Saturday, August 15, 2026

52) వైరం.. కథ

 వైరం.. కథ 

~~~~~~~~~

(ఓ. హేన్రి రాసిన కథ క్లుప్తంగా.. ) 


సామ్, కాల్ అనే ఇద్దరు ఫ్యాక్షన్ కుటుంబాలకు చెందిన వ్యక్తులు ఒక మారు మూల కొండ ప్రాంతాల్లో ఉండేవారు.. 


ఇద్దరి కుటుంబాల్లో నూ ఒకరి కుటుంబం పైన ఒకరు పగ బట్టి చంపుకున్నారు.. ఇక మిగిలంది వీరు ఇద్దరే.. 


ఎవరు చంపితే వారే గెలిచి నట్టు.. ఒకరి కోసం ఒకరు చాలా రోజులు వెతుక్కున్నారు.. 

కానీ కొంత కాలం అక్కడి పంటలు పండక.. సామ్ అనే అతను సిటికి వెళ్ళిపోయాడు.. 


సిటీ లో చాలా ఇబ్బంది పడ్డాడు.. ఇక్క్కడ అంతా స్క్వేర్ గా ఉండటం గమనించాడు.. వాళ్ళ ఊరిలో కొండలు చెరువులు మనుషులు అందరు సర్కిల్ గా అంటే కలిసి ఉండేవారు... ఇక్కడ అందరు స్క్వేర్ అంటే ఎవరి మొహం ఎవరూ చేసుకోరు.. రోడ్స్, బిల్డింగ్స్, బోర్డ్స్ అన్ని స్క్వేర్ గా నే.. 


చాలా కాలం ఒంటరి తనం అనుభవించాడు సామ్.. పలికే దిక్కు పలకరించే సమయం మనుషుల దగ్గర లేదు.... 


ఇలా ఉండగా.. సామ్ సిటీ లో ఉన్నాడు అని తెలుసుకొని కాల్ సిటీ కి వచ్చాడు.. వెతికి వెతికి చివరికి ఒక చోట దొరికాడు.. చెట్టు వెనకాల దాక్కుని.. కత్తి తో రెడీ గా ఉన్నాడు.. 


సామ్ వస్తూనే చెట్టు చాటు నుంచి బయటకు వచ్చాడు.. కాల్ 


కానీ సామ్ అతన్ని చూస్తూనే ఆత్మీయంగా హత్తుకున్నాడు....  

 "కాల్ మొత్తానికి నువ్వైనా కనపడ్డావు.." అని ఆనంద పడ్డాడు.. కాల్ తన కత్తి కింద పడేసాడు 


తను అన్ని రోజులు అనుభవించిన ఒంటరి తనాన్ని మర్చిపోయాడు సామ్ 


*** "సందర్భాలు పరిస్థితులు మనిషిని మనిషిని స్నేహితుడు గాను శత్రువు గాను మార్చేస్తాయి" **** అని ఈ కథ చెప్తుంది...

50 ) అండ్ ఫస్ట్ ప్రైజ్ గోస్ టూ

 అండ్ ఫస్ట్ ప్రైజ్ గోస్ టూ 

~~~~~~~~~~~~~~

మళ్ళీ వట్టి చేతులతో.. వచ్చిన అబ్బాయి ని చూసి.. కాస్త వెటకారం గా నవ్వారు తల్లి తండ్రులు...

-----

 మూడోసారి పాటల పోటీలో పాల్గొంటే, అసలు లిస్టులోనే అతని పేరు లేదని బ్యాక్‌స్టేజ్ సిబ్బంది తేల్చిచెప్పారు.


ప్రతిసారి కాలేజీలో గెలిచానని ఇంట్లో గొప్పగా చెప్పుకోవడం, తీరా బహుమతి లేకుండా ఖాళీ చేతులతో వెళ్లడంతో తల్లిదండ్రులు అతన్ని నమ్మలేదు. "నువ్వు అబద్ధాలు చెబుతున్నావు" అని గేలి చేస్తూ తిట్టడం మొదలుపెట్టారు. 

 


తను పోటీలో పాల్గొనటం నిజం.. గెలిచింది నిజం.. బహుమతి ఇవ్వక పోవటం నిజం.. 

ఒకరిని నమ్మించాలసిన అవసరం నాకు లేదు అనుకున్నాడు


అంతర్ముఖుడైన (Introvert) వ్యక్తికి తనను తాను సమర్థించుకోవడం, లేక వాదించటం కంటే తనలో తాను మదనపడటమే ఎక్కువ ఇష్టపడతాడు . ప్రకాష్ స్థితి కూడా సరిగ్గా అదే. అతని అంతర్మథనాన్ని ఈ క్రింది విధంగా వర్ణించవచ్చు:


"నేను గెలిచాను అన్న సంతోషం కంటే, నా వాళ్ళు నన్ను నమ్మడం లేదన్న బాధే నన్ను ఎక్కువగా దహించివేస్తోంది. బయట ప్రపంచం నన్ను గుర్తించకపోవడం ఒక ఎత్తు అయితే, కన్నతల్లిదండ్రులు నన్ను ఒక అబద్ధాలకోరులా చూడటం అసలు భరించలేకపోతున్నాను."


"నేను నిజమే చెబుతున్నాను అని గొంతు చించుకుని అరిచి చెప్పాలని ఉంది. కానీ, ఆ గొడవ చేసే శక్తి నా దగ్గర లేదు. నా మౌనాన్ని వాళ్ళు అసమర్థత అనుకుంటున్నారు. గెలిచిన వాడిలా తలెత్తుకుని తిరగాల్సిన నేను, దొంగలా తలదించుకుని తిరుగుతున్నాను. నా కష్టం వారికి కనిపించడం లేదు, కేవలం ఆ చేతిలో ఉండాల్సిన బహుమతి మాత్రమే కనిపిస్తోంది."


"సరే! ఇక ఎవరినీ నమ్మించాల్సిన అవసరం నాకు లేదు. ఈ ప్రపంచానికి నా గెలుపు ఒక పత్రమో, ఒక షీల్డో అయితే... అవి నా దగ్గర ఉండాలి. ఆ కష్టం నాది, ఆ ప్రతిభ నాది. గుర్తింపు ఇవ్వడం కాలేజీ బాధ్యత, కానీ అది వారు చేయనప్పుడు నా గుర్తింపును నేనే గౌరవించుకుంటాను."

 

ఆ అవమానం భరించలేక, ఒక రోజు ప్రకాష్ తన దగ్గరున్న పిగ్గీ బ్యాంక్ పగలగొట్టి డబ్బు బయటికి తీసాడు. దగ్గరలో ఉన్న గిఫ్ట్ షాప్ వైపు నడక సాగించాడు. 


ఆ డబ్బుతో ఆ గిఫ్ట్ షాపులో " మూడు షీల్డ్స్" కొనుక్కున్నాడు.


తన కష్టానికి ప్రతిఫలం కాలేజీ ఇవ్వకపోయినా, అది తన హక్కే అని భావించి తన పేరు మీద ఆ మొమెంటోలను షోకేసులో పెట్టుకున్నాడు. అది తప్పో ఒప్పో అతనికి తెలియదు కానీ, ఆ క్షణం ఆ షీల్డ్స్ చూస్తుంటే ప్రకాష్‌కు

Wednesday, July 8, 2026

51) కాలం కరిగింది.. కథ

 


కాలం కరిగింది.. కథ 

~~~~~~~~~~~~~

✍️ హరీష్ బాబు 


బహుశా నాలాగే మీలో చాలా మందికి కలిగిన అనుభవమే చెప్తాను 

అవి మేము ఇంటర్ చదివే రోజులు 

సిటీ లో ఒక చిన్న సొంత్తిల్లు ఉంది.. పైన మేము ఉంటూ కింద పోర్షన్ రెంట్ కి ఇచ్చాము.. 


ఆ ఇంట్లోకి ఒక ఫ్యామిలీ వచ్చారు.. ఆయన పేరు సుమన్ వాళ్ళావిడ సుజాత.. చిన్న పాప పేరు దివ్య.. 


సుజాత ఆంటీ ఎప్పుడు పైకి కిందకి తిరుగుతూ ఉండేది.. మా అమ్మకు బాగా కాలక్షేపం.. ఎంత క్లోజ్ అయిపోయారంటే.. వాళ్ళ అక్క వాళ్ళ పిల్లలు అందరు మా ఇంట్లో నే కూర్చుని మాట్లాడుకునే అంత... 


అయితే కథ.. ఆవిడ గురించి కాదు ఆ అమ్మాయి దివ్య గురించి.. 

దివ్య కి రెండేళ్లు.. చిన్నగా బొద్దుగా బోబ్ కటింగ్ తో ముద్దుగా ఉండేది.. 

పొద్దున్న సండే వస్తే కింద ఎండలో కుర్చీలు వేసుకుని మెట్ల మీద ఏవో ఒక కబుర్లు దొర్లుతూ ఉండేవి మా అమ్మ వాళ్ళకి.. నేను ఆ దివ్య ను ఆడిస్తూ ఉండే వాడిని.. 

బుడ్డి బుడ్డి చేతుల మీద.. పెన్ తో దివ్య అని రాసేవాడిని.. ఆ పాప వెళ్లి వాళ్ళ అమ్మతో 

"అన్న దియ్య పెట్టింది " 

అంటుంటే నవ్వుకిందే వాళ్ళం.. 

***** ****

కొంత కాలానికి వాళ్ళు వేరే ఇంటికి షిఫ్ట్ అయిపోయారు 

కానీ రాకపోకలు.. దారిలో కలిస్తే పలకరింపులు కొనసాగేవి.. కానీ ఆ పాప ని ఎప్పుడు చూడలేదు 

*** 


కొంత కాలం అంతే ఒక పదిహే్నేళ్ల తరువాత.. 

నేను ఒక ఒక చిన్న ఫ్లాట్ కొన్నాను అక్కడే దగ్గర్లో.. రెంట్ కి ఇద్దామని.. 


. ఎవరు మీరు అని అడిగితే అర్ధం కాలేదు.. ఇల్లు కావాలి అని ఫ్లాట్ మీద నంబర్స్ చూసి.. సరే తీస్కోండి అని ఇచ్చాము.. అడ్వాన్స్ ఇవ్వటానికి ఇంటికి వచ్చినప్పుడు ఆశ్చర్యం.. యాదరుచికంగా.. మళ్ళీ వాల్లే ఫోన్ చేశారు.. ఆ తరువాత వాళ్ళు మా ఫ్లాట్ లో కి షిఫ్ట్ అయ్యారు.. 



కొద్దీ రోజుల తరువాత నాకు కూతుహలంగా మొదలయింది.. పదిహేను సంవత్సరాలు కింద చుసిన పాప ఇప్పుడు ఎలా ఉందా అని.. 


నెల తరువాత.. రెంట్ కోసం అని మా ఫ్లాట్ కి వెళ్ళాను.. డోర్ కొడితే.. వాళ్ళ అమ్మాయి డోర్ ఓపెన్ చేసింది.. అదే మొహం.. ఎం మారలేదు..


కానీ ఒకటే మారింది.. 

"ఎవరు మీరు" అని అడిగింది.. అది నిజమే మనకి వాళ్ళు గుర్తుంటారు కానీ పిల్లలకు మనం గుర్తుంటామా.. 


మునుపటి ఆనందం, కళ ఆ పాప మొహంలో కనపడలేదు.. ఎప్పుడు సీరియస్ గా కనపడేది.. 

నా కూతుహలం అంతా నీరు గారిపోయింది.. 

వెనక్కి వచ్చేసాను.. 

~~~~~~~~~~~

సమాప్తం 


Tuesday, July 7, 2026

54) దారులు దూరమైన వేళ

 దారులు దూరమైన వేళ

~~~~~~~~~~~~~

✍️హరీష్ బాబు 




శరణ్య ఫోన్ మోగింది. అవతలి నుంచి ప్రణయ్ గొంతు వినిపించింది.


"హాయ్ శరణ్య.. ఎలా ఉన్నావు?" అని అడిగాడు ప్రణయ్.


"హాయ్ ప్రణయ్, బాగున్నాను. నువ్వు ఎలా ఉన్నావు?" అని శరణ్య సమాధానమిచ్చింది.


"ఏంటి, ఈ మధ్య ఆఫీసుకి రావడం లేదు?" అని ప్రణయ్ అడిగాడు.


"తర్వాత చెప్తాలే ప్రణయ్," అంటూ శరణ్య మాటను దాటవేసింది.


ప్రణయ్‌కి ఏమీ అర్థం కాలేదు. "సరే కానీ, నా పెళ్లి విషయం గుర్తుంది కదా? రేపు ఆదివారం, తప్పకుండా రావాలి. ఆఫీసులో చెప్పలేకపోయాను, అందుకే ఫోన్ చేశాను. నువ్వు, నీ ఫ్యామిలీతో కచ్చితంగా రావాలి, ఓకేనా?" అని ప్రణయ్ అడిగాడు.


"ఓకే, ఓకే తప్పకుండా వస్తాలే. సరే మరి బాయ్," అని శరణ్య ఫోన్ పెట్టేసింది.

కానీ పెళ్లి రోజు అందరూ వచ్చారు, శరణ్య మాత్రం రాలేదు. ఎందుకు రాలేదో ప్రణయ్‌కి అస్సలు అర్థం కాలేదు.


ప్రణయ్, శరణ్య ఆఫీసులో మంచి మిత్రులు. లంచ్ టైంలో శరణ్య తన ఇద్దరు కూతుళ్లు చేసే అల్లరి గురించి చెప్పే కబుర్లు ప్రణయ్ ఎంతో ఇష్టంగా వినేవాడు. అలాంటి స్నేహితురాలు పెళ్లికి రాకపోవడం, ఆ తర్వాత ఫోన్ ఎత్తకపోవడం అతడిని కలవరపెట్టింది. 


పెళ్లి తర్వాత రాధతో కొత్త జీవితం మొదలైనా, ఎక్కడో మూలలో శరణ్య ఎందుకు దూరమైందో అన్న ప్రశ్న ప్రణయ్‌ని వేధిస్తూనే ఉంది.


సుమారు ఆరు నెలల తర్వాత, ఒక రోజు హఠాత్తుగా శరణ్య నంబర్ నుండి ఫోన్ వచ్చింది. ప్రణయ్ వెంటనే ఎత్తాడు. అసలు విషయం అప్పుడు తెలిసింది. తన పెళ్లికి వారం రోజుల ముందు శరణ్య ఉద్యోగం కోల్పోయిందని, ఆ బాధలో ఎవరికీ ముఖం చూపించలేక, ఏడుస్తూ అందరికీ దూరంగా ఉండిపోయానని ఆమె కన్నీళ్లతో చెప్పింది.


ఆ మాటలు విన్న ప్రణయ్ మనసు చలించిపోయింది. ఆమెను ఆ బాధ నుండి బయటపడేయాలని నిర్ణయించుకున్నాడు. తన స్నేహితుల సాయంతో ఆమె రెజ్యూమేని కొత్తగా తయారు చేశాడు. అనుభవం లేని చోట, తెలిసిన వారి ద్వారా ఎక్స్‌పీరియన్స్ లెటర్లు ఇప్పించి ఆమె ప్రొఫైల్‌ను పకడ్బందీగా సిద్ధం చేశాడు. అంతేకాకుండా, ఆమె నైపుణ్యం పెంచుకోవడానికి ఏయే కోర్సులు చేయాలో, ఏ ఇన్‌స్టిట్యూట్ బెస్ట్ అవుతుందో వివరంగా మార్గదర్శకత్వం చేశాడు.


చివరికి ప్రణయ్ పడిన శ్రమ ఫలించింది. శరణ్యకు ఒక పెద్ద కంపెనీలో మంచి హోదాలో ఉద్యోగం వచ్చింది.


ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి, ఇద్దరూ ఒక కాఫీ షాప్‌లో కలిశారు. శరణ్య ముఖంలో కొత్త వెలుగు కనిపిస్తోంది. తన సంతోషాన్ని పంచుకుంటూ, ఆ కంపెనీ ఇచ్చిన ఆఫర్ లెటర్‌ను ప్రణయ్‌కి చూపించింది. అతను ఆ లెటర్‌ను ఆసక్తిగా పరిశీలిస్తుండగా, అందులో ఉన్న జీతం వివరాలు చూసి ఒక్క క్షణం నిశ్చేష్టుడయ్యాడు. ఆ జీతం తన జీతం కంటే దాదాపు రెట్టింపు ఉంది. ప్రణయ్ మనసులో ఒక రకమైన అభద్రతాభావం, అసూయ మెదిలాయి.

నిన్నటిదాకా ఉన్న జాలి ఇవాళ అసూయ గా మార్పు చెందింది.


 తన స్నేహితురాలి విజయం పట్ల సంతోషంగా ఉన్నప్పటికీ, ఆ సంఖ్యలు అతడిని లోలోపల కలవరపెట్టాయి.


కానీ ఆ తర్వాతే అసలు మలుపు తిరిగింది. కొత్త ఉద్యోగ బాధ్యతల్లో పడిన శరణ్య, తనను ఆ స్థితికి చేర్చిన ప్రణయ్‌ను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం మొదలుపెట్టింది. ప్రణయ్ ఎప్పుడు ఫోన్ చేసినా "బిజీగా ఉన్నాను, తర్వాత చేస్తాను" అని చెప్పడం, ఆ తర్వాత అసలు తిరిగి కాల్ చేయకపోవడం అలవాటుగా మార్చుకుంది.


ప్రణయ్ ఎన్నిసార్లు ప్రయత్నించినా ఆమె నుండి స్పందన కరువైంది. ఎంతో విలువనిచ్చిన స్నేహం, హోదా మరియు డబ్బు ముందు చిన్నబోవడం చూసి ప్రణయ్ తీవ్ర వేదనకు లోనయ్యాడు.


కొద్ది రోజుల తర్వాత, ప్రణయ్ తన భార్యతో కలిసి ఒక రెస్టారెంట్‌కు వెళ్ళాడు. అక్కడ ఒక మూల టేబుల్ వద్ద శరణ్య తన పాత కొలీగ్ కిరణ్‌తో ఎంతో ఉత్సాహంగా మాట్లాడుకుంటూ కనిపించింది. 


తను ఫోన్ చేసినప్పుడు "బిజీగా ఉన్నాను" అని చెప్పిన శరణ్య, తన పాత పరిచయస్తుడితో అంత సమయాన్ని కేటాయించడం చూసి ప్రణయ్ ఒక్క క్షణం స్తంభించిపోయాడు. ఆ దృశ్యం చూశాక, శరణ్యకు తన పట్ల ఉన్నది కేవలం ఒక అవసరం మాత్రమేనని, తన స్నేహం ఇక ఎప్పటికీ పాత స్థితికి రాదని అతనికి అర్థమైంది.


 కొన్ని బంధాలు కేవలం ఒక దశ వరకేనని, మనుషుల ప్రయారిటీలు మారినప్పుడు పాత బంధాలు ఎంత సులువుగా కరిగిపోతాయో ఆ క్షణం ప్రణయ్ గ్రహించాడు.చివరకు, ప్రణయ్ మౌనంగా ఆ స్నేహానికి స్వస్తి పలికాడు.


 దారులు దూరమైన వేళ, కాలం మరియు హోదా మనుషుల మనసులను ఎంతలా మార్చగలవో ప్రణయ్ పూర్తిగా అర్థం చేసుకున్నాడు.


~~సమాప్తం ~~~


~~~~~~~~~~~~~


Wednesday, June 24, 2026

49...) గాలిలో కలిసిన గర్వం**.. కథ

 Story 



**గాలిలో కలిసిన గర్వం**.. కథ --- (short story about pride of rich )


✍️ Harish babu 


హైదరాబాద్ నుండి ఢిల్లీకి వెళ్తున్న విమానంలో ప్రయాణం సాఫీగా సాగిపోతోంది. ఆ విమానంలో రాఘవరావు అనే ఒక వృద్ధుడు కిటికీ పక్క సీటులో కూర్చుని ఉన్నాడు. ఆయన వేషధారణ చాలా సాధారణంగా ఉంది—మడతలు పడిన పాత కాటన్ చొక్కా, పక్కనే కాళ్ళ దగ్గర ఒక చిన్న సంచీ.

అతని పక్క సీటులో విక్రమ్ సేథి అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి కూర్చున్నాడు. ఖరీదైన సూటు, చేతిలో లెదర్ బ్రీఫ్‌కేస్. విమానం టేకాఫ్ అయినప్పటి నుండి విక్రమ్ తన ఫోన్‌లో బిజినెస్ డీల్స్ గురించి గట్టిగా మాట్లాడుకుంటూ, పక్కనే ఉన్న రాఘవరావును చులకనగా చూస్తూ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నాడు.

"నిజంగా అర్థం కావడం లేదు! విమానయాన సంస్థల ప్రమాణాలు ఎంత పడిపోయాయో చూడండి. ఇలాంటి పేదవాళ్ళని కూడా విమానాల్లో ఎందుకు అనుమతిస్తారో? ఈ సీట్లు ఎంత ఇరుగ్గా ఉన్నాయో.. కనీసం కాలు చాచుకుందామన్నా పక్కన ఎవరో ఒకరు అడ్డుగా కూర్చుని ఉంటారు," అని విక్రమ్ విమర్శించసాగాడు.

రాఘవరావు ప్రశాంతంగా విక్రమ్ వైపు తిరిగి, "బాబు, నీ పేరు ఏమిటి? హైదరాబాద్‌లో ఎక్కడ ఉంటావు? నీకు ఎంతమంది పిల్లలు? వాళ్ళు ఏం చేస్తున్నారు?" అని ఎంతో ఆప్యాయంగా అడిగాడు.

విక్రమ్ చిరాగ్గా, "నా పేరు విక్రమ్. జూబ్లీహిల్స్‌లో ఉంటాను. నా పిల్లలు విదేశాల్లో చదువుకుంటున్నారు. అంతా నా వ్యాపార హోదా వల్లనే," అని గర్వంగా చెప్పాడు. రాఘవరావు చిరునవ్వుతో, "చాలా సంతోషం బాబు. నీ వ్యాపారం ఏమిటి?" అని అడిగాడు.

"నేను రియల్ ఎస్టేట్ వ్యాపారిని. పెద్ద పెద్ద కమ్యూనిటీలు కడతాను," అని విక్రమ్ విర్రవీగాడు. రాఘవరావు తల పంకించి, "మంచిదే కానీ, నీ వెంచర్ల కోసం చాలా చెట్లను నరికేస్తుంటావు కదా?" అని అడిగాడు.

విక్రమ్ ఎగతాళిగా నవ్వి, "అవును, అందులో తప్పేముంది? నా దగ్గర అత్యాధునిక యంత్రాలు ఉన్నాయి. నా మనుషులు ఒక్క రోజులో వంద చెట్లను నేలమట్టం చేస్తారు. డెవలప్‌మెంట్ కావాలంటే ఇవన్నీ తప్పవు!" అన్నాడు.

రాఘవరావు మాట తీరులో ఏ మాత్రం అసహనం లేకుండా, "ఒక్క రోజులో వంద చెట్లను నరకడం చాలా సులభమే బాబు. కానీ, ఒక్క చిన్న మొక్కను పెద్ద వృక్షంగా మార్చడానికి ముప్పై ఏళ్ల కష్టం కావాలి, అది నీకు తెలుసా?" అని నిదానంగా అన్నాడు.

విక్రమ్ కోపంగా, "ఏమిటి నీ ఉచిత సలహాలు? వ్యాపారంలో ఇవన్నీ సహజం!" అని గట్టిగా అరిచాడు. రాఘవరావు ఏ మాత్రం తగ్గకుండా, "వ్యాపారం అంటే కేవలం డబ్బు సంపాదించడం కాదు బాబు. ఈ చెట్లు మన ఆర్థిక వ్యవస్థకు, మన భవిష్యత్ తరాలకు, పర్యావరణానికి చాలా అవసరం. ఒక చెట్టును నరికావంటే, దానికి ప్రతిఫలంగా పది మొక్కలు నాటి, అవి కనీసం మూడేళ్లు బతికేలా జాగ్రత్త తీసుకోవాలి. అప్పుడే మన పిల్లలకి మనం మంచి భవిష్యత్తును ఇస్తాం," అని సున్నితంగా మందలించాడు. విక్రమ్ మాత్రం, "చాలా అయింది నీ సోది! నా లైఫ్ స్టైల్ వేరు, నా ఆలోచనలు వేరు," అంటూ ముఖం తిప్పేసుకున్నాడు.

విమానం ఢిల్లీలో దిగింది. విక్రమ్ అందరికంటే ముందు బయటపడాలని హడావిడి చేస్తున్నాడు. కానీ, విమానం తలుపులు తీయగానే అక్కడ దృశ్యం చూసి విక్రమ్ నోరు వెళ్లబెట్టాడు. పోలీసు అధికారులు, భద్రతా సిబ్బంది సెల్యూట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. విక్రమ్ తను ఏదో పెద్ద సెలబ్రిటీ అనుకుని ముందుకు వెళ్లబోయాడు. కానీ, ఆ అధికారులు అతన్ని పక్కకు నెట్టి, రాఘవరావు దగ్గరకు వచ్చి అత్యంత గౌరవంగా సెల్యూట్ చేశారు.

"సార్, మీ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశాం, రండి," అని అధికారులు వినయంగా చెప్పారు. విక్రమ్ ఆశ్చర్యపోయి, "అతను ఒక సామాన్యుడు కదా, అతనికి ఎందుకు ఇంత గౌరవం?" అని అడిగాడు.

అక్కడ ఉన్న ఒక సెక్యూరిటీ అధికారి విక్రమ్ వైపు తిరిగి, "ఇతను సామాన్యుడు కాదు సార్. ఇతని పేరు రాఘవరావు. అడవి మనిషి (ఫారెస్ట్ మ్యాన్) అని పిలుస్తారు. లక్షకు పైగా మొక్కలను నాటి, ఎడారిలా ఉన్న భూమిని పచ్చని అడవిగా మార్చినందుకు భారత ప్రభుత్వం ఈరోజు ఆయనకు 'పద్మశ్రీ' పురస్కారాన్ని అందజేయబోతోంది," అని చెప్పాడు.

విక్రమ్ ఒక్కసారిగా స్తంభించిపోయాడు. రాఘవరావు ఆ అధికారిని అనుసరిస్తూ వెళ్తూ, వెనుతిరిగి విక్రమ్ వైపు చూసి చిన్నగా నవ్వి, "చూడు బాబు, విమానంలో ఫస్ట్ క్లాస్‌లో ఎవరు కూర్చున్నారనేది చెట్లకు తెలియదు. మనం వెళ్ళేటప్పుడు ఈ భూమి మీద ఏం వదిలి వెళ్తున్నామనేదే ముఖ్యం," అని చెప్పి తన దారిలో వెళ్ళిపోయాడు. తన అజ్ఞానానికి, అహంకారానికి విక్రమ్ సిగ్గుపడి తలదించుకున్నాడు.


-- samaptam - -


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



Here are 50 combined keywords (Telugu and English) for your SEO strategy, formatted as a comma-separated list:

నీతి కథలు, Telugu stories, moral stories in English, స్ఫూర్తిదాయకమైన కథలు, short moral stories, గాలిలో కలిసిన గర్వం, best inspirational stories, పర్యావరణ స్పృహ కథలు, stories about humility, pride and humility story, lessons on arrogance, life lessons from stories, wisdom stories, character building stories, environmental awareness stories, importance of planting trees, nature conservation story, save trees message, climate change inspiration, eco-friendly lifestyle stories, inspiring stories about nature, protecting our environment, sustainability lessons, story about a wealthy businessman, humble person story, the forest man story, story about Padma Shri award winner, unexpected hero story, wealth vs character story, arrogance leads to downfall, story about simple living, true meaning of success, story about flight travel encounter, short stories with a moral lesson, inspirational stories for students, best short stories for personal growth, real-life inspirational stories, English moral stories for kids and adults, stories that change your perspective, powerful short stories about life, learnings from simple people, motivational stories to read, stories about social values, motivational articles, short stories blog, life motivation, success and humility, personal development stories, positive stories, famous moral stories


Sunday, June 14, 2026

44) బిజీ లైఫ్.. కథ

 బిజీ లైఫ్.. కథ 


15jan2026 

~~~~~~~~~~

✍️ హరీష్ బాబు 


      రాత్రి తొమ్మిది అయింది. ఊపిరి తీసుకోకుండా మీటింగ్స్ ఉంటూనే ఉన్నాయ్.. ఏమి వర్క్ ఫ్రొం హోమ్.. ఓ ఏమో కానీ ప్రాణాలు తోడేస్తున్నారు అనిపించింది. పైగా ఈ అజైల్ ప్రాజెక్ట్ అంటే..రాత్రి పడుకునే ముందు ఏమి చేసామో చెప్పాకా.. మళ్ళీ పొద్దున్న ఏమి ఉంటుంది అప్డేట్ స్టేటస్ నా బొంద.. 


   బెదురూమ్ లో నా ఆలోచనల లో నేనుంటే.. కిచెన్ లో ఏదో అలికిడి బినిపిస్తోంది.. 

ఏమిటా అని వెళ్లి చూస్తే మా చిన్ను గాడికి మళ్ళీ మార్కులు తక్కువ వచ్చాయి అని మా ఆవిడ అరుస్తుంది... 


   కాసేపు విన్నాక నేను కూడా కాస్త చెప్పి చూద్దాం అని శృతి కలిపాను... 

"ఏరా చిన్ను.. మీ అమ్మ నే కోసం పొద్దున్న ఇదింటికే లేసి టిఫిన్, బాక్స్ లు అన్ని సిద్ధం చేసి పంపుతోంది.. చదువుకోటానికి ఏంట్రా నొప్పి.. " 


ఆ లాజిక్ కరెక్ట్ కాదు అని నాకు తెల్సు.. కానీ మంచి చెడు చెప్పక పోతే ఎలాగ చేయి జారీ పోతాడేమో అని భయం..


మేము ఇద్దరం నోరు నొప్పి వచ్చేలా అరవటం ఏ కానీ వాడిలో ఏ స్పందన లేదు.. 


*** ****

. ఇది జరిగి వారం అయింది.. మళ్ళీ అవే అరుపులు.. 


చిన్నుకి మార్కులు తక్కువ వచ్చాయి అని.. 


కాసేపు వాడిని నిందించాము... కాసేపు స్కూల్ ని వాళ్ళ టీచర్స్ ని తిట్టిపోసాము.. అయ్యాక ఒకరిని ఒకరం నువ్వు పట్టించుకోవట్లేదు అంటే నువ్వు అంటూ కాస్త జగడం నడిచింది.. 


అలా ఒక గంట గడిచాక ఇల్లు అంతా నిశ్శబ్దం అలుముకుంది.. 


కుర్చీలో కూలబడి..దీర్ఘ ఆలోచనలో పడ్డాను.. 

నిజంగా చిన్ను తప్పు ఏమైనా ఉందా.. మన రోజుల్లో మనమే చదువుకున్నామా.. మన అమ్మానాన్న కూర్చోపెట్టి చదివించారా.. అని ఆలోచిస్తే.. నా రోజుల్లో అమ్మ నాన్న తమ సమయం ఎంత కేటాయించారో గుర్తొచ్చింది.. 


ఇప్పుడు ఒక్క నిమిషం దొరికితే ఫోన్ పట్టుకొని ఏదో వెతికేసే ప్రయత్నం లోనే అందరం ఉంటున్నాం.. ఆ డబ్బా లో ఏమి చావదు అని తెలిసినా మళ్ళీ ఆ ఫోన్ వైపే వేళ్ళు వెళ్ళిపోతుంటాయి తప్ప బాబుని కూర్చోపెట్టుకుని.


   "బాబు ఏంట్రా నీకు ఏమి ఇబ్బంది.. నేను చెప్పనా "అని చదువు చెప్పే ఓపిక నశించింది అని అర్ధం అయ్యింది...


  ఇంకా ఎవర్నో నిందించి ప్రయోజనం లేదు అని అర్ధం అయింది.. 


ఇక నుంచి రోజు ఒక గంట కచ్చితంగా బాబు చదువు కోసం వెచ్చించాలి అని ఒక నిర్ణయం తీసుకున్నాను.. 


బాబు కూడా సంతోషాపడ్డాడు.. మనం బరిలోకి దిగితే వేరేలాగా ఉంటుంది అని నిరూపించాము.. 


వర్క్ బుక్స్ వదిలేసి.. టెక్స్ట్ బుక్ లో నుంచి నోట్స్ ఎలా రాసుకోవాలో నేర్పించాను...

ఫాస్ట్ గా కాకుండా స్లో గా ఎలా చదివితే బుర్రకి ఎక్కుతుందో చెప్పాను..


చూస్తూనే హాఫ్ ఇయర్లి ఎగ్జామ్స్ వచ్చాయి... నేను ఒకటే చెప్పను 


.. 1st ర్యాంక్ రావాలంటే .. 3 పాయింట్లు రాసుకో అని చెప్పను 


1) నాకు ఎంత టైమ్ ఉంది 

2)ఎన్ని చదవాలి ( ఓకే పేపర్ లో అన్ని నంబర్స్ వేసి ఉంచుకో ) 🔲

3) ఎన్ని చదవగలిగాను ( చదివిన వి అన్ని టిక్ ✅ చేసుకో ) 


అన్ని నంబర్స్ కి టిక్స్ ✅ వచ్చాయి అంటే నీ విజయాన్ని ఎవరూ ఆపలేరు.. అని 

అప్పుడు నువ్వు ఎగ్జామ్స్ సిద్ధం గా ఉన్నట్టు.. 


ఇప్పుడు చిన్ను మర్క్స్ తక్కువ వస్తాయా రావా అని భాధ పడట్లేదు.. ఎందుకంటే ఎన్ని వచునో ఎన్ని రావో ముందే తెల్సు కాబట్టి..


ఒక రోజు స్కూల్ నుంచి ఇంటికి వస్తూనే.. చెప్పాడు.. తనకు మళ్ళీ మళ్ళీ మంచి మార్కులు వచ్చి నందుకు సెక్షన్ c నఃంచి సెక్షన్a కి మార్చారు అని సంతోషంగా... 


- --- సమాప్తం ----

Saturday, June 13, 2026

43) అంతా యాద్రుచ్చికం .. కథ

 


#telugustories 

  

అంతా యాదృచ్ఛికం:  katha



జీవితం అంటేనే కొన్ని అనుకోని సంఘటనల సమాహారం. మనం ప్లాన్ చేసుకునే వాటికంటే, విధి మన కోసం సిద్ధం చేసే అనుభవాలే మన జ్ఞాపకాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంటాయి. మనిషి ప్రయాణం కేవలం ఒక భౌగోళిక స్థానం నుండి మరొక చోటికి వెళ్లడమే కాదు; అది ఒక అనుభవాల యాత్ర. ఆ ప్రయాణంలో ఎదురయ్యే వ్యక్తులు, యాదృచ్ఛిక సంఘటనలు మన ఆలోచనా దృక్పథాన్ని ఎలా మారుస్తాయో చెప్పడానికి, నా జీవితంలో జరిగిన ఒక చిన్న, కానీ ఆసక్తికరమైన సంఘటనను మీకు వివరంగా వివరిస్తాను.

కొన్ని నెలల క్రితం, ఒక ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలో కీలకమైన ఉద్యోగ ఇంటర్వ్యూ కోసం నేను హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్లాల్సి వచ్చింది. కరోనా మహమ్మారి తర్వాత ప్రపంచం నెమ్మదిగా గాడిలో పడుతోంది, ప్రయాణాలు కూడా మళ్ళీ పుంజుకుంటున్నాయి. ఇది సుదీర్ఘ విరామం తర్వాత చేస్తున్న మొదటి ప్రయాణం కావడంతో, నాలో ఒక రకమైన ఉత్సాహం, అదే సమయంలో ఇంటర్వ్యూ గురించి చిన్నపాటి టెన్షన్ ఉన్నాయి. నేటి కాలంలో విమాన ప్రయాణాలు, ఏసీ స్లీపర్ ప్రైవేట్ ట్రావెల్స్ అందుబాటులో ఉన్నప్పటికీ, నాకు మొదట్నుంచి ఒక బలమైన అలవాటు ఉంది—అదే ఆర్టీసీ (RTC) బస్సు ప్రయాణం. వాటిలోని భద్రత, డ్రైవర్ల బాధ్యతాయుతమైన డ్రైవింగ్, మరియు ఆ బస్సులో ఉండే ఒక రకమైన సామాజిక వాతావరణం నాకు ఎంతో కంఫర్ట్‌గా అనిపిస్తాయి. ప్రైవేట్ బస్సుల వేగం కంటే, ఆర్టీసీ అందించే ప్రశాంతత నాకు చాలా ఇష్టం. అందుకే, ఆ రోజు కూడా వెనుకాడకుండా ఆర్టీసీ బస్సునే ఎంచుకున్నాను.

ఆ రోజు సాయంత్రం హైదరాబాద్‌లోని బస్ స్టేషన్‌లో బస్సు ఎక్కి నా సీటులో స్థిరపడ్డాను. బస్సు నగరం దాటుతూ నెమ్మదిగా కదులుతోంది. నగరపు ట్రాఫిక్, జనసందోహం వెనుకబడుతుంటే, మనసులో ఇంటర్వ్యూకి సంబంధించిన మెలకువలు తిరుగుతున్నాయి. బస్సులో టీవీ ఆన్ చేస్తారేమోనని కాసేపు ఎదురుచూశాను. కానీ కండక్టర్ వచ్చి, "ఎవరూ టీవీ వైపు చూడట్లేదండి, అందరూ ఫోన్లలోనే నిమగ్నమై ఉన్నారు" అని చెప్పడంతో ఆ ఆలోచన విరమించుకున్నాను. నిజమే, ఈ కాలంలో అందరి చేతిలో ఒక స్మార్ట్‌ఫోన్, కళ్ళ ముందు ఒక డిజిటల్ ప్రపంచం ఉంది. నేను కూడా ఫోన్లో ఏదైనా వార్త చూద్దామని ప్రయత్నించాను, కానీ ఇయర్ ఫోన్స్ వల్ల చెవి నొప్పి వస్తోంది, పైగా సౌండ్ క్లారిటీ కూడా సరిగ్గా లేదు. చివరకు, నా ఫోన్‌ను పక్కన పడేసి, కిటికీ గుండా బయట కనిపిస్తున్న దృశ్యాలను చూస్తూ లోకం మరిచిపోయాను. బస్సు నగరం దాటి హైవే ఎక్కింది, చల్లని గాలి కిటికీ గుండా ముఖానికి తగులుతుంటే, ఎన్నో ఆలోచనలు మెదడును చుట్టుముట్టాయి.

నా పక్క సీటులో ఇద్దరు యువకులు ఉన్నారు. వారిద్దరూ బీటెక్ విద్యార్థులని, ఏదో ప్రాజెక్ట్ పని మీద లేదా పరీక్ష కోసం బెంగళూరు వెళ్తున్నారని వారి మాటలను బట్టి అర్థమైంది. వారిద్దరూ తీవ్రమైన ఉత్సాహంతో మొబైల్స్‌లో ఐపీఎల్ మ్యాచ్ చూస్తున్నారు. నా దురదృష్టమో లేక ఆ అబ్బాయిల అదృష్టమో కానీ, ఆ రోజే ఎవరో 'అభిషేక్' అనే ప్లేయర్ సెంచరీ కొట్టాడట. వారి ఉత్సాహం, చేసే అరుపులు చూస్తుంటే నాకు కూడా కాసేపు నవ్వు వచ్చింది. క్రికెట్ అంటే మన భారతీయులకు ఒక పిచ్చి, ఒక భావోద్వేగం కదా! ఆ తర్వాత వారిని పలకరించి, ఎక్కడికి వెళ్తున్నారు, ఏమి పని మీద అని అడిగాను. వారు ఏదో పరీక్ష కోసం వెళ్తున్నామని చెప్పారు. కాసేపు క్రికెట్ స్కోర్లు, ఆటగాళ్ల ప్రదర్శన, బెంగళూరులో వాతావరణం గురించి మాట్లాడుకున్నాక, వారు మళ్ళీ మ్యాచ్‌లోనే లీనమైపోయారు. వారి ఉత్సాహం చూస్తుంటే నా కాలేజీ రోజులు గుర్తొచ్చాయి, జీవితంలో ఆ వయసులో ఉండే ఆ ఉత్సాహం ఎంత గొప్పదో అనిపించింది.

బస్సు కొన్ని గంటల తర్వాత భోజనం కోసం ఒక చోట ఆగింది. యాథావిధిగా ఆ హోటల్ పరిస్థితి చూస్తేనే భయం వేసింది. ప్రయాణాల్లో ఇలాంటి హోటళ్లలో తినడం మనకు అలవాటే. బస్సు దిగి కాసేపు ఆ ప్రదేశంలోని ప్రకృతిని, చల్లని గాలిని ఆస్వాదించి లోపలికి వెళ్ళాను. తినడానికి ఏమున్నాయా అని చూస్తూ ఒక టేబుల్ వద్ద కూర్చున్నాను. కాసేపటికే మరొక ఇద్దరు ప్రయాణికులు వచ్చి అదే టేబుల్‌లో కూర్చున్నారు.

మా మధ్య మాటలు మొదలయ్యాయి. సర్వర్ వచ్చి ఆర్డర్ కోసం అడిగినప్పుడు, మాలో ఒక చర్చ మొదలైంది. "బిర్యానీ తింటే బాగుంటుందేమో" అని ఒకరు అంటే, "కాదు, పెరుగన్నం ఉత్తమం, నా మాట వినండి, ప్రయాణాల్లో తేలికగా ఉంటుంది" అని నేను సలహా ఇచ్చాను. మరొకరు "మీల్స్ తీసుకుందాం" అన్నారు. చివరకు తలా ఒక రకం ఆర్డర్ చేశాం. కానీ, చివరకు తేలిందేమిటంటే, ఆ హోటల్‌లో పెరుగన్నమే కొంచెం నయం! అందరూ నా వైపు చూసి, మళ్ళీ ఒక కర్డ్ రైస్ ఆర్డర్ చేశారు. ఆ టేబుల్ వద్ద ఉన్న వారిలో ఒకతను తనను తాను డాక్టర్‌గా పరిచయం చేసుకున్నాడు. "ఏ స్పెషలైజేషన్ అండి?" అని అడిగితే, "ఫిజియోథెరపీ" అని చెప్పాడు. లోపల నేను, 'ఓరిని, ఫిజియోథెరపీ అని చెప్పకుండా డాక్టర్ అంటావా!' అని మనసులోనే నవ్వుకున్నాను. కానీ వృత్తి ఏదైనా గౌరవించాల్సిందే కదా అని సర్దుకుపోయాను.

అయితే, భోజనం అయిపోయాక అతను "ఇక్కడ టీ ఉంటుందా?" అని అడగడం గమనించాను. నా మనసులో, "పెరుగన్నం తిని, వెంటనే టీ ఏంటి బాబూ.. ఆ రెండూ కలిస్తే కడుపులో విరిగిపోదా!" అని అనుకున్నాను. అది వినగానే నాకు చాలా వింతగా అనిపించింది. బయటికి వచ్చాక అతను టీ తాగడం చూసి, ఇక ఉండబట్టలేక అడిగాను, "పెరుగన్నం తిన్నాక టీ తాగడమేంటి డాక్టర్ గారు?" అని. అప్పుడు అతను చెప్పిన సమాధానం విని నేను విస్తుపోయాను. "అంటే.. టీకి, పెరుగుకి మధ్యలో నేను ఒక కేక్ తిన్నాను కదండీ, అందుకే ఏమీ కాదు" అని చాలా సింపుల్‌గా చెప్పాడు. ఆ కాంబినేషన్ విన్నాక నాకు నవ్వాలో, ఆశ్చర్యపోవాలో అర్థం కాలేదు. జీవితంలో ఇలాంటి విచిత్రమైన అభిరుచులు కూడా ఉంటాయని అప్పుడు అర్థమైంది.

అలా ప్రయాణం సాగింది. ఆ డాక్టర్ గారితో ప్రొఫెషనల్ విషయాలు, మిగతా వారితో కబుర్లు చెప్పుకుంటూ ఎప్పుడు నిద్రపోయానో కూడా తెలియలేదు. ఉదయం లేచి ఒకరికొకరు బై బై చెప్పుకుని ఎవరి దారిలో వారు వెళ్ళిపోయాం. నా ఇంటర్వ్యూ సాయంత్రం 4 గంటలకు పూర్తయింది. ఇంటర్వ్యూ బానే జరిగింది, కానీ ఆ తర్వాత ఎవరినైనా కలవడానికి సమయం లేకపోవడంతో, తిరుగు ప్రయాణం కోసం మేజెస్టిక్ బస్ స్టాండ్‌కు చేరుకున్నాను.

హైదరాబాద్‌కు వెళ్ళే మొదటి బస్సు ఎక్కేయాలని నిర్ణయించుకున్నాను. కానీ 6 గంటల వరకు ఒక్క బస్సు కూడా రాలేదు. నిరీక్షణ మొదలైంది. ఆ స్టాండ్‌లో ఉన్న రద్దీని, గందరగోళాన్ని గమనిస్తుంటే, ప్రపంచం ఎంత వేగంగా కదులుతుందో అనిపించింది. చివరకు ఒక బస్సు వచ్చింది. ఆ బస్సు ఎక్కి లోపలికి వెళ్ళగానే నాకు నోరు వెళ్ళబెట్టేంత ఆశ్చర్యం కలిగింది. ఆ బస్సులో డ్రైవర్, కండక్టర్ ఇద్దరూ నిన్న రాత్రి మేము ప్రయాణించిన వారే! ఇదేదో సినిమా కథలా అనిపించింది. బస్సు అదే, సిబ్బంది అదే, మళ్ళీ మేమే అదే బస్సులో! ఇంతటి యాదృచ్ఛికం జరగడం నిజంగా అద్భుతం.

నేను సీటులో కూర్చుండగా, వెనక నుంచి ఎవరో "అరేయ్ అన్న రా.." అని అరవడం వినిపించింది. వెనక్కి తిరిగి చూస్తే, నిన్న రాత్రి మొబైల్‌లో ఐపీఎల్ మ్యాచ్ చూసిన అదే బీటెక్ బాబులు! నేను నమ్మలేకపోయాను. "మీరు కూడా ఇదే బస్సా? ఎగ్జామ్ అయిపోయిందా?" అని అడిగాను. "అయిపోయింది అన్నా, తిరుగు ప్రయాణం" అని వారు చిరునవ్వుతో చెప్పారు. ప్రపంచం ఎంత చిన్నదో కదా!

మరికొద్దిసేపటికి, నిన్న భోజనం చేసిన ఆ ఫిజియోథెరపీ డాక్టర్ గారు కూడా బస్సులోకి వచ్చారు. నాకు ఒక్కసారిగా నవ్వు ఆగలేదు. ఒకే బస్సులో, ఒకే రూట్లో, ఎలాంటి రిజర్వేషన్లు లేకుండా, అందరం యాదృచ్ఛికంగా మళ్ళీ కలుస్తామని ఎవరైనా ఊహించగలరా? జీవితంలో అప్పుడప్పుడు ఇలాంటి వింత సంఘటనలు జరుగుతుంటేనే కదా, అవి జ్ఞాపకాలుగా మిగిలిపోయేది.

ఆ రోజు ప్రయాణం నాకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పింది. మనం ఎవరిని ఎప్పుడు, ఎక్కడ కలుస్తామో తెలియదు. ఈ ప్రయాణం కేవలం గమ్యాన్ని చేరుకోవడమే కాదు, ఇలాంటి మధురమైన జ్ఞాపకాలను ప్రోగు చేసుకోవడం కూడా అనిపించింది. ప్రపంచం చాలా చిన్నది, మనం ప్లాన్ చేసిన దానికంటే విధి ఆడే ఆటలే చాలా వినోదాత్మకంగా, ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఎవరూ ఊహించని విధంగా జరిగిన ఈ ప్రయాణం, నా మదిలో ఎప్పటికీ ఒక తీపి జ్ఞాపకంలా ఉండిపోతుంది. మనుషుల మధ్య ఉండే ఆ అదృశ్యమైన బంధమే ప్రయాణాలకు అందాన్ని ఇస్తుంది. ప్రయాణం చేయండి, కొత్త వ్యక్తులను కలవండి, కథలను సేకరించండి—జీవితం అప్పుడే పరిపూర్ణం అవుతుంది. ఇలాంటి యాదృచ్ఛిక సంఘటనలే మనకు మళ్ళీ మళ్ళీ ప్రయాణాలు చేయాలనే ఉత్సాహాన్ని ఇస్తాయి.


సమాప్తం.. 


-----  *** ----


94 ) రోలింగ్ టైటిల్స్.. కథ :

  రోలింగ్ టైటిల్స్.. కథ :  ~~~~~~~~~~~~~~~~~~~ గగన్ ఒక మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్. గొంతులో వైవిధ్యం, పాత్రకు తగ్గట్టుగా ప్రాణం పోయగల ప్రతిభ అతన...