Friday, August 21, 2026

87 ) తేనే టీగలు

 87 ) తేనే టీగలు 


హరీష్ బాబు

" అమ్మో తేనెపట్టు దగ్గరికి వెళ్ళామంటే కుట్టి పడేస్తాయి " అనుకుంటాము మనం అంతా ఇదంతా అబద్దం అని చెప్తే మీరు నమ్మగలరా ఒకసారి మేము ఉంటున్న అపార్ట్మెంట్ లో బాల్కని లో ఒక చిన్న పాటి గుప్పెడంత తేనే పట్టు చూసి ఇక్కడ తినేపట్టు ఏంటి అనుకున్నాం ఒక వారం రోజులు ఆగి చూద్దాము కదా మోచేయి అంత పెద్దగా అయిపోయింది తినేపట్టు.. బాల్కొని అంటే ఎక్కడో కాదండీ మా టవల్ తీగ అరెస్కునే అంత కిందకే... రోజంతా ఒక ఐదో పదో తేనే తీగలు కాపలా కాస్తూ నే ఉండేవి.. వాటిని రోజు ఫోటో తీసి షేర్ చేసుకునే వాడిని బట్టలు ఆరేసు కోవటం కష్టం అయిపోయింది.. అయితే ఏ మాట కి ఆ మాటే చెప్పుకోవాలి.. ఓక నెల రోజుల పైన.. ఆ తేనే పట్టు అలాగే ఉన్నా అందరు అనుకున్నట్టు గా ఒక్క తేనెతీగ కూడా మా మీద దాడి చేయలేదు.. కుట్టలేదు.. ఏదో అనుకుంటాం కానీ అంత చిన్నగా ఉన్నా వాటికీ అన్నీ తెలుసు.. ఈ ఇల్లు ఎవరిది ఎవరెవరు ఉంటారు.. ఎవరు కొత్త వాళ్ళు.. వాటి పక్కనే టవల్ ఆరేసినా ఏమి అనలేదు మేము అన్నీ రోజులు ఏ ప్రొటెక్షన్ వేసుకోలేదు... ఇంకా నెల రోజులు అయ్యింది.. ఇంకా ఎన్ని రోజులు ఇబ్బంది పడతాము అని ఒకతన్ని పిలిపించి.. పొగ పెట్టి తీసేయించాం... చాలా సేపు తరవాత.. ఆ పట్టుని ఓపెన్ చేస్తే.. అవి మాకంటే తెలివైనవి.. ఒక్క బొట్టు కూడా తేనే లేదు... కోసం మెరుపు ఏంటంటే.. ఆరు నెలల తరువాత ఎగ్జాక్ట్ గా అక్కడే మళ్ళీ పెట్టడం తీసేయించటం జరిగాయి.. మరి ఆ చోటే అని ఎలా తెలుసో.. ~~ సమాప్తం ~~


telugu stories for reading telugu kathalu తెలుగు కథలు kathalu in telugu telugu stories to read telugu stories stories in telugu kathalu telugu telugu stories read online story in telugu telugu storys తెలుగు స్టోరీస్. కథల పోటీ 2026 telugu kadhalu తెలుగు సాహిత్య పత్రిక తెలుగు ప్రేరణాత్మక కథ

86) అండ్ ఫస్ట్ ప్రైజ్ గోస్ టూ .. కథ

86)  అండ్ ఫస్ట్ ప్రైజ్ గోస్ టూ .. కథ

---------------------------------------

అండ్ ఫస్ట్ ప్రైజ్ గోస్ టూ.. - కథ ~~~~~~~~~ ✍️ హరీష్ బాబు లేడీస్ అండ్ జెంటిల్మన్ ప్లీజ్ జాయిన్ యువర్ హాండ్స్ .. అండ్ ఫస్ట్ ప్రైజ్ గోస్ టూ... ప్రకాష్.. ఎందుకో ఏమో కానీ.. ఈ శబ్దం నిరంతరం ప్రకాష్ మెదడు లో ధ్వనిస్తూ ఉండేది ప్రకాష్ ఒక సాధారణ కాలేజీ విద్యార్థి. తన ప్రతిభను నిరూపించుకోవాలని ఎన్నో ఆశలతో పోటీల్లో పాల్గొనేవాడు. కానీ విధి అతన్ని ప్రతిసారి వెక్కిరించింది. ఒక సారి కాలేజీలో జరిగిన క్విజ్ పోటీలో ప్రకాష్ బృందం ప్రథమ బహుమతి సాధించింది. తన ఇంట్లో పేరెంట్స్ తో గప్పగా చెప్పుకున్నాడు.. బహుమతి తీసుకోబోతున్నట్టుగా.. కానీ మొదటి నుంచి చిన్న చూపు చూసే అమ్మ నాన్న ఇతనికి అంత ఉందా అన్నట్టు చూసారు గవర్నమెంట్ జాబ్స్ చేస్తున్న అతని ఇద్దరి పేరెంట్స్ కళ్ళకి ఎప్పుడూ చుట్టూ పక్కల ఉండే వారి పిల్లలే గొప్పగా కనిపించే..వారు ఎప్పుడు ఆ బయట వారి పిల్లల తో పోల్చడం వాళ్ళ కి అన్నీ ప్రైజెస్ వచ్చాయి నీకేమి రావా అని.. ఎగతాళి గా మాట్లాడటం.. చాలా అవమానంగా అనిపించేది ప్రకాష్ కు స్టేజ్ మీద అనౌన్స్‌మెంట్ కోసం అతను ఎంతో ఆత్రుతగా ఎదురు చూసాడు.. కానీ అతను చూస్తుండగా, ఆ ప్రోగ్రాం నిర్వాహకులు 'ఎన్. ప్రకాష్' అని పిలవడానికి బదులు 'ఆర్. ప్రకాష్' అని పిలిచారు. ఆ చిన్న పొరపాటు వల్ల తన కష్టానికి దక్కాల్సిన గుర్తింపు దక్కక ప్రకాష్ కన్నీళ్లతో ఇంటికి వెనుతిరిగాడు. ఆ గ్రూపులో ఉన్న ' ఆర్. ప్రకాష్ ' ఆ ప్రైజ్ తీసుకున్నాడు.. మరి నా పేరు ఇంకా పిలవలేదు ఏంటి అని వెయిటింగ్ చేస్తూనే ఉన్నాడు కానీ అలా చూస్తూనే ఆ 'సెరేమోనీ' మొత్తం అయిపోయింది.. ఇంటికి వొట్టి చేతులతో వచ్చాడు.. "నా పేరు పలకడానికి కూడా ఈ ప్రపంచానికి మనసు రావడం లేదేంటి? అక్షరం మారింది కానీ నా కష్టం మారలేదు కదా!ఒక జట్టు లో ఇద్దరూ ఒకే పేరుతో ఉంటే ఒక పేరే ఎందుకు చదివారు ఇంకో పేరు చదవలేదు .... అందరూ నవ్వుతూ షీల్డ్ పట్టుకుంటుంటే, నేను మాత్రం..కేవలం నా పేరు చదవక పోవటం వల్ల వెనుక దాక్కోవాల్సి వచ్చిందే. నా దురదృష్టం ముందే రాసిపెట్టినట్టు ఎందుకు విధి నాపై ఇంత కసిగా ఉంది?" కాలేజ్ ప్రోగ్రాం అయ్యాక ఇంటికి వట్టి చేతులు తో వచ్చిన అబ్బాయి చూసి తమలో తామే నవ్వుకున్నారు అతని పేరెంట్స్ --- ఇంకోక సారి ఒక నాటకంలో అద్భుతంగా నటించి మొదటి బహుమతికి ఎంపికయ్యాడు. తీరా బహుమతి తీసుకునే సమయానికి, నిర్వాహకులు ఆ తన పేరు ఉన్న షీల్డ్ ఎక్కడో కనపడకుండా పోయిందని, తర్వాత రేపు ఆఫీసులో ఇస్తామని చెప్పారు. కానీ ఆ తర్వాత కాలేజీ వారు తను గుర్తు చేసినా ఆ విషయాన్నే మర్చిపోయారు. పోనీలే అప్పుడంటే అక్షరం మారింది అనుకున్నాను, ఈసారి ప్రైజ్ యే మారిపోయింది. నా నటనకు చప్పట్లు కొట్టిన చేతులు , బహుమతి ఇచ్చేటప్పుడు ఖాళీగా చూపిస్తున్నాయి. 'తర్వాత ఇస్తాం' అన్న ఒక్క మాట ఒక మనిషిని ఎంత క్రుంగ దీస్తుందో నా మనసుకే తెలుసు. బహుమతి గెలిచినా ఒక ఓడిపోయిన వాడిలా తలదించుకుని వెళ్లాల్సి వస్తోందే.. ఇది నా తలరాతా ఏమిటీ ?" అనుకున్నాడు.. కాలేజీ ఎచ్.ఓ.డి కి కంప్లైంట్ చేద్దామా అనుకున్నాడు... మనలో సత్తా ఉండాలి కానీ ఎవరిని అని ఏం లాభం మిగతా అందరూ బాగానే బహుమతి అందుకుంటున్నపుడు నాకు మాత్రమే ఇవ్వక పోవటానికి వారి ఆంతర్యం ఏమిటో గోచరించట్లేదు.. అనుకున్నాడు మళ్ళీ వట్టి చేతులతో.. వచ్చిన అబ్బాయి ని చూసి.. కాస్త వెటకారం గా అతని వెనుక మళ్ళీ నవ్వారు తల్లి తండ్రులు... ----- ఒకసారి పాటల పోటీలో 2nd ప్రైజ్ తెచ్చుకున్నాడు.. కానీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ రోజూ ఎంతకీ తన పేరు రాలేదు అని ఆ నిర్వాహకుడిని అడిగితే , అసలు లిస్టులోనే అతని పేరు లేదని బ్యాక్‌స్టేజ్ సిబ్బంది తేల్చిచెప్పారు. ప్రతిసారి కాలేజీలో గెలిచానని ఇంట్లో గొప్పగా చెప్పుకోవడం, తీరా బహుమతి లేకుండా ఖాళీ చేతులతో వెళ్లడంతో తల్లిదండ్రులు అతన్ని నమ్మలేదు. "నువ్వు అబద్ధాలు చెబుతున్నావు" అని గేలి చేస్తూ తిట్టడం మొదలుపెట్టారు. విషయం ఏదైనా అయ్యుండచ్చు కానీ కన్నా తల్లి తండ్రులు చులకన చేయటం.. అతనికి మింగుడు పడలేదు.. తను పోటీలో పాల్గొనటం నిజం.. గెలిచింది నిజం.. బహుమతి ఇవ్వక పోవటం నిజం.. ఒకరిని నమ్మించాలసిన అవసరం నాకు లేదు అనుకున్నాడు ఒక అంతర్ముఖుడైన వ్యక్తికి తనను తాను సమర్థించుకోవడం, వేరే వారితో వాదించటం కంటే తనలో తాను మదనపడటమే ఎక్కువ ఇష్టపడతాడు . ప్రకాష్ స్థితి కూడా సరిగ్గా అదే. "నేను గెలిచాను అన్న సంతోషం కంటే, నా వాళ్ళు నన్ను నమ్మడం లేదన్న బాధే నన్ను ఎక్కువగా దహించివేస్తోంది. బయట ప్రపంచం నన్ను గుర్తించకపోవడం ఒక ఎత్తు అయితే, కన్నతల్లిదండ్రులు నన్ను ఒక అబద్ధాలకోరులా చూడటం మరింత బాధిస్తోంది ." "నేను నిజమే చెబుతున్నాను అని గొంతు చించుకుని అరిచి చెప్పాలని ఉంది. కానీ, ఆ గొడవ చేసే శక్తి నా దగ్గర లేదు. నా మౌనాన్ని వాళ్ళు అసమర్థత అనుకుంటున్నారు. గెలిచిన వాడిలా తలెత్తుకుని తిరగాల్సిన నేను, దొంగలా తలదించుకుని తిరుగుతున్నాను. నా కష్టం వారికి కనిపించడం లేదు, కేవలం ఆ చేతిలో ఉండాల్సిన బహుమతి మాత్రమే చూస్తున్నారు ." "సరే! ఇక ఎవరినీ నమ్మించాల్సిన అవసరం నాకు లేదు. ఈ ప్రపంచానికి నా గెలుపు ఒక పత్రమో, ఒక షీల్డో అయితే... అవి నా దగ్గర ఉండాలి. ఆ కష్టం నాది, ఆ ప్రతిభ నాది. గుర్తింపు ఇవ్వడం కాలేజీ బాధ్యత, కానీ అది వారు చేయనప్పుడు నా గుర్తింపును నేనే గౌరవించుకుంటాను." ఒక రోజు ప్రకాష్ తన దగ్గరున్న... దగ్గరలో ఉన్న గిఫ్ట్ షాప్ వైపు నడక సాగించాడు. ఆ డబ్బుతో ఆ గిఫ్ట్ షాపులో " మూడు షీల్డ్స్" కొనుక్కున్నాడు. తన కష్టానికి ప్రతిఫలం కాలేజీ ఇవ్వకపోయినా, అది తన హక్కే అని భావించి తన పేరు మీద ఆ మొమెంటోలను షోకేసులో పెట్టుకున్నాడు. అది తప్పో ఒప్పో అతనికి తెలియదు కానీ, ఆ క్షణం ఆ షీల్డ్స్ చూస్తుంటే ప్రకాష్‌కు ఎంతో ప్రశాంతతను, ఆనందాన్ని ఇచ్చాయి. ఆ షీల్డ్స్ కేవలం చెక్క బొమ్మలు కావు, అతని కష్టానికి అతను ఇచ్చుకున్న గౌరవం. తల్లిదండ్రుల ఎగతాళికి జవాబు చెప్పకుండా, తన గదిలోననే ఆ షీల్డ్స్ ని అమర్చుకున్నాడు.. ప్రకాష్ తనను తాను ఓదార్చుకోవడానికి ఎంచుకున్న ఆ మార్గం ఇది. ఇది తప్పో ఒప్పో తెలీదు. అతని మానసిక స్థితికి మాత్రం ఒక ఔషధంలా పనిచేసింది. తనూ ఎప్పుడు భాద గా ఫీల్ అయ్యినా ఆ షీల్డ్స్ ని చూసినప్పుడు ఆ భాధ తొలగి పోతుంది.. ధైర్యం వస్తుంది.. తాను కూడా లైఫ్ లో ఏదయినా సాధిస్తాను అనే నమ్మకం కలుగుతుంది.. ఇది ఒక తెరపి లాంటిది... -- సమాప్తం ---

-- సమాప్తం --

85 ) ఐదు వందల రూపాయల విలువ .. కథ

 

85  ) ఐదు వందల రూపాయల విలువ .. కథ

-----~~~~~~------
✍️హరీష్ బాబు
...
ఒక మిట్ట మధ్యాహ్నం వేళ.. కంపెనీ పని మీద బైక్ మీద డ్రైవ్ చేస్తూ చేస్తూ చాలా అలసి పోయిన నేను.. పంజాగుట్ట దగ్గర లోని ఒక రెస్టారెంట్ ముందు బైక్ అపాను..
బైక్ పార్క్ చేసి రెస్టారెంట్ మొదటి అంతస్తు లోకి వెళ్ళాను..
హోటల్ లో ఉన్న ఏసీ లో చల్లగా కాసేపు రిలాక్స్ అయ్యి.. బిర్యానీ ఆర్డర్ చేసాను.. ఎంత అంటే 500/- ఓన్లీ అన్నాడు వెయిటర్
"ఆమ్మో.. ఒక్క పూట భోజనం.. అది నా ఒక్కడి కోసం ఐదు వందలా."అనుకోని . హడలి పోయాను.. ఇంకో ప్రశ్న వేయకుండా.. అక్కడి నుండి లేచి వచ్చేసాను..
బయటికి వస్తుంటే అనిపించింది
"ఇంకో 500 వేస్తే 25 కేజీ రైస్ బ్యాగ్ వస్తుంది.. కుటుంబం అంతా నెల రోజులు తినే తిండి నేను ఒక్కడిని.. తినాలా ఎంత డబ్బు ఉన్నా కూడా ఎలా అలోచించినా నాకు ఆ గిన్నెడు అన్నానికి 500/- సరి కాదేమో అనిపించింది.. "..
మెట్లు దిగి కిందకి వస్తుంటే... ఎంత సర్ది చెప్పుకున్నా..ఆ బిర్యానీ ఘుమఘుమ ముక్కుని వదలటం లేదు..
నా బైక్ దగ్గర గా వచ్చి స్టార్ట్ చేయబోయాను.. ఎవరో వెనకనుంచి భుజం తట్టి నట్టు అనిపించింది...
ఎవరా అని చూస్తే..
ఒక వృద్ధ జంట.. నిలబడి ఉన్నారు..
"బాబు మేము చాలా దూరం వెళ్ళాలి.. మా పర్సు.. "
అని చెప్పబో్తుండగా..
"ఆపండి.. తెల్సులే మీ పర్సు పోయింది.. డబ్బులు ఇస్తే వెళ్ళాక తిరిగి ఇస్తారు.. అంతేగా.. ఆపండయ్యా ఎంత మంది ఇదే డ్రామా కొత్తవి ఏమైనా ఆలోచించండి.. " అన్నాను
"అది కాదు బాబు.."
" ఆపండయ్య.. వెళ్ళండి "అన్నాను బండి స్టార్ట్ చేస్తుండగా వెనక్కి చూసాను..
ఆ వృద్ధ జంట.. ఇంకొక అతన్ని అలాగే అడిగారు..
అతను చూడటానికి 20 ఏళ్ళ లోపు ఉన్నాడు.. నల్ల కళ్లద్దాలు పెట్టి.. రోడ్ సైడ్ షూ చీప్ జీన్స్.. కానీ స్టైలిష్ గా హైరస్టయిల్.. లో ఉన్నాడు..
బ్యాక్ పాకెట్ లో పర్సు తీసి.... ఒక నాలుగు వందల లో ఒక 500 నోటు తీసి మారు మాట్లాడకుండా.. తన దారి లో నడుస్తూ వెళ్లి పోయాడు....
ఏంటి ఆ డబ్బు విసిరేయటం అనే షాక్ లో ఉన్నాను నేను
వాళ్లు కూడా అతని వైపు అలాగే చేస్తున్నారు ఒక నిమిషం పాటు..
"నాలో నేను ఆలోచిస్తూ ఉండి పోయా.. నేను 500 రూపాయలు కోసం భోజనం మానేసానా.. వీడు 500/- ఏదో కాగితం లాగా విసిరేసి వెళ్లాడా.. ఆ డబ్బు కస్టపడి తేనే వచ్చిందా.. లేక ఎవరి పర్సు కొట్టేశాడా.. లేకపోతే ఇంస్టాగ్రామ్ /యూట్యూబ్ లో ఫ్రీ గా వచ్చిందా లేక అమ్మ అయ్యా జాబ్ చేస్తూ.. పిల్లలకి ఇష్టం వచ్చినట్టు డబ్బు ఇస్తున్నారే ఆ బాపత.. లేక.. లాటరీ కొట్టాడా.. లేక ఈమధ్య ప్రవచనాల్లో సాయం చేయండి అన్నది ఏమైనా విన్నాడా
ఎంత వేజీ గా డబ్బు వచ్చినా ఇతరులకి డబ్బు ఇవ్వటానికి మనసు ఉండాలి గా....
ఇంతకీ అతను చేసింది మంచి పనా చెడ్డ పనా." . అనే ఆలోచన లో నా పని మారిపోయా..
మళ్ళీ నా పని గుర్తుకు వచ్చి నా ఆఫీస్ వైపు బండి పోనిచ్చా..

84) బిజీ లైఫ్.. కథ

84)  బిజీ లైఫ్.. కథ

~~~~~~~~~~
✍️ హరీష్ బాబు
రాత్రి తొమ్మిది అయింది. ఊపిరి తీసుకోకుండా మీటింగ్స్ ఉంటూనే ఉన్నాయ్.. ఏమి వర్క్ ఫ్రొం హోమ్.. ఓ ఏమో కానీ ప్రాణాలు తోడేస్తున్నారు అనిపించింది. పైగా ఈ అజైల్ ప్రాజెక్ట్ అంటే..రాత్రి పడుకునే ముందు ఏమి చేసామో చెప్పాకా.. మళ్ళీ పొద్దున్న ఏమి ఉంటుంది అప్డేట్ స్టేటస్ నా బొంద..
బెదురూమ్ లో నా ఆలోచనల లో నేనుంటే.. కిచెన్ లో ఏదో అలికిడి బినిపిస్తోంది..
ఏమిటా అని వెళ్లి చూస్తే మా చిన్ను గాడికి మళ్ళీ మార్కులు తక్కువ వచ్చాయి అని మా ఆవిడ అరుస్తుంది...
కాసేపు విన్నాక నేను కూడా కాస్త చెప్పి చూద్దాం అని శృతి కలిపాను...
"ఏరా చిన్ను.. మీ అమ్మ నే కోసం పొద్దున్న ఇదింటికే లేసి టిఫిన్, బాక్స్ లు అన్ని సిద్ధం చేసి పంపుతోంది.. చదువుకోటానికి ఏంట్రా నొప్పి.. "
ఆ లాజిక్ కరెక్ట్ కాదు అని నాకు తెల్సు.. కానీ మంచి చెడు చెప్పక పోతే ఎలాగ చేయి జారీ పోతాడేమో అని భయం..
మేము ఇద్దరం నోరు నొప్పి వచ్చేలా అరవటం ఏ కానీ వాడిలో ఏ స్పందన లేదు..
*** ****
. ఇది జరిగి వారం అయింది.. మళ్ళీ అవే అరుపులు..
చిన్నుకి మార్కులు తక్కువ వచ్చాయి అని..
కాసేపు వాడిని నిందించాము... కాసేపు స్కూల్ ని వాళ్ళ టీచర్స్ ని తిట్టిపోసాము.. అయ్యాక ఒకరిని ఒకరం నువ్వు పట్టించుకోవట్లేదు అంటే నువ్వు అంటూ కాస్త జగడం నడిచింది..
అలా ఒక గంట గడిచాక ఇల్లు అంతా నిశ్శబ్దం అలుముకుంది..
కుర్చీలో కూలబడి..దీర్ఘ ఆలోచనలో పడ్డాను..
నిజంగా చిన్ను తప్పు ఏమైనా ఉందా.. మన రోజుల్లో మనమే చదువుకున్నామా.. మన అమ్మానాన్న కూర్చోపెట్టి చదివించారా.. అని ఆలోచిస్తే.. నా రోజుల్లో అమ్మ నాన్న తమ సమయం ఎంత కేటాయించారో గుర్తొచ్చింది..
ఇప్పుడు ఒక్క నిమిషం దొరికితే ఫోన్ పట్టుకొని ఏదో వెతికేసే ప్రయత్నం లోనే అందరం ఉంటున్నాం.. ఆ డబ్బా లో ఏమి చావదు అని తెలిసినా మళ్ళీ ఆ ఫోన్ వైపే వేళ్ళు వెళ్ళిపోతుంటాయి తప్ప బాబుని కూర్చోపెట్టుకుని.
"బాబు ఏంట్రా నీకు ఏమి ఇబ్బంది.. నేను చెప్పనా "అని చదువు చెప్పే ఓపిక నశించింది అని అర్ధం అయ్యింది...
ఇంకా ఎవర్నో నిందించి ప్రయోజనం లేదు అని అర్ధం అయింది..
ఇక నుంచి రోజు ఒక గంట కచ్చితంగా బాబు చదువు కోసం వెచ్చించాలి అని ఒక నిర్ణయం తీసుకున్నాను..
బాబు కూడా సంతోషాపడ్డాడు.. మనం బరిలోకి దిగితే వేరేలాగా ఉంటుంది అని నిరూపించాము..
వర్క్ బుక్స్ వదిలేసి.. టెక్స్ట్ బుక్ లో నుంచి నోట్స్ ఎలా రాసుకోవాలో నేర్పించాను...
ఫాస్ట్ గా కాకుండా స్లో గా ఎలా చదివితే బుర్రకి ఎక్కుతుందో చెప్పాను..
చూస్తూనే హాఫ్ ఇయర్లి ఎగ్జామ్స్ వచ్చాయి... నేను ఒకటే చెప్పను
.. 1st ర్యాంక్ రావాలంటే .. 3 పాయింట్లు రాసుకో అని చెప్పను
1) నాకు ఎంత టైమ్ ఉంది
2)ఎన్ని చదవాలి ( ఓకే పేపర్ లో అన్ని నంబర్స్ వేసి ఉంచుకో ) 🔲
3) ఎన్ని చదవగలిగాను ( చదివిన వి అన్ని టిక్ ✅ చేసుకో )
అన్ని నంబర్స్ కి టిక్స్ ✅ వచ్చాయి అంటే నీ విజయాన్ని ఎవరూ ఆపలేరు.. అని
అప్పుడు నువ్వు ఎగ్జామ్స్ సిద్ధం గా ఉన్నట్టు..
ఇప్పుడు చిన్ను మర్క్స్ తక్కువ వస్తాయా రావా అని భాధ పడట్లేదు.. ఎందుకంటే ఎన్ని వచునో ఎన్ని రావో ముందే తెల్సు కాబట్టి..
ఒక రోజు స్కూల్ నుంచి ఇంటికి వస్తూనే.. చెప్పాడు.. తనకు మళ్ళీ మళ్ళీ మంచి మార్కులు వచ్చి నందుకు సెక్షన్ c నఃంచి సెక్షన్a కి మార్చారు అని సంతోషంగా...

94 ) రోలింగ్ టైటిల్స్.. కథ :

  రోలింగ్ టైటిల్స్.. కథ :  ~~~~~~~~~~~~~~~~~~~ గగన్ ఒక మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్. గొంతులో వైవిధ్యం, పాత్రకు తగ్గట్టుగా ప్రాణం పోయగల ప్రతిభ అతన...