#telugustories
అంతా యాద్రుచ్చికం .. కథ
~~~~~~~~~~~~~~~~
✍️ హరీష్ బాబు
ఒకసారి ఒక కంపెనీ ఇంటర్వ్యూ లాసం అని బెంగుళూరు కి వెళ్లాల్సి వచ్చింది.. కరోనా తరువాత ప్రయాణాలు తగ్గించాక చేసిన మొదటి ప్రయాణం అది
ఎన్ని ప్రైవేట్ ట్రావెల్స్ లో ఎన్ని సౌకర్యాలు ఉన్న నేను మొదట్నుంచి ఇష్టపడేది మన rtc బస్సు ప్రయాణమే.. సురక్షితం ఏ కాక డ్రైవర్స్ కూడా అంత మోరటు గా మాట్లాడరు అందుకే ఎపుడు అవకాశం వచ్చినా rtc బస్సు ప్రిఫెర్ చేస్తుంటాను..
అలా ఆ రోజు కూడా హైదరాబాద్ బెంగళూరు బస్ ఎక్కి కూర్చున్నాను..
బస్సు సిటీ పరిసరాల్లో నెమ్మదిగా కదులుతోంది
టీవీ పెడతాడేమో అని చూసా లేదు. ఎందుకు అంటే అందరూ ఫోన్లలో చూస్తున్నారు అన్నాడు కండక్టరు.. నేను అలాగే చూద్దాం అని ప్రయత్నించాను.. లాభం లేదు సౌండ్ వినపడట్లేదు ఇయర్ ఫోన్ వాడితే చెవి నొప్పి వచ్చే లాగా ఉంది.. పక్కన పడేసి ఫ్రీ ఎంటర్టైన్మెంట్ కిటికీ లోకి తొంగి చూస్తూ లోకం మరిచి పోయా..
బస్సు సిటీ దాటేసింది..
పక్క సీట్ లో ఇద్దరూ బీటెక్ బాబులు ఐపీయల్ మ్యాచ్ వీక్షిస్తూన్నారు.. నా దురదృష్టం ఆ రోజే అభిషేక్ సెంచరీ చేసాడట.. వారితో
కాసేపు వారితో మాటలు కలిపా స్కోర్ ఎంత ఎక్కడ వెళ్తున్నారు.. ఏమి పని మీద..అడగ్గా వాళ్ళు ఇద్దరూ ఏదో ఎగ్జామ్స్ రాయటానికి వెళ్తున్నట్టు చెప్పి మళ్ళీ మ్యాచ్ లో లీనం అయ్యి పోయారు..
బస్సు కాసేపాగాక ఒక చోట భోజనానికి ఆపాడు... యాస్ యుష్షుయల్ గా పరమ చెత్త చోట ఆపాడు..
దిగి కాసేపు ప్రకృతి ని పలకరించి వచ్చాను..
ఎటు ఆపాడు కదా తిన గలిగేవి ఏమున్నాయా అని చూద్దాం అని ఒక టేబుల్ వద్ద కుర్చున్నాను.. కాసేపట్లో మరో ఇద్దరూ పాసెంజర్స్ కూడా అదే టేబుల్ జోయిన్ అయ్యారు..
మాట మంతి కలిపాక... సర్వర్ వచ్చాడు ఆర్డర్ కోసం మా మధ్యలో కాస్త డిస్కషన్ ప్రారంభం అయింది.. బిర్యానీ తింటే బెటర్ అనో ఒకరు కాదు పెరుగన్నం బెటర్ నా మాట వినండి అని నేను.. కాదు మీల్స్ తీసుకుందాం అని పక్కన ఆయన చెప్పారు.. సరే తల ఒకటి తెప్పించుకున్నాం..
చివరికి తేలింది ఏమిటంటే వాటికంటే పెరుగన్నం ఏ కాస్త బాగుంది.. అని అందరూ నా వైపుకి చుసి.. ఇంకో కర్డ్ రైస్ ఆర్డర్ చేశారు.. వారిలో ఒకతను తను డాక్టర్ ని అన్నాడు.. ఏమి స్పెషలి్సేషన్ అనిడిగితే.. ఫిజియో తెరపి అన్నాడు.. ఓరిని ఫిజియో అని చేప్పకుండా డాక్టర్ అంటావా అనుకున్నా.. వీరిని కూడా డాక్టర్ అంటారు కాబోలు మనకు తెలీదు కదా..
అయితే అతను తింటున్నపుడే
"ఇక్కడ టీ ఉంటుందా" అని అడగటం గమనించాను..
"పెరుగన్నం తింటూ టి ఏంట్రా నీ బొంద" అనుకున్నాను మనసులో
అయితే అతను నేను మనసులో అనుకున్నట్టే అతను బయటికి వచ్చాక టీ ఆర్డర్ చేసాడు
నేను ఇంక ఉండబట్టలేక
"ఇప్పుడే పెరుగన్నం తిని అప్పుడే టీ ఏంటండీ... మీరేమో డాక్టర్ అంటున్నారు... లోపల పెరుగు టీ కలిసి విరిగి పోదా... అని అడిగాను దానికి అతను ఇచ్చిన సమాధానం చూసి విస్తూ పోయాను..
". అంటే టీ కి... పెరుగు కి మధ్యలో నేను కేక్ తిన్నాను" అని చెప్తున్నాడు
అబ్బా ఏం కాంబినేషన్ రా నాయనా అనుకున్నా మనసులో..
అలా టీ లు అయ్యాక బస్సు ఇంకొన్ని ప్రొఫెషనల్ కబుర్లు చెప్పుకుంటూ.. నిద్రపోయాం...
పొద్దున్న లేచి బై బై చెప్పుకుంటూ ఎవరి స్టాప్ లో వారు దిగారు..
నా ఇంటర్వ్యూ అయిపోయేసరికి.. సాయంత్రం 4 pm అయింది ఇంకా ఎవరినైనా కలవటానికి టైమ్ లేదు కదా అని మేజీస్టిక్ బస్సు స్టాప్ కి చేరుకున్నాను ( ఇక్కడ mgbs అన్నట్టు బస్సు స్టాప్ ని అక్కడ అలా పిలిస్తారు లెండి ) వచ్చి హైదరాబాద్ వచ్చే మొదటి బస్సు ఎక్కేద్దాం అని డిసైడ్ అయ్యాను....
6 pm వరకు ఒక్క బస్సు లేదు.. అప్పుడు వచ్చింది.. ఆ బస్సు ఎక్కి చూద్దును కదా.. ఆశ్చర్యం.. పొద్దున్న వచ్చిన బస్సు డ్రైవర్ కండక్టర్ ఉన్నారు.. యాద్రుఛ్చికం....
దిగి బస్సు చూసా.. అదే బస్సు.. యాద్రుఛ్చికం
సరే అని బస్సు లోకి వెళ్లి కూర్చున్నాను.. కిటికీ లోకి చూస్తూ
"అరేయ్ అన్న రా.. " అన్నా అరుపు కి ఇటు తిరిగా
ఎవరా అని చూస్తే.. నిన్న రాత్రి ipl మ్యాచ్ చూస్తున్న బీటెక్ బాబులు వచ్చారు..యాద్రుఛ్చికం
" ఓరిని మీరు కూడా ఇదే బస్ ఆ.. ఎగ్జామ్ అన్నారు కదా అయిందా " అని అడిగాను.
" ఆ అయిపోయింది అన్నా.. ఇంకా వచ్చేసాం "
" ఓకే గుడ్" అనుకున్నా..
కాసేపయ్యాక ఆ డాక్టర్ కూడా వచ్చాడు..
ఓరి నాయనో ఒకే బస్సు లో ఇంత మంది యాదరుచికంగా ఒకే బస్సు ఎలా ఎక్కరా అనుకున్నా..
ఎందుకంటే మాలో ఎవరూ కూడా రిజర్వేషన్ లేదు జస్ట్ ర్యాండమ్ గా వచ్చి కలిసాం..
జీవితంలో అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతుంటేనే.. జ్ఞాపకాలు గా మిగిలంటాయి అనిపించింది..
సమాప్తం..
----- *** ----
No comments:
Post a Comment