భార్యని తప్పుకోమని లోపలికి నడిచాడు సతీష్

అలిసిపోయిన సతీష్ అటు ఇటు చూడకుండా లగేజ్ బాగ్ ఆమె చేతికి ఇచ్చి డైరెక్టుగా బాత్రూంలోకి వెళ్లి ఫ్రెష్ అయ్యి హాల్ లోకి వచ్చాడు

ఇంటిని చూసి దిమ్మ తిరిగింది. ఇది మా ఇల్లా కాదా అన్నట్టు చూస్తూ ఉండి పోయాడు...లోపలికి వచ్చినప్పుడు గమనించలేదు ఇల్లంతా బోసిగా ఉంది ఏదో ఇంట్లో సామానంతా అమ్మి ఇల్లు ఖాళీ చేస్తున్నట్టుగా

"ఏంటి సీతా ఇంట్లో సామానంతా ఏమైంది" అడిగాడు సతీష్
ఇన్కమ్ టాక్స్ వాళ్ళు వచ్చి రైడ్ చేసి మొత్తం పట్టుకెళ్లారండి

"ఏంటే నువ్ చెప్పేది...ఇన్కమ్ టాక్స్ వాళ్ళు ఎందుకు వచ్చారు"

అది...అది.. అని..నసుగుతున్న భార్య ను

"త్వరగా చెప్పవే హార్ట్ ఎటాక్ వచ్చేలా ఉంది ...." అన్నాడు సతీష్

"ఏం లేదండి మీరు వెళ్ళాక నాకు టైం పాస్ కాక కొత్తగా స్టార్ట్ చేసిన యూట్యూబ్ ఛానల్ లో....

అందులో 'హోమ్ టూర్'.. అని ఒక వీడియో పెట్టి మన ఇంట్లో ఉన్న ఇంటీరియర్స్, ఎక్స్టీరియర్స్ అన్ని కలిపి ఒక వీడియో చేసి అప్లోడ్ చేశాను అది చాలా వైరల్ అయింది....

కానీ రెండు రోజుల్లోనే ఐటీ వాళ్ళు రైడ్ చేసారు ....వాళ్ళు ఉన్న వస్తువులన్నీ వాల్యుయేషన్ చేసి....
మీ భర్త శాలరీ తో కంపేర్ చేస్తే...ఇవి చాలా ఎక్కువ వాటికీ బిల్స్ చూపించి మళ్ళీ తీసుకెళ్లండి అని పట్టుకెళ్ళి పోయారండి" అని చెప్పింది

దానికి కంగుతిన్న సతీష్

" నీకు మైండ్ ఏమయినా పోయిందా .. నీకేమన్న బుద్ధి ఉందా ... హోమ్ టూర్ చేయడానికి మన ఇంట్లో ఏ వస్తువు అయినా వైట్ మనీ తో కొన్న వస్తువులను అనుకున్నావా..."

ఇవన్నీ బ్లాక్ మనీ. ఎక్కడ పెట్టాలో అర్థం కాక... ఈ ఖరీదైన ఐటమ్స్ కొని పెట్టాను.. నీ మైండ్ కి అది కూడా తెలియదు అనమాట.. నా కర్మ ...మొత్తానికి 4 రోజుల్లో నా సంపద మొత్తం మట్టిలో కలిపేశావ్ కదే " అంటూ తల బాదు కున్నాడు సతీష్ .. సోఫా లేదు కదా నేల మీదే కుల బడ్డాడు

"అదేంటండి మీరు ఎపుడు అడిగినా ...నా సంపాదన నా సంపాదన అనేవారు కదా..." అంటూ బుగ్గన వేలు వేసుకొని కళ్ళు మీటకరిస్తూ అడుగుతున్న భార్య వైపు బాధ గా చూసాడు సతీషు....

-- సమాప్తం ---


------------------------------------

story 35 ) పల్లి బఠాణి ... చిన్న కథ

 పల్లి బఠాణి ... చిన్న కథ

*†********************
ఆ రోజు పని విపరీతంగా ఉంది... ప్రొద్దున 9 కీ మొదలు పెడితే రాత్రి 10 కీ ఇంటికి బయలు దేరాను...
పార్కింగ్ లాట్ లోకీ వెళ్లి ... లాప్టాప్ బ్యాగ్ వీపు కీ తగిలించికుని... చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని...నా బైక్ స్టార్ట్ చేసాను
బాగా టైర్డ్ గా ఉన్నాను... బైక్ నడపాలంటే వొళ్ల్లు సహకరించటం లేదు... అయినా తప్పదు కదా మెల్లిగా పోనిస్తున్నాను...
మా ఆఫీస్ కీ ఇంటికి మధ్య ఒకటిన్నర గంటల ప్రయాణం చేయాలి...
కళ్ళు భారంగా తెరుచుకుంటున్నాయి... మూసుకుంటున్నాయి.... ఒక అరగంట నడిపించాను... ఇంకా నా వల్ల కావటం లేదు..
కొంత దూరం వెళ్ళాక అక్కడ కొన్ని షాప్స్ మార్కెట్ అవి ఉంటే ...బండి రోడ్ పక్కకి ఆపాను... హెల్మెట్ తీసి పెట్రోల్ ట్యాంక్ పైన పెట్టి... హెల్మెట్ మీదే తల పెట్టి కళ్ళు ముసాను... కాస్త రిలాక్స్ అవుదామని...
అంత ట్రాఫిక్ లోను బాగా అలిసిపోయి నాయి ఏమో కళ్ళు పది నిముషాలు నిద్రపోయాను... నా లాప్టాప్ బ్యాగ్..పర్సు... అన్ని మర్చిపోయింపచేసే నిద్ర అది...
పక్క నుండి ఎవరో తట్టినట్టు అనిపిస్తే లేచాను....పక్కనే ఒక పల్లీలు అమ్ముకునే ఒక సాయిబు నుంచున్నాడు... నేను ఏమైనా అతనికి దారికి అడ్డం ఉన్నానేమో అని చూసా... ఏమి లేదు...
ఏమిటి అని అడిగాను..
"బాగా అలిసిపోయినట్టు ఉన్నారు సార్.. ఈ పల్లీలు తినండి " అని ఒక పల్లీల పొట్లం చేతిలో పెట్టాడు..
ఓహో వీడి పల్లీలు సేల్ చేసుకోటానికి నన్ను లేపాడా అనుకున్నాను
వద్దు అన్నా వినకుండా చేతిలో పెట్టేసాడు
"తింటూ వెళ్ళండి సాబ్ నిద్ర రాదు" అని చెప్పాడు
సరే ఇదిగో అని ఐదు రూపాయలు ఇవ్వబోతే
"మానవత్వానికి డబ్బులు తీసుకోను సాబ్"
(Insaniyath ke paise nahi hote saab)
అని చెప్పి చీకట్లో బండి తోసుకుంటూ వెళ్ళిపోయాడు...
ఇలాంటి మంచిమనుషులు ఇంకా ఉన్నారా అని మనసులో అనుకున్నాను... రెండు పల్లీలు నోట్లోవేసుకొని బైక్ స్టార్ట్ చేసాను....
************ **********
9902015746

story 34 ) ఒక నవ్వు చాలు.. చిన్న కథ

 ఒక నవ్వు చాలు.. చిన్న కథ

=======================
ఒకసారి నేను మా అక్క ఇద్దరం ఒక చిన్న పనిమీద హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ట్రైన్ లో బయలుదేరాము....ఆ దారి చాలా పెద్దది కావటం చేత 36 గంటలు ప్రయాణం చేయాలి
రోజు శనివారం సాయంత్రం..తర్వాత రోజు పొద్దున ఆదివారం రాత్రి అయిపోయాక సోమవారం పొద్దుటి గాని ఢిల్లీకి చేరుకోము ఆ రోజు సాయంత్రం రాత్రి హడావిడిగా ట్రైన్ ఎక్కాము
మొత్తం ట్రైన్.ఖాళీగానే ఉంది ..ఢిల్లీ కి వెళ్తుంది కదా అందరూ జవాన్లు మిలటరీ వాళ్ళు వచ్చారు వాళ్ళ తోటి కూర్చున్నాం... రాత్రి పడుకున్నాం....పొద్దున లేచాము నిద్ర...మధ్య ప్రదేశ్ అనుకుంట ట్రైన్ అడవి మధ్యలోనుంచి అలా వెళుతుంది... ఎక్కువ దూరం వెళ్ళే వాళ్ళు లేరు అనుకుంటా ట్రైన్ ఖాళీగా వెళుతోంది.. అప్పుడప్పుడు మధ్యలో కొందరు ఎక్కుతున్నారు దిగుతున్నారుఉన్నారు.. మధ్యప్రదేశ్ లో బాగా వెనకబడిన ప్రాంతం కాబట్టి ఆ ఊళ్లో వాళ్లు అడవి ప్రాంతం వాళ్ళు ఎక్కుతున్నారు...మధ్య మధ్యలో మధ్య ప్రదేశ్ లోని అడవులు వాటర్ ఫాల్స్ కూడా కనిపిస్తున్నాయి ఎంజాయ్ చేస్తున్నామ్...
అయితే వీటన్నింటి కంటే మధ్యలో మాకు ఏకైక కాలక్షేపం మేము ఇద్దరం మాటలు చెప్పుకోవటమే ఎక్కడి నుంచి ఎక్కడి వరకో మాట్లాడుతూనే ఉన్నాం సినిమాలు టీవీలో సీరియల్స్ బుక్స్ న్యూస్ పేపర్స్ న్యూస్ టీవీ కాలేజ్ స్కూల్ టీచర్స్ ఫ్రెండ్స్ ఇట్లా మాట్లాడుతూనే ఉన్నాం
ఆ ట్రైన్ లో ఎవరూ మమ్మల్ని పట్టించికోవట్లేదు...అయితే మాతో అంతవరకు మా ఎదురుగా కూర్చున్న ఒక ముసలాయన మాత్రం వింతగా ప్రవర్తిస్తున్నాడు డు. అయన తన కూతురు తోటి ఆ ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నాడు. వ్యవసాయం చేస్తాడని కట్టుబాటు చూస్తే అర్ధమవుతోంది..తెల్ల షర్తు .. తెల్ల తలపగ.. చుట్ట.. వేసుకున్నాడు
మేము మాట్లాడుతున్నప్పుడు వింటున్నాడు నవ్వితే నవ్వుతున్నావు మాతోపాటు నవ్వుతున్నాడు సైలెంట్ గా ఉంటే సైలెంట్ గా ఉంటున్నాడు ఎవరు ఏంటో కనుక్కుందాం మా అనుకున్నాం కానీ మా కబుర్లు ఎంతవరకు అవ్వట్లేదు గా ఆయన వరకు ఎక్కడి అడిగేది
ఇంతలో ఆ ముసలాయన స్టేషన్ వచ్చినట్టుంది దిగటానికి లేచి తన బ్యాగ్ తీసుకున్నాడు... వెళ్ళబోయి వెన్నక్కి తిరిగి మా వైవు చూసి నవ్వి వస్తాను అన్నట్టుగా చేయి చూపించి తన భాషలో వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు
మాకు ఏమీ అర్థం కాలేదు నాతో పాటు ట్రావెల్ చేస్తూ తెలుగు వచ్చి తెలిసిన వాళ్లు కూడా ఏంటి లే వీళ్ళతో మాట్లాడేది అహంకారంగా కూర్చుంటే ఈ ముసలాయన ఎవరో కనీసం మాట మాత్రమైనా పలకరించక పోయినా మాతోపాటు ఉంటూ మా భాష రాక పోయిన మా హావ భావాలు అర్ధం చేస్కుని తను కూడా ఎంజాయ్ చేస్తున్నాడు
అప్పుడు అర్ధమైంది మనిషి మనిషి కలవటానికి బాష అవసరం లేదు స్వచ్ఛమైన ఒక నవ్వు చాలు అని.
ఒక చిరు నవ్వు భాష రాని వాడిని కూడా మనకీ దగ్గర చేస్తుంది - ఒక్క వెక్కిలి నవ్వు దగ్గర ఉన్న వాడిని కూడా దూరం చేస్తుంది అని...

story 33 ) పెళ్లి చూపులు... కథ

 story 33 ) పెళ్లి చూపులు... కథ

===============
విక్రాంత్ కీ చాలా సార్లు పెళ్లి చూపులు జరిగాయి కానీ వేరు వేరు కారణాల వాళ్ళ ఏ అమ్మాయి తోను పెళ్లి కుదరలేదు . ఒకసారి అమ్మాయి నచ్చక..లేదా కుటుంబం నచ్చక.... లేదా మాట్లాడే పద్దతి నచ్చక.. లేదా..వాళ్ళ పేరెంట్స్ ఆరోగ్య పరిస్థితి బాలేక....ఆర్థిక పరిస్థితి బాలేక... ఇలా చాలా కారణాలు వల్ల కుదరలేదు....
చివరికి చారుస్మిత(స్మిత ) తో ఇతనితో పెళ్ళికి సరే అంది.... రెండు కుటుంబాలు సంతోషంగా ఒక నెల లో పెళ్ళికి ముహూర్తం పెట్టుకున్నారు..
పెళ్ళికి ఎక్కువ గ్యాప్ లేదు. విక్రాంత్ స్మిత నెంబర్ తీస్కొని... ఫోన్ చేసి ఒకటి రెండు సార్లు మాట్లాడాడు... బాగా మాట్లాడింది అనిపించింది...
కానీ ఎక్కువ సార్లు ఫోన్ చేసే సాహసం చేయలేదు...
కారణం.....తను విన్న వేరు వేరు వార్తలు కథనాలు ... తన ఫ్రెండ్స్ కీ ఉన్న అనుభవాలు.. దృష్టిలో ఉంచుకోనీ... పెళ్లి నెలలో ఉంది అనగా గంటలు గంటలు ఫోన్లో లో ముచ్చటించటం... ఆ వాక్ ప్రవాహంలో ఎదో అనరాని మాట అనటం... పెళ్లికూతురు హర్ట్ అవటం... పెళ్లి రద్దు చేసుకోవటం... ఇలాంటి రిస్క్ విక్రాంత్ తీస్కోదల్చుకోలేదు...
ముహూర్తలు పెట్టుకున్న రెండు రోజుల తరువాత... స్మిత నుండి కాల్ వచ్చింది ..
"మా ఆఫీస్ కీ రావచ్చు కదా... మా ఫ్రెండ్స్ కీ నిన్ను పరిచయం చేయాలి అని.. "
విక్రాంత్ ఆలోచించాడు... "ఎందుకు లే..మన పెళ్లి దగ్గర్లోనే ఉంది కదా.. పెళ్లి లో కలవచ్చు... పెళ్లి అయ్యాక ఎన్ని సార్లు అయినా కలవచ్చు లే" అని నవ్వుతు చెప్పాడు....
అలా రెండు మూడు సార్లు తన ఇన్విటేషన్ మీ సున్నితంగా తిరస్కరించాడు....
ఇక్కడ స్మిత ఆలోచన లో పడింది... నేను రమ్మంటున్నా రావట్లేదు.. ఏదయినా ప్రాబ్లెమ్ మనిషేమో.. శాడిస్ట్ ఏమో... ఇలా తన ఫీలింగ్స్ అన్ని ఫ్రెండ్స్ తో డిస్కస్ చేయటం మొదలు పెట్టింది ... ఇదిగో పులి అంటే ... అదిగో తోక అని ఫ్రెండ్స్ కూడా తన బ్రెయిన్ బాగా వాష్ చేసారు...
విక్రాంత్ తన ఫీలింగ్స్ చెప్పలేక మదన పడుతున్నాడు ... మన మ్యారేజ్ ఏక్కడ కాన్సల్ అవుతుందో అనే భయం తో నిన్ను కలవట్లేదు అని చెప్పలేని పరిస్థితి...ఎక్కడ చీప్ అవుతానో అని
వారం రోజులు గాడిచాయి.. స్మిత బ్రెయిన్ బాగా వాష్ అయిపోయింది... డెసిషన్ కీ వచ్చేసింది..ఇతనితో . పెళ్లి వద్దులే అని చెప్పాలనుకుంది... కానీ ఎలా.. పెళ్లి డేట్ దగ్గర పడ్తోంది..
వన్ ఫైన్ మార్నింగ్.... విక్రాన్త్ కీ స్మిత నుండి ఫోన్ వచ్చింది..
" విక్రాంత్ నీకు ఒక విషయం చెప్పాలి..నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు... నువ్ ఎలాగో అలా ఈ పెళ్లి కాన్సల్ చేయి... " అని ఆ కాల్ సారాంశం..
తను ఎం జరగకూడదు అనుకున్నాడో... అదే జరిగింది.. విక్రాంత్ జవాబు ఇచ్చాడు..
" నాకు అదంతా తెలీదు... నువ్వే పెళ్ళికి సరే అని నువ్వే ఒప్పుకున్నావ్ గా...ఇపుడు కూడా నువ్వే ఇంట్లో చెప్పు... లేదంటే నేనే నిన్ను పెళ్లి చేసుకుంటా " అని ఫోన్ పెట్టేసాడు... ఎందుకో హీరో లాగా బిల్డప్ ఇచ్చి పోస్ కొట్టాలి అని అన్పించలేదు విక్రాంత్ కీ
తరువాత ఎం జరిగిందో తెలీదు కానీ వాళ్ళ పేరెంట్స్ యే ఒక రోజు...మా అమ్మాయి పెళ్లి వద్దు అంటోంది ఏమి ఫోన్ చేసి చెప్పారు..
విక్రాంత్ చాలా బాధ పడ్డాడు....
విక్రాంత్ కీ ఎప్పుడో విన్న పాత సినిమా డైలాగ్ గుర్తొచ్చింది
"జరిగేది జరగక మానదు
జరగంది ఎప్పటికి జరగదు అని.."
మరుసటి నెల... అద్దం లో చూసి తల దువ్వు కునీ రెడీ అవుతున్నాడు ...ఇంకో అమ్మాయిని చూడటానికి బయలుదేరుతున్నాడు మరీ ...

story 32 ) పెళ్లి పాట్లు.....కథ

 పెళ్లి పాట్లు.....కథ

====≠============
✍️హరీష్

ఎన్నో పెళ్ళి చూపుల తరువాత మొత్తానికి తపస్వి ఒక ఇంటివాడు అయ్యాడు..... అంటే ఇల్లు కొనుక్కున్నాడు అని కాదు... సమీరా అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు..
సమీరా బాగా చదువుకున్న అమ్మాయి..మోడరన్ గా ఉండి మంచి తెలివి తేటలు గల అమ్మాయి..
పెళ్లి చూపుల రోజే తపస్వి సమీరా తో అన్నాడు "మా వాళ్ళు తమ కోడలు జాబ్ చేయాలి అంటున్నారు కానీ నాకు మాత్రం ఇల్లాలు ఇంట్లో ఉంటే తను ప్రశాంతంగా ఉంటుంది అందరికీ ప్రశాంతత లభిస్తుంది అని అభిప్రాయం... ఆ తరువాత మీ ఇష్టం.. ఇంకోటి ముప్పై ఏళ్లు గా నన్ను ఎవరైనా "యావండి " అని పిలవాలని కోరిక..."
అని అంటూ తన భావాలన్నీ వెలిబుచ్చాడు.. ఇవన్నీ తపస్వి కీ చాలా ఆదర్శంగా అనిపించినా సమీరా కీ మాత్రం చాలా వెటకారంగా ఓల్డ్ ఏజ్ థింకింగ్ లాగా అనిపించింది..
అతను అంతా ఓపెన్ గా చెప్పాడు కానీ సమీరా నోరు మేధపలేదు... అమ్మాయిలు అంత ఇంతే నెమో...
పెళ్లి అయ్యాక... మొత్తానికి వారం రోజులు హనీమూన్ అయ్యింది అనిపించారు.... యాంత్రికంగా శోభనం కూడా ముగిసింది...
సమీరాకు కొత్త ఇల్లు కదా బెరకు ఏమో అందుకే ఓపెన్ గా మాట్లాడలేక పోతుంది...అనుకున్నాడు తపస్వి
సమీరా ఇప్పుడు జాబ్ చేయటం లేదు
పెళ్లి అయి నెలలు గడుస్తున్నా సమీరా లో ఏ మార్పు రాకపోవటం గమనించాడు తపస్వి.. మిగతా పనులన్నీ బాగానే చక్కపెడుతోంది... వంట, అంట్లు, బట్టలు, వగైరా కానీ తన విషయం లోనే నేను.. నువ్వు...లాంటి ఫీలింగ్ ఏ తప్ప మనం అనే ఫీల్ తన ప్రవర్తన లో కనపడలేదు...
నేను తనతో టైం స్పెండ్ చేస్తే ఫ్రెండ్లీ గా ఉంటుందేమో అని ట్రై చేసాడు... అది వర్కౌట్ కాలేదు.. ఇంకా తన స్పేస్ లో ఇతను ఎంతసేపు ఉంటాడు అన్నట్టు ఫీల్ అవుతోంది అని పక్కకు వచ్చేవాడు..
బుక్స్ చదివే అలవాటు ఉండటం వల్ల.... "Relationships" అనే పుస్తకం తెచ్చి చదివాడు...అందులో
"భర్త భార్య కీ ఎపుడు హెల్ప్ చేస్తూ ఉంటే భార్య హ్యాపీ గా ఉంటుంది " అని రాసుంది అందులో...హెల్ప్ అని రాసాడు కానీ ఏమి హెల్ప్ ఓ రాయలేదు...
సరే అని అంట్లు తోమి పెడితే... అంతా జిడ్డు జిడ్డు ఏ ఉన్నాయ్ అంది..
బట్టలు ఉతికితే సబ్బే పోలేదు అంటుంది ..
కూరలు కట్ చేస్తే ఇంత పెద్ద ముక్కలు కట్ చేస్తే ఎట్లా ఉడుకుతాయి అన్నది..
ఫోన్ తానే కూర వండితే... దీన్ని కూర అంటారా అంది.. తను బాగానే తిన్నాడు మరీ..

రోజు రోజు కీ సహనం చచ్చి పోయి అసహనం పెరిగి పోతోంది తపస్వి కీ..బేలగా అయిపోయి.... కన్ఫ్యూషన్ గా ఉంటోంది తపస్వి మొహం...
ఇదంతా తన వర్క్ లో కూడా ఎఫెక్ట్ అవుతోంది..
సబ్మిట్ చేసిన పనిలో అన్ని తప్పులే.. చేసే పని కరెక్ట్ కానీ అన్ని మిస్టేక్స్....

తనకి బాగా క్లోజ్ గా ఉండే తన మేనేజర్ ప్రసాద్ ఒక రోజు టీ కీ వెళ్దామా అని తపస్వి నీ తీసుకెళ్లాడు ...
"ఏంటి విషయం ఈమధ్య అన్ని మిస్టేక్స్ వస్తున్నాయి నీ వర్క్ లో.. హౌ ఐస్ యువర్ ఫ్యామిలీ లైఫ్.. అండ్ యువర్ వైఫ్.. అన్నాడు "
మొదట కాస్త తాటపటాయించినా తరువాత ఓపెన్ అప్ అయ్యాడు తపస్వి...
"హ హ హ అదా విషయం..చూడు తపస్వి మ్యారేజస్ మనం అనుకున్నంత సింపుల్ కాదు మనం అనుకునేంత కంప్లికేటెడ్ కాదు... మూవీస్ లో చూపించినట్టు భార్యలు ఏమి జోవిల్ గా సరదాగా ఉండరు...95 % భార్యలు ఇంచుమించు నువ్ చెప్పినట్టే ఉంటారు... వాళ్ళ కారణాలు వాళ్ళకి ఉంటాయి... నువ్ చూస్తూనే ఉంటావ్ కదా మేము వైఫ్ ఫోన్ చేస్తే భయపడి పోటు ఉంటాం... అది అలాంటిదే... యూ శుడ్ జస్ట్ లైవ్ విత్ ఇట్ "
తపస్వి: "అంతే అంటారా సర్ .. మరీ నేను వైఫ్ అంటే ఫ్రెండ్లీ గా... ఐ మీన్ గర్ల్ ఫ్రండ్ లాగా ఉండాలని...ఉహించుకున్నా కదా అందుకే ఏమో అడ్జస్ట్ అవ్వలేక పోతున్న "
బాస్ : " ఒకటి చెప్పు నీకు గర్ల్ ఫ్రెండ్ ఉండేదా... పెళ్ళికి ముందు... "
"లేదు "
" అది సంగతి... నాకు తెల్సిన ఫిలోసోఫీ చెప్తా విను...
ఒక మనిషిగా పుట్టాక...మనం తీపి, కారం, పులుపు, చేదు లాంటి షడ్ రుచులు ఎలా చూస్తామో
అలాగే జీవితం లో కూడా అన్ని రుచులు ఉంటాయి .. .. ఇంచు మించు అందరు భార్యలు అంతే ఉంటారు .. భార్య అనేది ఒక హోదా .. ఒక భాద్యత అని వాళ్ళు అనుకుంటారు .. గర్ల్ ఫ్రెండ్ అనేది ఒక ఫాంటసీ .. నీకు సైన్స్ సోషల్ అని సబ్జెక్ట్స్ ఎందుకు సెపెరేట్ చేశారు .. అన్ని ఒకే బుక్ లో ఇవ్వచ్చు కదా .. ఎందుకంటే దేనికి సంభందించిన ఆన్సర్ ఆ బుక్ లో ఉంటుంది .. నువ్వేమో అన్ని ఆన్సర్స్ ఒకే బుక్ లో వెతుకుతాను అంటున్నవ్ .. అదెలా సాధ్యం ..

" అర్ధం కాలేదు .. సార్ .. " అయోమయంగా అడిగాడు తపస్వి

"కాస్త మౌనంగా ఏకాంతంలో ఆలోచించు .. అర్ధం అవుతుంది .. అర్ధం అయితే మంచిది .. అర్ధం కాక పొతే మరీ మంచిది .. " నవ్వుతూ వెళ్లి పోయాడు .. ప్రసాద్

94 ) రోలింగ్ టైటిల్స్.. కథ :

  రోలింగ్ టైటిల్స్.. కథ :  ~~~~~~~~~~~~~~~~~~~ గగన్ ఒక మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్. గొంతులో వైవిధ్యం, పాత్రకు తగ్గట్టుగా ప్రాణం పోయగల ప్రతిభ అతన...