Friday, August 21, 2026

63 ) ఆటగాడి ప్రేమ కథ ...

 63 )  మనసు ఇచ్చా కానీ ... కథ (    ఆటగాడి  ప్రేమ కథ  ...)  

--------------------------------------


జోరున వర్షం పడుతోంది . వర్షం తాలూకు సౌండ్ రూమ్ లోపలివరకు వస్తుంది. సునీల్ అని బాగా గడ్డం ఉన్న ఒక వ్యక్తి డార్కుగా ఉన్న రూమ్ లో బ్లూ లైట్ బ్యాక్ గ్రౌండ్ లో కూర్చుని డ్రింక్ చేస్తూ కూర్చుని తన గతాన్ని గుర్తు చేసుకుంటున్నాడు


"ప్రేమించాను అనుకున్నా కాని నాతో నేను ఆడే ఫుట్బాల్ తో నన్నే తంతుంది అనుకోలేదు 

 అసలు ఆ రోజుల్లో నేను ఫుట్బాల్ ఆడుతుంటే... జనాలు.... పిచ్చెక్కి. చూసేవాళ్ళు..."


***************

అది ఒక కాలేజ్ ఫుట్బాల్ స్టేడియం చుట్టూ కాలేజ్ స్టూడెంట్స్ అందరూ ఎంకరేజ్ చేస్తుంటే మధ్యలో రెండు కాలేజీ టీమ్స్ మధ్య ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతూ ఉంది


కెమెరా ఇపుడు ప్రేక్షకుల గేలరీ మీద నుంచి అందరి ప్లేయర్స్ మీదకు వెళ్లి అటు నుంచి ఒక్కొక ప్లేయర్ వైపు వెళ్లి లాస్ట్ కు ఒక ప్లేయర్ వెనుక షాడోమీద కు వెళ్లి ఆగుతుంది ...అతడే సునీల్ ...ఇప్పుడు ఆ ప్లేయర్ కాళ్లు వెంటే కెమెరా మూవ్ అవుతోంది .....ఫుట్బాల్ తన్నుకుంటూ తన్నుకుంటూ .. ఫాస్ట్ గా వచ్చిన అతను ఆ ఫుట్బాల్నీ ఫ్రెండ్ కి పాస్ చేస్తూ ఒక "ఎస్" ఆకారంలో ఫాస్ట్ ఫాస్ట్ రన్ చేస్తూ గోల్ చేసాడు


ప్రతి 5 నిమిషాలకి వరుసగా మళ్ళీ మళ్ళీ ....గోల్స్ చేస్తూ మ్యాచ్లో మొత్తముగా 10 గోల్స్ చేస్తాడు


ఇప్పుడు కెమెరా ఆ ఫుట్ బాల్ మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకులు లోకి వెళుతుంది ....హీరోయిన్ సునీత ని హైలెట్ చేస్తుంది సునీత ... సునీత గోల్ గోల్ అని అరుస్తూ ఎంజాయ్ చేస్తోంది చేస్తోంది... సునిల్ చేసే ఒక్కొక్క గోల్ కి తాను ఇంప్రెస్ అయింది 


     సునీల్ కి సునీత కాలేజీ లో ఎదురుపడ్తుంది ... ఇద్దరు మధ్య ఒక స్మైల్ తరువాత పరిచయంగా మారింది  


ఆ తరువాత కొద్దీ రోజులకే వారిద్దరూ మంచి ఫ్రెండ్స్ గ మారిపోతారు ...ఇంకా చాల ఎక్కువే క్లోజ్ అవుతారు   


      ఇద్దరు ఫోన్ నంబర్స్ షేర్ చేసుకుంటారు .... మొదట్లో అప్పుడపుడు వచ్చే మెస్సగెస్ ఇపుడు ... ఎపుడెపుడా అని ఎదురుచూసే అంత గా క్లోజ్ అయిపోయారు 


ఇలా ఒక నాలుగు నెలలు..తర్వాత సునీల్ సునీత తో పీకలలోతు ప్రేమలో పడతాడు ....ఇక పెళ్లి అంటూ చేసుకుంటే సునితాని పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు

  అయితే సడన్ గా ఒక రోజు నుంచి సునీత సునీల్ ని కలవడం మానేసింది ........ పిచ్చి వాడిలాగా తిరుగుతూ ఉంటాడు సునీల్ ........ ఎంత వెతికినా సునీత ఎక్కడ ఉంది అనేది సునీల్ కి అర్థం కాలేదు 

   లాస్ట్ కి ఒకరోజు తన ఫ్రెండ్ ద్వారా తెలుస్తుంది ........సునీతకి , అశోక్ అనే వ్యక్తి తో ఎంగేజ్మెంట్ అయిందని తెలుసుకుంటాడు సునీల్ 

సునీల్ కి చెప్పలేనంత కోపం వస్తుంది అయితే సునీత మీద ఉన్న నమ్మకంతో ఆ కోపాన్ని  అనుచుకొని అదేదో సునీతనే అడిగి తెలుసుకుందాం అనుకున్నాడు 

 ఆ రోజు దసరా పండుగ ఉండటంతో తప్పకుండా గుడి కి వస్తుంది అని గుడికి వెళ్లే దారిలో వెయిట్ చేస్తూ ఉంటాడు

గుడి నుంచి నుంచి వచ్చే దారిలో చీకట్లో ఒక రోడ్డు మధ్యలో సునీత ఇంటికి గుడికి మధ్యలో ఎవరూ లేని చోట సునీత తన ఫ్రెండ్ తో పాటు వస్తూ ఉంటుంది. దారిలో ఒక చోట సునీల్ బైక్ పార్క్ చేసి ఆగి ఉండటం చూస్తుంది సునీత . వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ లంగా వోణి లో అద్భుతంగా డ్రెస్సుప్ అయి ఉంటుంది సునీత .

సునితా ని అక్కడే ఆపి సునీల్ అడుగుతాడు


"నేను విన్నది నిజమేనా ....నీకు ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయింది అంట కదా ........నేను నమ్మలేదు అబద్ధం కదా........చెప్పు చెప్పు " అంటాడు

దానికి కాసేపు ఆలోచించి సునీత "కాదు నిజమే" అంటుంది 


దానికి సునీల్ "మరి నా సంగతి ఏంటి ?" అంటాడు


"నీ సంగతి ఏమి ఉంటుంది ...నువ్వు నాకు చాల బెస్ట్ ఫ్రెండ్ వి కదా " అంటుంది సునీత


 సునీల్ కి ఎక్కడ లేని ఉక్రోషం వస్తుంది . తట్టుకోలేక సునీతా నీ మెడ మీద రెండు చేతులు తో నొక్కి దాదాపు పీక పిసికేటంత  అంత పని చేస్తాడు 


"అయితే ఇన్ని రోజులు మనిద్దరం కలిసి తిరిగింది ఏం చేసింది అంతా జస్ట్ ఫ్రెండ్ షిప్ అంటావా...ముద్దు పెట్టుకోవడం.. నైట్ స్పెండ్ చేయడం ఇవన్నీ   ఫ్రెండ్ షిప్..లా...  అలా ప్రవర్తిస్తారా " అని అడుగుతాడు


సునీత విననట్టుగా "లేదు " అని చెప్పి ఇలా అంది 

"సరే చెబుతా విను ........బీ ప్రాక్టికల్........ నీకు నువ్వు పెద్ద ఫుట్బాల్ ప్లేయర్ అని నేను నిన్ను ఇష్టపడ్డాను నిజమే కానీ ........ఆలోచిస్తే నీకు ఇప్పుడు జాబ్ లేదు పెద్ద ఫుట్బాల్ టీమ్ కి సెలెక్ట్ అయ్యావా అది ఇంకా ........లేదా పోనీ వెయిట్ చేద్దామనుకుంటే నాకు అంత టైం లేదు నేను ప్రాక్టికల్గా ఆలోచించే మనిషిని అని నీకు బాగా తెలుసు ........నాకు ఒక సంబంధం వచ్చింది అబ్బాయి USA లో లక్షలు లక్షలు సంపాయించే జాబ్ చేస్తున్నాడు నన్ను బాగా చూసుకుంటాడు నా లైఫ్ సెటిల్ అవ్వాలంటే జస్ట్ ఒక్క సెకండ్ .... నేను జస్ట్ ఎస్ ఆర్ నో చెప్తే సరిపోతుంది.... ఆ ఒక ఎస్ తో లైఫ్ సెటిల్ చేసుకుని ఛాన్స్ ఒకవైపు .... నీ లైఫ్ ఇంకా సెటిల్ కావటానికి ఎంత కాలం పడుతుందో తెలియకుండా వెయిట్ చేయడం ఇంకోవైపు ... ఆలోచించాను ........ఎస్ చెప్పడమే కరెక్ట్ అనిపించింది నాకు ఉన్నది ఒకటే ఒక్క లైఫ్ ........ఇంకో లైఫ్ ఉంటుందో లేదో కూడా తెలియదు ఒకే ఒకసారి ఈ ఆప్పొర్చునిటీ (అవకాశం) వదులుకోవడానికి నేను తెలివి తక్కువ దానిని కాదు ........ ఇంకా వెయిట్ చెయ్యడం అనవసరం అని చెప్పి నేను అబ్బాయికి ఎస్ చెప్పాను  


సునీల్ లెట్ అస్  సపోజ్  నీకు ఒక జాబ్ వస్తుంది అనుకుందాం ఒక 3 or 4 ఇయర్స్    అయ్యాక ... మళ్ళి అప్పుడు ఒక ఫ్లాట్ కొనుక్కుని దానికి   ఇన్స్టల్మెంట్   కట్టుకుంటూ పిల్లల్ని కని వాళ్ళని పెంచి .. ఇదంతా నాతో కాదు... నువ్వు నా టైపు కాదు సునీల్ అనవసరంగా ఎక్కువ అలోచించి ని టైం వేస్ట్ చేసుకోకు నీ ప్రాక్టీస్ కి లేట్ అవుతుంది వెళ్లి పడుకో త్వరగా " అంది


 సునీల్ సునీత ని అక్కడ అక్కడే వదిలేసి "సరే నీ లైఫ్ నువ్వు చూసుకో నీ లైఫ్ లో నేను ఇంకెప్పుడు రాను" అని చెప్పేసి వెళ్ళిపోయాడు


సునీల్ కి ఇది పెద్ద షాక్... తెరుకోటానికి చాలా టైం ఏ పట్టింది...

-------------------


ఏప్పుడు బార్ లో నే  గడుపుతున్నాడు... ఫ్రెండ్స్ చెప్పినా వినలేదు...


ఒక రోజు  వాళ్ళ ప్రిన్సిపాల్ అదే బార్ లో కలిసాడు.. 

"ఏంటి సునీల్ ఇలా అయిపోయావ్ కాలెజ్ తర్వాత పెద్ద క్లబ్ కి ఆడతావ్ అనుకున్నా .."


ఆ మాటలకి సునీల్ చలించిపోయి తన కథ  అంతా చెప్పుకొచ్చాడు ...


అతను చెప్పిన దానికి ప్రిన్సిపాల్ చెలయించిపోయాడు  .

 "చూడు సునీల్ నీ కోపం అంతా ఫుట్బాల్ మీద చూపించు... తంతే బాల్ వెళ్లి గోల్ లో పడాలి ..... ఆ సునీత కాదు ఇంకా ఎవరైనా సరే నిన్ను ఎందుకు మిస్ అయ్యానా అని బాధ పడేలా  ఆడు .. నీ సెలెక్షన్స్ నేను చూస్కుంటాను .".. అని చెప్పాడు...


అప్పటి నుంచి సునీల్ మళ్ళీ ఫూట్ బాల్  సాధన కటొరంగా మొదలు పెట్టాడు...

పగలు రాత్రి ఏకం చేసి సాధన చేశాడు.


******** ********

అనుకోకుండా ఒక రోజు మార్నింగ్ సునీల్ గ్రౌండ్ లో ప్రాక్టీస్ చేస్తుకుంటుండగా ఒక కాల్ వస్తుంది .   ఆ కాల్ విన్నాక ...


------------------------------------------------------

  ఆ కాల్ విన్నాక సునీల్ ఒక్కసారిగా ఎగిరి గంతేశాడు .. 

 అక్కడి నుండి వెంటనే  బైక్ తీసుకొని వెళ్ళి సునీత ఇంటి ముందు ఆగాడు ..


అక్కడ తన బైక్ హార్న్ మొగిస్తూనే ఉన్నాడు . 


ఎవరబ్బ పొద్దున్నే   మా ఇంటి ముంది గోల అనుకుంటూ సునీత బయటికి వచ్చింది 


"సునీల్ మళ్ళీ ఏంటి నువ్విక్కడ " అంది సునీత 


సునీల్ ఆ అమ్మాయికి ఒక ఎంవోలోప్  ఇచ్చాడు . 

"ఏంటి మళ్ళీ ఇంకో లవ్ లెటర్ ఆ .. నేను చెప్పా కదా మనకి ఇంకా సెట్ కాదు అని "


"ముందు ఆ కవర్ ఓపెన్ చేసి చూడు "అన్నాడు సునీల్ 


ఆ కవర్ ఓపెన్ చేసి చూస్తే ఆశ్చర్యం .. సునీల్ కి ఒక యుకె ఫూట్ బాల్ క్లబ్ నుంచి .. 

మూడు కోట్ల ఇయర్ లీ సేలరీ తో ఒక అవకాశం ఇస్తున్నట్టు గా అందులో రాసి  ఉంది 


సునీత సునీల్ వైపు కోపంగా చూసింది 

సునీల్ అన్నాడు 

"భయ పడకు ఇది చూపించి నిన్ను  ఫోర్స్ చేయాలనుకోవట్లేదు .. 

కేవలం థాంక్స్ చెప్పటానికి నేను వచ్చాను .. ఆ రోజు నువ్వు నన్ను రిజెక్ట్ చేయక పోయి ఉంటే 

నేను నువ్వు చెప్పినట్టు ఆవెరేజ్ జాబ్ చేస్తూ ఉండేవాడినేమో .. ఇప్పుడు నేనెంతో నేను నిరూపించుకున్నాను  

కాదు నిరూపించుకునేలాగా చేశావ్  .. థాంక్స్ సొ మచ్ "


అని చెప్పి అక్కడి నుంచి బైక్ స్టార్ట్ చేసి వెళ్ళి పోయాడు 

నిర్ఘాంత పోయి చూడటం సునీత వంతు అయింది .. 


-- సమాప్తం -- 

62) /// పాత వైద్యం //// కథ ///

 Patha vaidyam


////_పాత వైద్యం //// కథ ///


 పరంధామయ్య ఒకసారి చిన్న పని మీద తన ఊరు బయలుదేరాడు .అక్కడ తన తమ్ముడు రఘురామయ్య ని కలిశాడు. ఇద్దరూ భోజనం ముగించుకుని ఊరంతా ఒకసారి తిరిగి వద్దామని బయల్దేరారు దారిలో వారికి గ్రామ వైద్యుడు కాంతయ్య ఏదో ఆకులు అలములు నూరుతూ కనిపించాడు. 


రఘురామయ్య "ఏం కాంతయ్య బాగున్నావా "అని పలకరించాడు 


"ఎవరు మీ అన్నయ్యా... ఏమయ్యా పరంధామయ్య బాగున్నావా " అని కాంతయ్య తన ఇంట్లోకి ఆహ్వానించాడు 


పరంధామయ్య వయసు 50 పైన ఉంటుంది రఘురామయ్య వయసు 40 పైనే ఉంటుంది. 


ఇద్దరూ కా0తయ్య ఇంట్లో కూర్చున్నారు వారి ఎదురుగా కాంతయ్య కూర్చున్నాడు .


కుశలప్రశ్నలు అయిన తర్వాత 


 "ఏది ఓ సారి నీ చెయ్యి ఇవ్వు" అన్నాడు కా0తయ్య పరంధామయ్యని


"ఏంటి జాతకాలు కూడా చెప్తావా" అన్నాడు పరంధామయ్య 


చెయ్యి పట్టుకుని నాడీ చూస్తూనే కాంతయ్య


" నీకు గుండెపోటుకు ...ఏదన్నా మందు ఇవ్వమంటావా" 


ఆ ప్రశ్నకు పరంధామయ్య ఉలిక్కిపడ్డాడు 


"నాకు గుండె నొప్పి సమస్య ఏమీ లేదు ఎందుకలా అడుగుతున్నావు " అడిగాడు కాంతయ్య ని


" లేకపోతే లేకపోయింది లే నేను మందు ఇస్తాను వేసుకో ఈ జబ్బు రాకుండా ఉంటుంది " అని చెప్పి అతని చేతుల్లో ఒక మూలిక చేతిలో పెట్టాడు


మారుమాట్లాడకుండా ఇద్దరూ కాంతికి సెలవు తీసుకుని తమ దారిన బయటకు వచ్చారు


 పరంధామయ్య ఆలోచన గ్రహించిన రఘురామయ్య


" నీ ఆలోచన ఏంటో నాకు అర్థమైంది నీకు గుండెపోటు సమస్య ఉందో లేదో అనే కదా ఒక పని చెయ్ ఇంటికి వెళ్లి పరీక్షలు చేయించుకుని నీ ఆరోగ్యం ఎలా ఉందో ఒకసారి చెప్పమని చెప్పు " అన్నాడు రఘురామయ్య


 అలాగే అని తల ఊపి సిటీకి వెళ్లి ఆ మరుసటి రోజే పరంధామయ్య ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో ఒక కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్లి తన హెల్త్ ఎలా ఉందో అడిగి తెలుసుకున్నాడు..


 దానికి ఆ కార్డియాలజిస్ట్ 


"దాందేముంది ఇప్పుడే హెల్త్ చెకప్ చేస్తా" నని


 పొద్దున్నుంచి రాత్రి దాకా అని టెస్ట్ చేసి వాటి రిజల్ట్స్ కోసం రెండు రోజులు ఆగమని చెప్పి లాస్ట్ కి అవును మీకు కొలెస్ట్రాల్ ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉంది మీరు ఫలానా ఆపరేషన్ చేయించుకుని దానికి ఐదు లక్షలు ఖర్చు అవుతుంది అని చెప్పాడు 


మళ్లీ ఊరు వచ్చి పరంధామయ్య కాంతయ్య ని కలిశాడు జరిగిందంతా చెప్పాడు 


ఆ అయిదు లక్షల ఖర్చు అవసరం లేదు నేను ఇచ్చిన మూలిక వారం రోజుల పాటు వాడు నీకు కొలెస్ట్రాల్ తగ్గిపోయి నీకు ఏ హార్ట్ ఆపరేషన్ అవసరం ఉండదు అని చెప్పాడు ఆ విధంగానే వాడిన పరంధామయ్య మళ్లీ టెస్ట్ చేయించుకుంటే జీరో నార్మల్ కొలెస్ట్రాల్ ఉంది అని తేలింది 


అన్ని వేలు పోసి చేసిన టెస్టు లకి మూడు రోజుల తర్వాత కూడా రిజల్ట్ తేల్చలేకపోయారు ...దానికి కూడా ఐదు లక్షలు ఖర్చు చేసి ఆపరేషన్ చేస్తే గాని నయం అవ్వదు అని చెప్పారు 


పరంధామయ్య కి ఏమీ అర్థం కాలేదు ఒక పల్లెటూర్లో ఉండే డాక్టర్ ఏ అత్యాధునిక సదుపాయాలు లేకుండా కేవలం నాడి పట్టుకుని ఎలా చెప్పగలిగాడు అనేది అర్థం కాక మళ్ళీ రఘురామయ్య దగ్గరికి వెళ్ళాడు 


ఇదే విషయం రఘురామయ్య దానికి కి రఘురామయ్య ఇలా అన్నాడు మీ సిటీ వాళ్ళు ప్రతి చిన్నదానికి మల్టీస్పెషల్టి హాస్పిటల్ పరిగెత్త్తుతారు


 కానీ మనదేశంలో చాలా పల్లెటూర్లలో ఏ మల్టీస్పెషల్టి హాస్పిటల్ ఉండదు ఇలాంటి చిన్న డాక్టర్లు మాత్రమే ఉంటారు వాళ్ళు ఎం బి బి ఎస్ అయ్యుండొచ్చు కాకపోయి ఉండవచ్చు ఆర్.ఎం.పి అయ్యుండొచ్చు లేదా ఆయుర్వేదం అయి ఉండొచ్చు కానీ వీళ్ళు కేవలం కంటి చూపు తోటి లేదా నాడి పట్టుకొని మనిషి లోపల ఉన్న జబ్బు ఏమిటో చెప్పి వాళ్లకు కావలసిన వైద్యాన్ని లేదా మందుల్ని వాళ్ళకి ఇచ్చి ఇక్కడ ఎంతో మంది ప్రాణాలు నిలబెడుతున్నారు . ఇంత జెసి వాళ్ళు తీసుకునే ఫీజు కేవలం పది రూపాయల 20 రూపాయలు మాత్రమే


నాకు తెలిసినంత వరకు ప్రతి ఊర్లో ఉండే గుడిలో దైవం ఉంటుందో లేదో తెలియదు కానీ వీళ్ళు మాత్రం మాకు ప్రత్యక్ష దైవాలు అని చెప్పాడు రఘురామయ్య


ఇది విన్న పరంధామయ్య మనసు చలించిపోయింది తను కూడా ఆ డాక్టర్ కి ఏదో ఒకటి చేయాలనుకున్నాడు వాళ్ళ ఊర్లో పెద్ద హాస్పిటల్ కనిపించడానికి తన సమకూరుస్తున్నాడు రఘురామయ్య చాలా సంతోషించారు


హరీష్ 9902015746


#harishsworld

61 ///// నీటి గండం /////కథ ////

 .....................................

///// నీటి గండం /////కథ ////

.....................................


మావి సాఫ్ట్వేర్ జాబ్స్ కదా ఆరోజు తొందరగా ఆఫీస్ కి వెళ్లాల్సింది ఆ రోజు ...పెండింగ్ వర్క్ కంప్లీట్ చేయాలి


 అందుకనే 6 ఒ. క్లాక్. కే లేచీ గీసర్ వేసుకొని స్నానానికని బాత్రూమ్ కి వెళ్ళాను 


స్నానం ముగించుకొని టవల్ కట్టుకుని బయటకు వచ్చి బట్టలు వెతుకుతున్నాను ....నేను ఇంట్లో ఒక్కడినే ఉన్నాను ఇంట్లో అందరూ సమ్మర్ హాలిడేస్ కదా ఊరెళ్ళారు

 


బాత్రూం లో టాప్ లీక్ అవుతున్నట్టు అనిపించింది tuku tuku ఆ చుక్కలు చుక్కల నీళ్లు కారుతున్నాయి శబ్దం వినపడుతోంది బాత్రూంలోకి వెళ్లి చూసి ఆ టాప్ ని ఆఫ్ చేద్దాం అని చూశాను


 ఎంత గట్టిగా ఆఫ్ చేసినా ఇంకా చుక్క చుక్క కారుతుంది నా బలం ఉపయోగించి గట్టిగా తిప్పాను...నా దరిద్రం కొద్దీ ఆ టాప్ నాబ్ ఊడి నా చేతి లోకి వచ్చి మొత్తం నీళ్ళన్నీ ఒక్క సారిగా నా మొహం మీద చిమ్మి... బాత్రూంలో పారటం మొదలుపెట్టాయి...


 ఎలా ఆపాలో అర్థం కాలేదు బాత్రూంలో ప్రవాహం వరదలా వస్తోంది ...నీళ్ళు గట్టిగా వచ్చేస్తున్నాయి .... బాత్రూం నుంచి నీళ్లు బయటకు వస్తున్నాయి ....బాత్రూం నుంచి బెడ్రూం లోకి... బెడ్రూం నుంచి హాల్ లోకి ప్రవాహం పోతుంది 


పోనీ మెయిన్ డోర్ తీరుద్దామని ట్రై చేశాను ...డోర్ లాక్ అయిపోయింది బయటి నుంచి ...


బయటి నుంచి ఎవరు లాక్ చేశారు అబ్బా...


 అనుకుంటూ సరేలే అని... బుర్ర ఉపయోగించి...కాళ్ళు ఈడ్చుకు0టూ వెళ్ళి.... ఫోన్ తీసుకొని ఎవరికన్నా ఫోన్ చేద్దామని ట్రై చేస్తున్నాను


 అప్పటిదాకా సబ్బు నీళ్లతో పట్టుకున్న ....నా చేతిలో ఫోన్ పట్టు కాస్తా జారిపోయి కింద పడింది 


 ఫోన్ నిండా నీళ్లు నిండి పోయి ఫోన్ పని చేయట్లేదు....


 పోనీ ...బయటికి ఎవర్నైనా పిలుస్దా0 అని తలుపు గట్టిగా దబ దబ బాదాను.... ఏమో అవతలి వాళ్ళు ఎవరూ లేరు అనుకుంటా ....ఎవరు తీయలేదు.. 


 ప్రవాహం మాత్రం ఉద్రుతంగా వస్తూనే ఉంది... ఇప్పుడు ప్రవాహం వేగం పెరిగింది.. మోకాళ్ళు కూడా తడిసిపోతున్నాయి .... బుక్స్, పేపర్సు తడిసిపోతున్నాయి.... 


ఇ0కా కాసేపు కాసేపు ఉంటే బెడ్ పక్కనే కరెంటు ప్లగ్లో నీరు చేరీతే... నేను చచ్చి పోవడం ఖాయం అని అనుకున్నాను


 అనుకో కుండా ఎవరో వెనక నుంచి "ఒరేయ్ బుజ్జి... లేవరా ఒరేయ్ లేవరా" అంటున్న అరుపులు వినిపించాయి 


ఎవరా అని అటు వైపు చూశాను ఎవరూ కనిపించలేదు 


మొత్తం తిరిగి చూశాను కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా అమ్మ నన్ను నిద్ర లేపుతుంది 


"ఆహా... ఇదంతా కలా" ....గుoడె మీద చేయి వేస్తే...

వేగంగా కొట్టుకుoటో0ది....

 

////// కథ/ సమాప్తం /////


#harishsworld 

Writer : Harish Babu 9902015746

60 ) భవిష్య వాణి ( థ్రిల్లర్ కథ )

 60 )------------------------------------

భవిష్య వాణి ( థ్రిల్లర్ కథ ) 

---------------------------- --------

హైదరాబాద్ సిటీ లో పెద్ద పేరున్న బిసినెస్ మాన్ అయిన అప్పల నాయుడు కొడుకు విశాల్ 

ఒక బాగా పేరు ఉన్న జోతిష్యుడు "గోపాల్ శాస్త్రి " గారి దగ్గర జాతకం చెప్పించుకోవటం కోసం వెళ్లారు విశాల్ ఇంక అతని తండ్రి ,

అయితే ఆ జ్యోతిష్కుడు విశాల్ వాళ్ళ తండ్రి కి 

" మీరు సరిగ్గా ౩౦ రోజులలో చనిపోతారు చనిపోతారు" అని చెప్తాడు 

ఆశ్చర్యంగా కరెక్ట్ గా ఆ జ్యోతిష్కుడు చెప్పిన తేదీ రోజే విశాల్ తండ్రి చని పోవటం జరుగుతుంది 

తండ్రి మరణం విశాల్ ని చాల డిప్రెస్ చేస్తుంది... కానీ అతనికి అర్ధం కానీ విషయం ఏమిటంటే ఆ జ్యోతిష్కుడు చెప్పిన డేట్ కె ఎలా చనిపోయారా అని ...

ఇదే విషయం విశాల్ ఫ్రెండ్ అయిన "పోలీస్ SI వేణు " కి ఫోన్ చేసి వివరిస్తాడు విశాల్

" అంత కచ్చితంగా ఆ జ్యోతిష్కుడు చేపి చెప్పిన రోజే ఎలా చనిపోతారు రా ఎవరైనా .... 

మన చావు మన చేతుల్లో ఉండదు కదా అది హత్యో లేక అతను సూసైడ్ అట్టెంప్ట్ చేస్తే తప్పితే ..." అన్నాడు విశాల్ 

ఇలా ఆ రోజే తనను కలవటానికి వచ్చిన తన సైక్రియాట్రిస్టు ఫ్రెండ్ "సత్య " తో డిస్కస్ చేసాడు SI వేణు 

సత్య కి కూడా ఈ కేసు చాల ఇంటరెస్టింగ్ గా అనిపించింది

కానీ ఇది 'హత్య ' అయుండక పోవచ్చు అని వాదిస్తాడు సత్య 

"నాతో వస్తే నీకే తెలుస్తుంది కదా "అంటాడు వేణు 

"సరే పద " అని ఇద్దరు కలిసి విశాల్ ఇంటికి వెళ్తాడు ...

"విశాల్ ఒక సారి ... మీ నాన్నగారి రూమ్ మొత్తం చుపిస్తావా మాకు " 

" సరే అలాగే పదండి" అంటూ విశాల్ వల్ల నాన్నగారి రూమ్ , వస్తువులు , పుస్తకాలు , ఇంట్లోని మనుషులు అందరిని చూపిస్తాడు

" సరే విశాల్ ... ఈ కేసు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం ముందు నువ్వు FIR ఇవ్వాలి పోలీస్ స్టేషన్ లో .." అన్నాడు వేణు 

" అలాగే " అంటూ ఎఫ్ ఐ ఆర్ ఇచ్చాడు విశాల్ ....

వేణు ఫింగర్ ప్రింట్స్ కలెక్షన్, పోస్ట్ మార్టం రిపోర్ట్స్ చూస్తూ .... అసలు ఈ కేసు లో ఎవరు ఎవరు ఇన్వొల్వె అయ్యున్నారు అని ... ఆ డైరెక్షన్ లో ఇన్వెస్టిగేట్ చేస్తున్నాడు

కానీ సత్య మాత్రం వీటితో సంబంధం లేకుండా ...విశాల్ తండ్రి గారి బంధువులు , మిత్రులు , ఇంకా క్లోజ్ కాంటాక్ట్స్ వివరాల గురించి అడిగి తెలుసుకున్నాడు.....అసలు అతని తండ్రి గత 3 నెలల ముందు నుంచి ... ఏ ఏ మనీ ట్రాన్సక్షన్ చేసారు ... ఎవరైనా కొత్త వాళ్ళని కలిసారా... అని ఆరా తీసాడు ..

విశాల్‌తో జరిగిన ఈ సంభాషణలో, "జోతిష్యుడు గోపాల్ శాస్త్రి" గురించిన విషయాలు కొన్ని సత్య సేకరించాడు

SI వేణు ఈమధ్యలో గోపాల్ శాస్త్రీని కూడా విచారణ కోసం రమ్మని కోరతాడు

ప్రజల మనస్తత్వాన్ని అర్థం చేసుకున్నందున సత్య కి దీని గురించి భిన్నమైన అభిప్రాయం ఉంది 

***************

విశాల్ ఇంట్లో వాళ్ళందరిని ఒకరి తరువాత ఒకరిని ప్రశ్నించిన తరువాత ఇది సహజ మరణమే ...అనే నిర్ణయానికి వస్తాడు ...చంపటానికి సంబందించిన వెపన్స్ లేవు , పాయిసన్ స్టెయిన్స్ లేవు, చంపటానికి కావాల్సిన మోటివ్ కూడా ఏమి ఎవరిదగ్గర కనపడదు

కానీ సత్య మాత్రం వేణు చెప్పిన దానికి విరుద్ధంగా చెప్పాడు ...."

"నేను చెప్పేది జాగ్రత్త గా విను వేణు . .. మొదట నేను చెప్పేది ... అంత నమ్మశక్యం గా లేక పోవచ్చు ....కానీ నమ్మాలిసిన విషయం . ...

...ఇది సహజ మరణంమో లేదా హత్య కాదు, కానీ నెమ్మదిగా మరణానికి దారి తీసిన కుటుంబ సభ్యుల ప్రవర్తన మాత్రమే అతనిని చంపేసింది . ఇక్కడ ఎవరు క్రిమినల్ కాదు ... ఎవరు ఏయ్ క్రైమ్ చేయలేదు .... కేవలం అందరు నమ్మిన ఒక అప నమ్మకం ... వల్ల అందరు ఆ డైరెక్షన్ లో నే వెళ్లారు ....అలాగే మాట్లాడారు ... అదే నమ్మారు .. వారు చేసే ప్రతి పని .. ఆ నమ్మకాన్ని నిజం చేస్తూ పోయింది .... .... అల వాళ్ళ నమ్మకమే ఆయనను చంపేసింది." 

వేణు : " నువ్ చెప్పేది నమ్మలేక పోతున్నాను సత్య ... ఎవరు చంపక పోవటం ఏంటి ....అందరు చంపటం ఏమిటి నాకు ఏమి అర్థం కావటం లేదు "

సత్య : " దీని వెనుక కారణం కేవలం మనస్తత్వశాస్త్రం మాత్రమే చెప్ప గలదు .... మనిషి ఏ విషయాన్నీ ఐతే గట్టిగ నమ్ముతాడో .... ఆ విషయాన్నీ కోషెన్ చేయడు ... ఉదాహరణకి ( ఓకే బాల్ చూపిస్తూ ) ఈ రబ్బర్ బాల్ ని నువ్ పైకి వేస్తె ఏమవుతుంది ...కిందకి వస్తుంది ...అదే విషయం మన నరలో జీర్ణించు కొని ఉంది కాబట్టి మనం కొశ్చన్ చెయ్యము .. సో ఆ బాల్ తో ఆదుకుంటాం కూడా అలాగే ఏదియైన విషయాన్నీ మనం గట్టిగ నమ్మితే .... మన ప్రవర్తన ఆ నమ్మకాన్ని నిజాన్ని చేయటానికి ప్రయత్నిస్తుంది .....

ఇపుడు ఎలాగైతే ఒక పిల్లాడ్ని క్యాషుల్ గా బుక్ తీసి చదువు అంటే చదివడు కానీ రేపు ఎక్సామ్ ఉంది చదవకపోతె ఫెయిల్ అవుతావు అంటే చదువుతాడు .... ఫస్ట్ కేసు లో చెప్పింది నమ్మలేదు సెకన్డ్ కాజల్ లో నమ్మాడు .... జరిగింది...సింపుల్ .... ఇది కూడా అలాగే జరిగింది.. 

ఎవరో ఒకరు మరణ తేదీని చాలా కాలం ముందు ప్రకటించారు ఇంకా అది కూడా నమ్మకలిగే వారిద్వారా చెప్పించారు ... అందరు నమ్మారు 

ఇది ఖచ్చితంగా జరగబోతోందని మనము అనుకున్నపుడు మన చర్యలన్నీ కూడా అనుకోకుండా ఆ దిశలో జరుగుతూ ఉంటాయి "

మరణించిన తేదీ ప్రకటించిన తరువాత ... వాళ్ళు ఆ జోతిష్యుడు ని అంత ఎక్కువ నమ్ముతారు కాబట్టి తెలియకుండానే కుటుంబ సభ్యులలో వాళ్ళు చేసే పనులలో కాస్త నిర్లక్ష్యం పెరిగింది ఇంకా అతనికి మెడిసిన్ లో ఇస్తున్న విశాల్ భార్య పొరపాటున ఒక మెడిసిన్ బదులు ఇంకో మెడిసిన్ ఇచ్చు ఉండవచ్చు.. లేదా అయన కి షుగర్ ఉంది అని తెలిసినా కూడా ప్రసాదం అని స్వీట్ ఇచ్చి ఉండచ్చు షుగర్ అని మరిచిపోయి ...లేదా బీపీ ఉన్నాకూడా ఆయిల్స్ అండ్ సాల్ట్స్ ఎక్కువ అయుండచ్చు .... ఐతే ఇదంతా వాళ్ళు తెలిసి చేసిన విషయలు కాదు ... వాళ్ళ నమ్మకమే వాళ్ళచేత చేయించింది ...."

వేణు : " ఇదంతా సరే ఏది ఏమి జరిగిన .... అప్పల నాయుడు గారు అంత కరెక్ట్ గ ఆ డేట్ రోజే ఎలా చని పోయారు అంటావ్ ? ఇది కూడా సైకోలోజి ఏ నా ? "

సత్య : " ఎస్ ఇది కూడా సైకోలోజి ఏ .... ఎలా అంటావా .... నీకు అలారం పెట్టి పడుకునే అలవాటు ఉండే ఉంటుంది కదా .... రోజు లాగా కాకుండ ఎపుడైనా చాల ఇంపార్టెంట్ డే అనుకో ...లాయిక్ ట్రైన్ ఎక్కాలో , లేక జాబ్ జాయిన్ ఆవాల్లో , లేక మీటింగ్ అటెండ్ అవ్వాలో అనుకో .. లేక బంధువుల పెళ్ళికి వెళ్లాలో అనుకో ... ఆ రోజు నీకు అలారం మోగక ముందే నిద్ర లేస్తావ్ ....

ఇది ఎలా జరిగింది ...

అంటే ఆ ముందు రోజ్ నువ్వు నీ బ్రెయిన్ ని ఫీడ్ చేస్తావ్ రేపు ఈ టైం కే లేవాలి ఈ టైం కి లేవాలి అని .... సో నీ బ్రెయిన్ ... నువ్ నిద్ర పోతున్నప్పుడు కూడా వర్క్ చేస్తూ నిన్ను కరెక్ట్ అదే టైం కి లేపుతుంది .... అలాగే అప్పల నాయుడు గారు కూడా తన బ్రెయిన్ ని అలా ఆ డేట్ కి ఫిక్స్ అయ్యి పోయారు మెంటల్ గా ప్రిపేర్ అయ్యి పోయారు

రేపు న లాస్ట్ డేట్ అని సో ....కరెక్ట్ ఆ టైం కే అతని ప్రాణం గుండె ఆగి పోయినాయి ..."

వరుస సంఘటనలు జరిగిన తరువాత అనుకోకుండా విశాల్ తండ్రి అప్పల నాయుడు గారు కూడా ఆ డేట్ ని అంత బాగా నమ్మారు కాబట్టి   

అలా కాన్సెప్ట్ విన్నాక ఎసై వేణు వేరే దారి లేక ప్రత్యక్ష సాక్షి లేక ... ఇది "నాచురల్ డెత్ "అని కంఫర్మ్ చేస్తూ కేసు క్లోజ్ చేసారు .

WRITER : Harish 9902015746

#harishsworld

Harish Babu

59 ) మున్నా గాడి దీపావళి

 మున్నా గాడి దీపావళి 


--------------------------------


ఆ రోజు స్కూల్ కి నాలుగు రోజులు సెలవలు అని ప్రకటించారు . దీపావళి కి అని రెండు రోజులు ఆ తరువాత శని ఆది వారలు కావటం తో వరుసగా నాలుగు రోజులు సెలవలు ప్రకటించారు


పిల్లలు అంతా ఆనందం తో అరుస్తూ గేట్ బయటకు వస్తున్నారు మున్నా మాత్రం తన తల్లి నేర్పిన బలవంతపు డిసిప్లిన్ మూలంగా తన సంతోషాన్ని వ్యక్తం చేయకుండా నడుస్తున్నాడు .


మరుసటి రోజు దీపావళి కావటం చేత ఇంటి చుట్టుపక్క పిల్లలు ఆ రోజు నుంచే టపాసులు కలుస్తూ ఆనందిస్తున్నారు .. అది చూసి మున్నా తాను కూడా ఆలా కాల్చి మజా చేయాలనుకున్నాడు కానీ తన తల్లి నేర్పించిన క్లాస్ హ్యాబిట్స్ మూలంగా .. చుట్టుపక్క పిల్లలతో కలవకూడదు మనం వేరు వాళ్ళు వేరు అని ముద్రించుకు పోయి ఉండటం చేత .. ఇంట్లోనే బుక్ పట్టుకు కూర్చున్నాడు


తీరా దీపావళి రానే వచ్చింది . ఆ రోజు రాత్రి వాళ్ళ అమ్మ అందంగా ముస్తాబు అయ్యి దీపాలు అలంకరించటం లో నిమగ్నం అయ్యింది .. కానీ మున్నా మనసులో ఏమి ఉందొ తెలుసుకోవాలని అనుకోలేదు ..ఎప్పటిలాగే కన్స్ట్రక్షన్ సూపర్ వైసార్ గా పని చేసే వాళ్ళ నాన్న పండగ రోజు రాత్రి అయినా ఇంకా పని నుంచి ఇంటికి రాలేదు ..


వాళ్ళ నాన్న ఏయ్ టైం కి వచ్చిన మున్నా కి పట్టింపు లేదు కానీ .. దీపావళి రోజు అందరు .. ఆలా టపాసులు కలుస్తూ ఉంటె చూస్తూ కూర్చోవటం చాల ఇబ్బంది గ ఉంటుంది మున్నా కి ... ఆ విషయం వాళ్ళ అమ్మకు కానీ వాళ్ళ నాన్నకు కానీ పట్టదు ..


మరి తన బాధను ఎవరికీ వ్యక్తం చేయాలి ..

రాత్రి తొమ్మిది దాటాక వాళ్ళ నాన్న టపాసులు , స్వీట్స్ తో ఇంటికి వచ్చాడు ... 

ముభావంగా కూర్చున్న మున్నా తో "రా రా కాల్చుకో "..అన్నాడు ...


ఒక్కసారి గబగబా వచ్చి ఆ టపాసులు ఉన్న కవర్ ని విసిరి అల్లంత దూరాన విసిరేసాడు ..

అనుకోకుండా జరిగిన ఆ హఠాత్ పరిణామానికి అమ్మ నాన్న ఇద్దరు ఉలిక్కి పడ్డారు ..


వాళ్ళ అమ్మ సరోజ కొట్టటానికి చేయి ఎత్తింది " కొడతావు అంతే కదా" అన్నాడు మున్నా

వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి "ఏమైంది రా నాన్న ఆలా విసిరేసావు " అన్నాడు 

"లేకపోతె ఏంటి నాన్న ప్రతి సంవత్సరం ఇంతే ...దీపావళి అని ఎంతో ఆత్రుత తో ఎదురు చూస్తాను .. కానీ మీరు దీపావళి అయిపోయాక వస్తారు .. పోనీ ఫ్రెండ్స్ తో వెళ్తాను అంటే వేళ్ళ నివ్వరు .. చుట్టుపక్కల వాళ్ళు అంత ఆలా ఎంజాయ్ చేస్తుంటే నాకు మాత్రం ఉండదా ...నేను ఆ ఆనందాన్ని అనుభవించాలని ...పోనీ మనకి ఏమైందా డబ్బు లేదా అంటే బోలెడంత ఉంది ...లేనిదల్లా మనసే ..." అన్నాడు .


దానికి వాళ్ళ నాన్న వాడిని గట్టిగా పట్టుకొని ... "నీ మనసు అర్థం చెస్కోలేకపోయాం నాన్నా..ఈసారి నుంచి ...మనం రెండు రోజుల ముందు నుంచే దీపావళి చేసుకుందాం సరేనా " అన్నాడు ...వాడి కంట్లో నుంచి రెండు కన్నీటి చుక్కలు కారాయి ...


#harishsworld


Writer Harish Babu 9902015746

58 ) ఏజ్డ్ లవ్

 -----------------------------------------------------------

ఏజ్డ్ లవ్ 

------------------------------------------------------------


రోజులాగానే ఆ రోజు కూడా మార్కెట్ దగ్గర బస్సు దిగింది ప్రభావతి. ఆఫీస్ నుండి సాయంత్రం ఇంటికి వస్తూ సరుకులు తెచ్చుకునే అలవాటు తనకి.  


కూరగాయలు ఏరటం లో నిమగ్నం అయిపోయిన ప్రభావతి ..." ఏమే ప్రభ ఎలా ఉన్నావ్ ?" అన్న అరుపుకి ఈ లోకం లోకి వచ్చింది ...


తన కళ్లద్దాలు ఎత్తి చుసదును కదా ...ఎదురుగా తన పాత ఫ్రెండ్ "రమ్య " కనపడి0ది


రమ్య కి ఇప్పుడు కాస్త జుట్టు తెల్లబడింది , లావెక్కింది , కళ్లద్దాలు , హ్యాండ్ బాగ్ ...కానీ మనిషిని పోల్చుకోవటం పెద్ద కష్టం కాలేదు ప్రభ కి ..


"ఏంటే ........రమ్య ఎలా ఉన్నవే .. " అని ప్రభ కూడా అరిచింది  


ఆ అరుపుకి మార్కెట్ లో వాళ్ళందరూ వీళ్లని చూసి బిత్తర పోయారు ..


    ప్రభావతి నోటికి చేతులు అడ్డం పెట్టుకుని


 " రావే మా ఇంటికి వెళ్దాం" అని రమ్య ని పట్టుకొని ఇంటికి తీసుకెళ్లింది ప్రభ


ఇద్దరు ప్రభ ఇంట్లో కూర్చుని కాఫీలు అయ్యాక ...

కాస్త మిక్చర్ చిన్న గిన్నెలో ఇద్దరికీ తీసుకొని వచ్చింది ప్రభావతి


 ఇద్దరూ కుశల ప్రశ్నలోకి దిగారు ...


"ఇప్పుడు చెప్పవే రమ్య ..ఎక్కడ ఉన్నావ్ ఏ0 చేస్తున్నావ్" మిక్చర్ నోట్లో వేసుకుంటూ అడిగింది ప్రభావతి


" ఈ మద్యే ఈ ఊరు ట్రాన్సఫర్ అయ్యాను... నేను మా వారితో ఇక్కేడే ఉంటున్నా0 ... 

పిల్లలంతా usa లో సెటిల్ అయ్యారే ... ఈమద్యే ఆయన రిటైర్ ఐపోయారు ..

నాకు ఇంకా నాలుగేళ్లు సర్వీస్ ఉందే ...

నీ గురించి చెప్పవే" అంది కాస్త మిక్చర్ స్పూన్ తో తీసుకుంటూ ..


 ప్రభ చెప్పటం మొదలు పెట్టి0ది


"నేనా.... నేను ఇక్కడే చిన్న ఉద్యోగం చేస్తున్నాను మా పిల్లలు యూఎస్ లో కాదు కానీ ఈ ఇండియాలోనే వేర్వేరు ప్రాంతాల్లో ఉంటున్నారు మా హస్బెండ్ ఈమధ్య నోటి కాన్సర్ తో చని పోయారు" .. అని చెప్పింది


"అయ్యో అలాగా మరి ఇపుడు ఇలా ఒంటరి గానే ఉంటున్నావా " .. మళ్లీ అడిగింది రమ్య


"అవును" అంది ప్రభావతి


"పోనీ కొడుకు దగ్గర కు ఏమైనా వెల్లక పోయావా ?"


"ఒకసారి చుట్టం చూపుకు వెళ్లాను కానీ అంత కంఫర్ట్ అనిపించలేదే ...వచ్చేసాను" అని చెప్పింది ప్రభావతి


"మరి ఈ ఏజ్ లో సింగల్ ఉండాలంటే కష్టమే కదే ...

ఎవరైనా చుట్టాలు కానీ తెల్సినవాళ్ళు కానీ చుట్టుపక్కల ఉన్నారా హెల్ప్ చేయటానికి"


"ఆ ...అంత అవసరం ఏమి రాదు కానీ ... మరీ ఎమర్జెన్సీ అనుకుంటే .. మా ఆఫీస్ లో గోవింద్ అని ఒక అతను దగ్గర్లో ఉంటాడు..... అతని భార్య ఎప్పుడో చనిపోయింది ....ఇద్దరు ఆడపిల్లలు పెళ్లిళ్లు అయిపోయాయి ...ఇప్పుడు ఒక్కడే ఉంటున్నాడు...ఎప్ఫుడైనా ఏదైనా హెల్ప్ కావాలంటే వస్తుంటాడు ..." చెప్పింది పద్మావతి


 ." సరేనే నేను వచ్చి చాలా సేపు అయింది. ఇంక వెళ్తాను మనం ఇప్పటి నుంచి రెగ్యులర్ గా టచ్ లో ఉన్దాము ఓకేనా " అని లేచింది రమ్య


ఇ0టికి వచ్చినప్పటినుంచి రమ్య ఆలోచనలన్నీ ప్రభావతి గురించే.... భర్త పిల్లలు లేకుండా ఒంటరిగా ఎలా ఉంటుందా అని...


అప్పటినుండి ప్రభ రమ్య మధ్య రాకపోకలు జరుగుతూ ఉన్నాయ్ ..


 సాధారణంగా సాగుతున్న లైఫ్ లో అనుకోకుండా ఒక రోజు


ప్రభావతి ఇంట్లో ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయింది ఎవరూ లేపే వాళ్ళు లేరు 


మధ్యాహ్నం వరకు ప్రభావతి గారు ఆఫీసుకు రాలేదు ఏంటని గోవిందు ప్రభావతి ఇంటికి వెళ్ళాడు కళ్లు తిరిగి పడిపోవడం చూసి వెంటనే అంబులెన్స్ కి ఫోన్ చేసి తనని హాస్పటల్లో జాయిన్ చేశాడు .


..డాక్టర్లు " ఏమీ లేదు.... బి పీ తక్కువగా ఉంది ....రెస్ట్ బాగా అవసరం" అని చెప్పారు


తన గురించి అందరూ మర్చిపోతే గోవిందు గుర్తుపెట్టుకుని తనని హాస్పిటల్ లో చేర్చి ఎంత ఆప్యాయంగా చూసుకున్నా డే అని ప్రభావతి చాలా సంతోషించింది


బెడ్ పైన పడుకున్న ప్రభావతి నీ చూడటానికి డాక్టర్ వచ్చాడు మందులు చీటీ రాసి 


"ఈ మందులు వాడితే బీపి కంట్రోల్ లో ఉంటుంది" అని చెప్పాడు 


వెంటనే గోవిందు చీటీ పట్టుకుని మందుల షాపు పరుగెట్టటం చూసింది ప్రభావతి


 రెండు రోజుల తర్వాత డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకెళ్లారు టిఫిన్ తీసుకు వస్తాను అని చెప్పి బయలుదేరుతున్న గోవిందుని 


"ఒక నిమిషం గోవిందు..." అని ఆపింది ప్రభావతి


" నేను అపస్మారక స్థితిలో ఉన్న అని నీకెలా తెలిసింది" అని అడిగింది


" మీరు మధ్యాహ్నం వరకు ఆఫీస్ కి రాకపోయేసరికి ఏదో మనసు కీడు శంకించింది మీరు కూడా నాలాగే ఒంటరి పక్షి కదా ఏమై ఉంటుందా కనుక్కుందామని ఇటువైపు వచ్చాను ...నేను అనుకున్నట్టే జరిగింది.. వెంటనే ఆలోచించకుండా హాస్పటల్ లో చేర్పించాను "


 "గోవిందు నువ్వు అంత దూరం నుంచి వచ్చావా... కన్నపిల్లలు... పక్కింటి వాళ్ళు ...పట్టించుకోని ఈ రోజుల్లో నువ్వు టైం కు వచ్చి చాలా సహాయం చేసావ్ అసలు అసలు నీ లాంటి వాడు ఇంటి పక్కనే ఉంటే బాగుంటుంది... నువ్వు ఎందుకు మా ఇంటి పక్కకి మారకూడదు..." అని అడిగింది ప్రభావతి


" మేడం నాకు మీ ఇంటి పక్కకు మారటానికి ఈ ప్రాబ్లం లేదు... కానీ చూసేవాళ్ళకు బాగోదు మన మనసులు స్వచ్ఛంగా ఉన్నా....చుట్టూ ప్రపంచం మనసు అంత స్వచ్ఛమైనది కాదు మేడం మీరు మరోలా అనుకోకపోతే.... నేను మీకు కడదాకా తోడుగా ఉండాలని ఉ0ది.... తోడుగా అంటే మరో ఉద్దేశంతో కాదు కేవలం.... తోడుగా అంటే నేను అంటున్న విషయం మీకు అర్థమైంది అనుకుంటున్నాను ....మీ ఆరోగ్యం జాగ్రత్త ...నేను వెళ్లి వస్తాను మేడం" అని చెప్పి గోవిందు వెళ్ళిపోయాడు


ఏమి చేయాలో అర్ధం కానీ ప్రభ రమ్య సలహా కోసం ఫోన్ చేసింది ... జరిగిన విషయం అంతా చెప్పింది ...


"అవునా ప్రభావతి ఇంత జరిగితే ఫోన్ అయినా చేసి చెప్పలేదు ....అంతేలే నీకు కూడా తెలియని స్థితిలో ఉన్నావు నాకేం ఫోన్ చేస్తావు కదా" అంది రమ్య


" అది కాదే ముందు అసలు విషయం విను అంటూ గోవిందు చెప్పిన మాటల గురించి చెప్పింది నువ్వు ఏం సలహా ఇస్తావు చెప్పు" అని అడిగింది ప్రభావతి స్నేహితురాలిని


"చూడు ప్రభ .. ఇది నీ లైఫ్ .. నీ డెసిషన్... నేను ఏమి చెప్పలేను .. బట్ .. ప్రతి మనిషికి తోడు అనేది అవసరం... అది కూడా ఓల్డ్ ఏజ్ లో మరీ అవసరం ... ..అని మాత్రం చెప్పగలను .. ఉంటా మరి " అని చెప్పి ఫోన్ పెట్టేసింది ..


బాగా ఆలోచించిన ప్రభ , గోవింద్ ప్రపోసల్ ని సరే అని యాక్సెప్ట్ చేసింది ...


 గోవిందుని పెళ్లి చేసుకోవాలని అనుకున్నట్టుగా చెప్పింది గోవింద్ కూడా సరే అన్నాడు 


కానీ పిల్లలు ఏమంటారు... అని జన్కింది... ఇప్పుడు నాలుగేళ్లు 10 ఏళ్లకు ఒకసారి వచ్చే పిల్లల గురించి తను ఆలోచిస్తే తన గురించి ఎవరు ఆలోచింస్తారు.... ఎవరు పక్కన ఉంటారు..... అని అనుకు0ది ప్రభావతి.....


తన లేట్ మ్యారేజ్ ని తన పిల్లలు మొదట కాస్త ప్రతిఘటించినా ఆ తరువాత అందరూ ... యాక్సెప్ట్ చేసారు ...


చివరికి ప్రభావతి లేట్ మ్యారేజ్ ఘనంగానే జరిగింది ...

-------

అయితే తెర వెనుక కథ వేరే ఉంది అని తరువాత తెల్సుకుంది ప్రభ..


తన ఫ్రెండ్ కి తాను హెల్ప్ చేయాలి అని అనుకున్న రమ్య .. గోవింద్ గురించి ప్రత్యక్షంగా పరోక్షంగా ఇంక్విరె చేసింది .. 

గోవింద్ కి కూడా ఎవరు లేని ఒంటరి పక్షి అని మంచివాడు అని తెల్సుకోంది


గోవింద్ ని డైరెక్టుగా కలిసి తనను తాను పరిచయం చేసుకుని మాట్లాడింది కూడా అట


"గోవింద్ నువ్వెందుకు ప్రభని పెళ్లి చేసుకోకుకూడదు .. లేటు వయసులో తోడు అనేది ఇద్దరికీ అవసరం. ఈ వయసులో పెళ్లి అనేది తోడు కోసం ...సమాజం కోస.. నువ్వే ఆలోచించు .. ధైర్యం చేసి ఒక అడుగు ముందుకు వేయి మిగతాది నేను చూసుకుంటాను ప్రభా తప్పకుండా ఒప్పుకుంటుంది ... అంత మంచే జరుగు తుంది " అని చెప్పిందట 


ఆ విషయం పెళ్లయ్యాక గోవింద్ ఏ చెప్పాడు


ఆలా ప్రభ కథ సుఖంతం ఐంది ..


#harishsworld 

 

Harish Babu (9902015746)

57 ) సారీ ..నాకు గుర్తు రావట్లేదు ..(కథ )

 సారీ ..నాకు గుర్తు రావట్లేదు ..(కథ )

******************************************

  హబ్బ. !!! ఇవాళ ఫ్రైడే . కాస్త రిలాక్స్ అవచ్చు అని తన ఆ వీక్ వర్క్ అంతా ముగించుకొని లాప్టాప్ మూసేసి బెడ్ పైన వాలాడు ప్రశాంత్ ..

ఎంత సేపు కళ్ళు మూసినా నిద్ర పట్టక పోయేసరికి ఫోన్ తీసి ఎవరికీ కాల్ చేద్దామా అని 

కిరణ్ కి ఫోన్ కలిపాడు 

మూడు సార్లు రింగ్ ఐంది కానీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు కిరణ్

సరే అని మెసేజ్ పెట్టాడు "కాల్ మీ బ్యాక్ " అని

కిరణ్ తన జాబ్ వదిలేసి ఈ మధ్య ఖాళీ గానే ఉంటున్నాడు.. ఎపుడైనా ఫ్రీ టైం ఉన్నపుడు ప్రశాంత్ కాల్ చేస్తే వచ్చి కలిసే వాడు ..

కాల్ బ్యాక్ అని ఇచ్చినా రెండు రోజులైనా రెస్పాన్స్ లేదేంటా అని అనుకున్నాడు ప్రశాంత్

ఒక రెండు నెలల తరువాత మళ్ళి కాల్ చేసాడు ప్రశాంత్ కిరణ్ కి 

కానీ మళ్ళి ఎత్తలేదు ....కాల్ బ్యాక్ చేయలేదు

అలా దాదాపు ఆ రోజు ఒక పదహారు సార్లు ట్రై చేసాడు కానీ కిరణ్ ఫోన్ ఎత్తలేదు తిరిగి చేయలేదు

కానీ ఒక రోజు అనుకోకుండా ఒక సూపర్ మార్కెట్ ఎదురుంగా కలిసాడు కిరణ్ ని 

"అరేయ్ ఏంట్రా ఎన్ని సార్లు ఫోన్ చేసిన లిఫ్ట్ చేయలేదు " 

అని అడిగితె 

"అవునా నాకేం కాల్ రాలేదు రా" అని చెప్పాడు కిరణ్ 

"సరే " అని ఇంకా ఎక్కువ వాదించటం అనవసరం అని అనుకోని ఇంటికి వచేసాడు ప్రశాంత్

మా ఇద్దరి మధ్య ఏ గొడవ లేదు ..ఏ మనస్పర్థలు లేవు మరి కాల్ లిఫ్ట్ చేయక పోవటానికి .. కాల్ బ్యాక్ చేయక పోవటానికి గల కారణం ఏమి అయి ఉంటుందా అని అనుకున్నాడు ప్రశాంత్

------------

రోజులు మెల్లగా దొర్లుతున్నాయి ..వారలు నెలలు గా ,నెలలు ఏళ్లుగా గడిచి ఆరు ఏళ్ళు గడిచాయి ..

కిరణ్ బాగానే జాబ్ లో సెటిల్ అయ్యాడు అని తెలిసింది .

కానీ ఇప్పటికి నాతో టచ్ లో ఉండట్లేదు అని తెలుసుకున్నాడు ప్రశాంత్ 

ప్రశాంత్ ఒకరోజు తన రూమ్ ఫ్రెండ్ వినోద్ తో ఒక పెళ్లి లో భోజనం చేస్తున్నాడు ..

ఇంతలో "హాయ్ రా ప్రశాంత్ .." అని ఎవరో పీల్చినట్టు అనిపించి వెనకకు తిరిగాడు 

తిరిగి చుస్తే కిరణ్ ..

వెంటనే "ఏంట్రా కిరణ్ ...ఎన్నిసార్లు ఫోన్ కూడా చెయ్యట్లేదు ... " అని చాల చాల అడిగేయాలని అనుకున్నాడు ...కానీ అలా కాకుండా 

"హాయ్ ఎవరూ ...సారీ గుర్తుపట్టలేదు .." అన్నాడు 

"నేను రా సాయి కిరణ్ ని ..."

"నేను నీకు తెలుసా..."

"అవును రా ..మేము టీచర్స్ కాలొనీ లో ఉండే వాళ్ళము కదా ..గుర్తుపట్టలేదా "

"ఓహో ...అవును ఒక ఫ్రెండ్ ఉండే వాడు ..ఆ నువ్వేనా ...ఇంతకీ నీ పేరేంటి .."

ఇదంతా వినోద్ వింతగా చూస్తున్నాడు 

"సాయి కిరణ్ ..రా !"

"ఓకే ...ఏమో డోంట్ మైండ్ ...ఇంకా నేను నిన్న గుర్తుపట్టలేదు..చెప్పు ఏంటి పని..."

కాస్త ఖంగు తిన్న వాడిలా అయిపోయాడు కిరణ్ 

"ఎం లేదు మళ్ళి వస్తాను ..."అని చెప్పి అక్కడి నుంచి వెళ్లి పోయాడు.. 

వాడి వెళ్ళిపోయాక ప్రశాంత్ ని వినోద్ అడిగాడు ..

"అదేంట్రా వాడు నీకు తెలుసు కదా ...అలాగ అన్నావు ఏంటి"

"హ్మ్మ్ ......వాడికి మనం గుర్తు లేనపుడు ... మనని గుర్తు చేసుకోనప్పుడు .. మనము కూడా వాడిని గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ... 

ఎన్ని సార్లు ఫోన్లు చేసినా ఎత్తనివాడు ఇపుడు ఎదో ఫార్మాలిటీ కోసం ఎందుకు అట ఈ పలకరింపు .....

  ... ఇక ఎప్పుడూ వాడు మళ్ళీ నన్ను డిస్టర్బ్ చేయడు .... 

పద అక్కడ వెళ్లి ఐస్క్రీమ్ తీస్కుందాం..అని చెప్పి ముందుకు నడిచాడు ప్రశాంత్

#harishsworld

**** అది కథ ****

94 ) రోలింగ్ టైటిల్స్.. కథ :

  రోలింగ్ టైటిల్స్.. కథ :  ~~~~~~~~~~~~~~~~~~~ గగన్ ఒక మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్. గొంతులో వైవిధ్యం, పాత్రకు తగ్గట్టుగా ప్రాణం పోయగల ప్రతిభ అతన...